గుజరాత్‌లో కోవిడ్ కేర్‌ సెంటర్‌గా మసీదు..

దేశ వ్యాప్తంగా కోవిడ్‌ కేసుల సంఖ్య భారీగా నమోదవుతోంది. మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, గుజరాత్‌ మొదలగు రాష్ట్రాలలో కరోనా వైరస్‌ అడ్డూ అదుపులేకుండా విజృంభిస్తోంది. రోగుల సంఖ్య పెరిగే కొద్దీ ప్రభుత్వాలు మరిన్నీ కోవిడ్‌ సెంటర్లు ఏర్పాటు చేయాల్సి వస్తోంది. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో..

  • Jyothi Gadda
  • Publish Date - 4:55 pm, Mon, 20 July 20
గుజరాత్‌లో కోవిడ్ కేర్‌ సెంటర్‌గా మసీదు..

దేశ వ్యాప్తంగా కోవిడ్‌ కేసుల సంఖ్య భారీగా నమోదవుతోంది. మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, గుజరాత్‌ మొదలగు రాష్ట్రాలలో కరోనా వైరస్‌ అడ్డూ అదుపులేకుండా విజృంభిస్తోంది. రోగుల సంఖ్య పెరిగే కొద్దీ ప్రభుత్వాలు మరిన్నీ కోవిడ్‌ సెంటర్లు ఏర్పాటు చేయాల్సి వస్తోంది. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో కరోనా కేర్ సెంటర్లు ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నాయి. అయినా భారీ సంఖ్యలో నమోదవుతున్న కేసుల కారణంగా చాలా మందికి బెడ్లు దొరకని పరిస్థితి ఏర్పడుతోంది. దీంతో ఓ మసీదు నిర్వాహకులు కరోనా సోకిన వారికోసం మసీదును కరోనా కేర్ సెంటర్ గా ఏర్పాటు చేసి వైద్య సౌకర్యం కల్పిస్తున్నారు.

గుజరాత్ లో గోద్రాలో గల ఓ మసీదు యజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా బారినపడి వైద్యం అందక అవస్థలు పడుతున్న బాధితులకు అండగా నిలుస్తోంది. వైరస్‌ బారినపడ్డ వారికి వైద్యం అందేలా చర్యలు తీసుకుంది. తమ మసీదులోని ఒక ఫ్లోర్‌ను క‌రోనా బాధితుల కోసం కేటాయించింది. ప్రార్ధనా స్థలాన్ని కరోనా కేర్ సెంటర్ గా మార్చింది. ప్రస్తుతం ఇక్కడ వివిధ వ‌ర్గాల‌కు చెందిన 9 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నట్లుగా నిర్వాహకులు వెల్లడించారు.