AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా వ్యాక్సిన్ తయారీ.. రేస్‌లో ఏడు భారత సంస్థలు..

కరోనా వ్యాక్సిన్‌పై ప్రయోగాలు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే భారత్ నుంచి ఏడు ప్రముఖ ఫార్మా సంస్థలు టీకాను అభివృద్ధి చేస్తున్నాయి.

కరోనా వ్యాక్సిన్ తయారీ.. రేస్‌లో ఏడు భారత సంస్థలు..
Ravi Kiran
|

Updated on: Jul 20, 2020 | 5:18 PM

Share

COVID Vaccine: యావత్ ప్రపంచాన్ని కరోనా వైరస్ గజగజలాడిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతుండటం ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే ఈ మహమ్మారి బారిన పడినవారి సంఖ్య 14,668,105 చేరుకోగా.. వైరస్ కారణంగా 609,511 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక ఈ మహమ్మారి వైరస్‌ను కట్టడి చేసే విరుగుడును కనిపెట్టేందుకు వివిధ దేశాల శాస్త్రవేత్తలు రాత్రింబవళ్ళు శ్రమిస్తున్నారు. వ్యాక్సిన్‌పై ప్రయోగాలు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే భారత్ నుంచి ఏడు ప్రముఖ ఫార్మా సంస్థలు టీకాను అభివృద్ధి చేస్తున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం…

భారత్ బయోటెక్: కొవాక్జిన్ టీకా.. ఇటీవలే ఫేజ్ 1, ఫేజ్ 2 క్లినికల్ ట్రయిల్స్‌కు అనుమతి పొందింది. గతవారమే మనుషులపై ప్రయోగాలు ప్రారంభించింది.

సీరమ్ ఇనిస్టిట్యూట్: ఆస్ట్రాజెనికా ఆక్స్‌ఫర్డ్‌ టీకాపై పని చేస్తున్న ఈ సంస్థ.. డిసెంబర్ నాటికీ వ్యాక్సిన్ తీసుకొస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆస్ట్రాజెనికా ఆక్స్‌ఫర్డ్‌ టీకా మూడో దశ క్లినికల్ ట్రయిల్స్ కొనసాగుతున్నాయి. ఇక భారత్‌లో ఆగష్టు నాటికి ఈ టీకా క్లినికల్ ట్రయిల్స్ ప్రారంభమవుతాయి.

జైడస్ కాడిలా: ZyCoV-D వ్యాక్సిన్ క్లినికల్ ట్రయిల్స్‌ను ఏడు నెలల్లో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని చూస్తోంది.

పనాసియా బయోటెక్: అమెరికాకు చెందిన రెఫానా ఇంక్‌ సంస్థతో కలిసి కోవిడ్ వ్యాక్సిన్ తయారీకి ఐర్లాండ్‌లో జాయింట్ వెంచర్ ఏర్పాటు చేసినట్లు జూన్‌లో ప్రకటించింది.

ఇండియన్ ఇమ్యూనోలాజికల్స్ సంస్థ: ఈ ఫార్మా కంపెనీ కోవిడ్ వ్యాక్సిన్‌ను తయారు చేసేందుకు ఆస్ట్రేలియాకు చెందిన గ్రిఫిత్ విశ్వవిద్యాలయంతో ఒప్పందం కుదుర్చుకుంది. అలాగే ‘బయోలాజికల్ ఈ’, మైన్వాక్స్ సంస్థలు కూడా కోవిడ్ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నాయి.

Also Read:

సుశాంత్ ఆత్మతో కబుర్లు.. మరిన్ని అనుమానాలు.. వైరలవుతున్న మరో వీడియో..

ఏపీలో గ్రామ, వార్డు సచివాలయ పరీక్షలు మళ్లీ వాయిదా..

ఏపీలో కరోనా కల్లోలం.. ఆ జిల్లాలో 31 వరకు లాక్‌డౌన్‌..