AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా ఊరట: తగ్గుతున్న మరణాల రేటు..కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడి

మన దేశంలో కోవిడ్‌-19 మరణాల రేటు క్రమంగా తగ్గుతోందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రపంచంలోని మిగతా దేశాలతో పోలిస్తే..భారత్‌లో మరణాల రేటు తక్కువ అని కేంద్ర ఆరోగ్య శాఖ కీలక ప్రకటన చేసింది.

కరోనా ఊరట: తగ్గుతున్న మరణాల రేటు..కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడి
Jyothi Gadda
|

Updated on: Jul 20, 2020 | 4:19 PM

Share

మన దేశంలో కోవిడ్‌-19 మరణాల రేటు క్రమంగా తగ్గుతోందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రపంచంలోని మిగతా దేశాలతో పోలిస్తే..భారత్‌లో మరణాల రేటు తక్కువ అని కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం కీలక ప్రకటన చేసింది. ప్రస్తుతం దేశంలో మరణాల రేటు 2.49 శాతంగా ఉందని చెప్పింది. 29 రాష్ట్రాలు, యూనియన్‌ టెరిటరీస్‌లో ఫాటిలిటీ రేట్‌ (సీఎఫ్‌ఆర్‌‌) ఇండియా 2.5శాతం కంటే తక్కువగా నమోదవుతుందని చెప్పారు.

భారత్‌లో కరోనా మరణాల రేటు మే 12న 3.2 శాతం నుండి జూన్‌1 నాటికి 2. 82 శాతానికి తగ్గిందని, ఇక ఇది జూలై 10న 2. 72 శాతానికి, ప్రస్తుతం 2.49 శాతానికి తగ్గిందని స్పస్టం చేసింది కేంద్రం. దాదాపు ఐదు రాష్టాల్లో సీఎఫ్‌ఆర్‌‌ జీరో అని, 14 రాష్ట్రాల్లో 1 శాతం కంటే తక్కువగా ఉందని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఉత్తమమైన క్లినికల్‌ మేనేజ్‌మెంట్‌, హాస్పిటల్స్‌లో మెరుగైన సౌకర్యాలు కల్పించడం వల్ల మరణాల రేటు తక్కువగా నమోదవుతుందని కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది.

కేంద్ర ప్రభుత్వ మార్గ దర్శకాల మేరకు రాష్ట్రాలు, యూనియన్‌ టెరిటరీలు టెస్టులు పెంచి సరైన జాగ్రత్తలు తీసుకున్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. జాతీయ సగటు కంటే తక్కువ సిఎఫ్ఆర్ ఉన్న రాష్ట్రాలు, యూనియన్‌ టెరిటరీలు(యుటిల) త్రిపుర (0.19%), అస్సాం (0.23%), కేరళ (0.34%), ఒడిశా (0.51%), గోవా (0.60%), హిమాచల్ ప్రదేశ్ (0.75%), బీహార్ ( 0.83%), తెలంగాణ (0.93%), ఆంధ్రప్రదేశ్ (1.31%), తమిళనాడు (1.45%), చండీగ (్ (1.71%), రాజస్థాన్ (1.94%), కర్ణాటక (2.08%), ఉత్తర ప్రదేశ్ (2.36%)గా ఉందని వివరించారు. మణిపూర్‌‌, నాగాలాండ్‌, సిక్కిం, మిజోరాం, అండమాన్‌ అండ్‌నికోబార్‌‌ ఐలాండ్‌లో జీరో కేస్‌ ఫాటలిటీ రేట్‌ ఉంది.

కోవిడ్‌ -19 మరణాల తగ్గింపుకు టెక్నాలజీ కూడా చాలా బాగా ఉపయోగపడిందని చెప్పారు. గ్రౌండ్‌ లెవల్‌లో ఫ్రంట్‌ లైన్‌ హెల్త్‌ వర్కర్లు, ఆశా, ఏఎన్‌ఎమ్‌లు చాలా కృషి చేశారు. మైగ్రెంట్స్‌ని గుర్తించి వారికి టెస్టులు చేసి జాగ్రత్తలు తీసుకోవడంలో కృషి చేశార అని చెప్పింది. ఇది దేశ ప్రజారోగ్య యంత్రాంగం చేసిన ప్రశంసనీయమైన పనిగా కేంద్ర మంత్రిత్వ శాఖ ప్రశంసించింది.

బ్రహ్మమూహూర్తంలో మేల్కొంటే ఏం జరగుతుందో తెలుసా? సైన్స్ రహస్యం ఇదే
బ్రహ్మమూహూర్తంలో మేల్కొంటే ఏం జరగుతుందో తెలుసా? సైన్స్ రహస్యం ఇదే
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
మీ జుట్టు ఒత్తుగా పెరగాలా.. అయితే బీరుతో ఇలా చేస్తే చాలు..
మీ జుట్టు ఒత్తుగా పెరగాలా.. అయితే బీరుతో ఇలా చేస్తే చాలు..
తేనె, బెల్లం నిజంగా ఆరోగ్యకరమేనా? షాకింగ్ నిజాలు!
తేనె, బెల్లం నిజంగా ఆరోగ్యకరమేనా? షాకింగ్ నిజాలు!
హరిదాసుల సందడి.. వీళ్లు ఈ సీజన్ లోనే ఇంటింటికీ ఎందుకు వస్తారు ??
హరిదాసుల సందడి.. వీళ్లు ఈ సీజన్ లోనే ఇంటింటికీ ఎందుకు వస్తారు ??
OTTలో బిగ్గెస్ట్ కాంట్రవర్సీ మూవీ.. ఐఎమ్‌డీబీలో 8.6/10 రేటింగ్
OTTలో బిగ్గెస్ట్ కాంట్రవర్సీ మూవీ.. ఐఎమ్‌డీబీలో 8.6/10 రేటింగ్
డిసెంబర్ 31న గిగ్ వర్కర్ల సమ్మెతో వీటిపై భారీ ప్రభావం..
డిసెంబర్ 31న గిగ్ వర్కర్ల సమ్మెతో వీటిపై భారీ ప్రభావం..
ఇష్టమని ఊరగాయ పచ్చడి లాగించేస్తున్నారా? ఐతే మీకీ విషయం చెప్పాలి
ఇష్టమని ఊరగాయ పచ్చడి లాగించేస్తున్నారా? ఐతే మీకీ విషయం చెప్పాలి
ఆటోడ్రైవర్‌ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
ఆటోడ్రైవర్‌ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
మీ ఇంటి మెట్ల కింద ఇవి ఉంటే వెంటనే తీసేయండి.. లేదంటే కష్టాలు..
మీ ఇంటి మెట్ల కింద ఇవి ఉంటే వెంటనే తీసేయండి.. లేదంటే కష్టాలు..