బాలీవుడ్‌లో రీమేక్ కానున్న మరో తెలుగు సూపర్ హిట్ సినిమా..

మరో తెలుగు సూపర్ హిట్ సినిమా బాలీవుడ్‌లో రీమేక్ కాబోతుంది. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో రీమేక్‌ల ట్రెండ్ కొనసాగుతోంది. వివిధ భాషల్లో సూపర్ హిట్ అయిన సినిమాలను మాతృభాషలోకి రీమేక్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే బాలీవుడ్‌‌ దర్శక నిర్మాతల కన్ను టాలీవుడ్‌ సినిమాలపై...

బాలీవుడ్‌లో రీమేక్ కానున్న మరో తెలుగు సూపర్ హిట్ సినిమా..
Follow us

| Edited By:

Updated on: Jul 20, 2020 | 5:05 PM

మరో తెలుగు సూపర్ హిట్ సినిమా బాలీవుడ్‌లో రీమేక్ కాబోతుంది. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో రీమేక్‌ల ట్రెండ్ కొనసాగుతోంది. వివిధ భాషల్లో సూపర్ హిట్ అయిన సినిమాలను మాతృభాషలోకి రీమేక్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే బాలీవుడ్‌‌ దర్శక నిర్మాతల కన్ను టాలీవుడ్‌ సినిమాలపై పడింది. ఇటీవల తెలుగులో సూపర్ హిట్ అయి, బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సినిమాలను హిందీలో రీమేక్ చేస్తున్నారు. ఇప్పటికే విజయ్ దేవర కొండ హీరోగా వచ్చిన చిత్రం ‘అర్జున్ రెడ్డి’ని అక్కడ ‘కబీర్ సింగ్’ పేరుతో రీమేక్ చేశారు. ఆ తర్వాత నేచురల్ స్టార్ నాని నటించిన ‘జెర్సీ’ సినిమా, విశ్వక్ చేసిన థ్రిల్లర్ మూవీ ‘హిట్‌’, యంగ్ హీరో రామ్ హీరోగా చేసిన మాస్ మూవీ ‘ఇస్మార్ట్ శంకర్’‌ని కూడా రీమేక్ చేయడానికి రెడీ అయ్యారు. ఇక్కడ డైరెక్షన్ వహించిన డైరెక్టర్లే అక్కడ కూడా దర్శకత్వం వహిస్తున్నారు.

ఇప్పుడు తాజాగా మరో తెలుగు సినిమా కూడా బాలీవుడ్‌లో రీమేక్ చేయడానికి సన్నాహాలు మొదలయ్యాయి. కామెడీ, థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రం ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ సినిమా కూడా బాలీవుడ్‌కు వెళ్లనుందని తెలుస్తుంది. విభిన్నమైన కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ చిత్రం హిందీ ప్రేక్షకులను కూడా అలరించబోతుంది. స్వయంగా ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ సినిమా దర్శక, నిర్మాతలే ఈ చిత్రాన్ని హీందీకి తీసుకు వెళ్లబోతున్నారనే వార్తలు వస్తున్నాయి. కాగా త్వరలోనే ఈ విషయం క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Read More: 

బిగ్ బ్రేకింగ్: ఏపీ మంత్రి వర్గ విస్తరణ ముహూర్తం ఖరారు..

బద్ధలైన అగ్ని పర్వతం.. మొదటిసారిగా కెమెరాకు చిక్కిన దృశ్యాలు

దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?