Booster Dose: బూస్టర్‌ డోస్‌ కరోనా నుంచి పూర్తి రక్షణ కల్పిస్తుందా? నిపుణులు ఏమంటున్నారంటే..

Coronavirus: కరోనా కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్న వేళ..18 ఏళ్ల పైబడిన వారందరికీ బూస్టర్ డోస్ వేసేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

Booster Dose: బూస్టర్‌ డోస్‌ కరోనా నుంచి పూర్తి రక్షణ కల్పిస్తుందా? నిపుణులు ఏమంటున్నారంటే..
Booster Dose
Follow us
Basha Shek

|

Updated on: Apr 09, 2022 | 9:16 PM

Coronavirus: కరోనా కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్న వేళ..18 ఏళ్ల పైబడిన వారందరికీ బూస్టర్ డోస్ వేసేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అన్ని ప్రైవేటు వ్యాక్సినేషన్ సెంటర్లలోనూ ఆదివారం అనగా ఏప్రిల్ 10వ తేదీ నుంచి బూస్టర్ డోస్ అందుబాటులో ఉంటుందని స్పష్టం చేసింది. కొవిడ్ వ్యాక్సిన్ రెండో డోస్ తీసుకుని తొమ్మిది నెలలు గడిచిన వారు ఈ బూస్టర్ డోస్‌కు అర్హులని కేంద్రం ప్రకటించింది. కోవిడ్ వ్యాక్సిన్ మొదటి, రెండు డోసులతో పాటు 60 ఏళ్ల పైబడిన వారికి, ఫ్రంట్ లైన్ వారియర్స్, హెల్త్ వర్కర్లకు ఇస్తోన్న ప్రికాషనరీ డోస్(బూస్టర్) ప్రక్రియను మరింత వేగవంతం చేయనున్నట్లు తెలిపింది. కాగా కరోనా కట్టడిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యను స్వాగతిస్తూ మేదాంత ఆస్పత్రి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ నరేష్ ట్రెహాన్ న్యూస్9 తో మాట్లాడారు .

బూస్టర్‌ డోస్‌ తీసుకుంటే..

‘కేంద్ర ప్రభుత్వం చాలా మంచి నిర్ణయం తీసుకుంది. తొమ్మిది నెలల తర్వాత బూస్టర్ డోస్ తీసుకుంటే SARS CoV 2 నుంచి మరింత మెరుగైన రక్షణ అందుతుంది. ఒక వ్యక్తిలోని యాంటీ బాడీల లెక్కను బట్టే అతనిలోని రోగనిరోధక శక్తిని అంచనా వేయవచ్చు. ఇది ఎంత కచ్చితమో మాకు కూడా తెలియదు. అయితే కరోనా లాంటి వైరస్‌లను ఎదుర్కోవడంలో రోగనిరోధక శక్తే ప్రధాన ఆయుధం. దీనిని కొలవాలంటే యాంటీబాడీలే ప్రామాణికం. కొవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత టీకా ద్వారా శరీరంలో ఉత్పత్తైన యాంటీ బాడీలు ఆరు నెలల తర్వాత క్షీణిస్తాయి. ఈక్రమంలో బూస్టర్‌ డోస్‌ తీసుకోవడం వల్ల కరోనా లాంటి వైరస్‌ల నుంచి మరింత రక్షణ అందుతుంది. ప్రికాషన్‌ డోస్‌ తీసుకోవడం వల్ల ప్రధానంగా రెండు ప్రయోజనాలున్నాయి. ఈ టీకా తీసుకున్న వారు తక్కువగా వైరస్‌ల బారిన పడతారు. సో.. ఆటోమెటిక్‌గా వైరస్ బాధితుల సంఖ్య తగ్గిపోతుంది. ఇక రెండో ప్రయోజనమేమిటంటే.. ఈ టీకా తీసుకున్న వారిలో వైరస్‌ సోకినా తీవ్రత తక్కువగా ఉంటుంది. ఇక రెండో డోసు తీసుకున్న తొమ్మిది నెలల తర్వాత బూస్టర్‌ డోసు తీసుకోవాలని కేంద్రం నిర్ణయించడం చాల మేలైన చర్యనిపిస్తోంది. సాధారణంగా టీకా తీసుకున్న ఆరు నెలల తర్వాత శరీరంలో యాంటీ బాడీలు క్షీణిస్తాయి. అయితే ప్రికాషనరీ డోస్‌ ఆలస్యంగా తీసుకున్నా పూర్తి ప్రయోజనాలు చేకూరుతాయి’

డేటా కోసం ఎదురుచూడకుండా..

‘ప్రస్తుతం చాలా దేశాల్లో మళ్లీ వైరస్‌ విజృంభిస్తోంది. కొత్త కొత్త వేరియంట్లతో దాడి చేస్తోంది. ఈ వైరస్‌ల రూపాంతరంపై ఒక అవగాహనకు రాలేకపోతున్నాం. అయితే ఎలాంటి వేరియంట్లు వచ్చినా సమర్థంగా ఎదుర్కొనేలా ఉండాలి. ఇక 60 ఏళ్లు పైబడిన వారికి, హెల్త్‌ వర్కర్లు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు మాత్రమే ముందుగా బూస్టర్ డోసు ఇవ్వాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. చాలామంది దీనిపై కొన్ని సందేహాలు వెలిబుచ్చారు. బూస్టర్‌ డోస్‌ ఇస్తోన్న దేశాల్లో ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతున్నాయో డేటా కావాలంటున్నారు. అయితే డేటా వచ్చేవరకు ఎదురుచూడడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉండవు. పైగా వైరస్ మరింత వ్యాప్తి చెందే అవకాశం ఉంది. ఈ విషయంపై వైరాలజిస్టులు, సైంటిస్టులు పరిశోధనలు కొనసాగిస్తున్నారు. అయితే తగినన్ని టీకాలు అందుబాటులో ఉంటే అవసరమైన వారికి వాటిని సరఫరా చేయడం ఎంతో మంచిది. దీన్ని కచ్చితంగా పాటించాలని చెప్పడం లేదు కానీ.. అర్హత ఉండి అందుబాటులో ఉన్నవారందరికీ టీకాలు ఇస్తే మంచిది’

ఆ విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి..

‘కరోనా వల్ల ఆరోగ్యంపై మరింత శ్రద్ధ పెరిగింది. చాలామంది తమ జీవనశైలిలో మార్పులు చేసుకున్నారు. అయితే టీకాలు తీసుకున్నప్పటికీ కొందరిలో కొన్ని రకాల అనారోగ్య సమస్యలు తలెత్తున్నాయి. ముఖ్యంగా రక్తపోటు, ఊపిరితిత్తులు, గుండె సమస్యలు ఉన్నవారిలో కొన్ని ప్రాబ్లమ్స్‌ వస్తు్న్నాయి. ఇవన్నీ లాంగ్‌ కొవిడ్‌ సమస్యలే. అందుకే కొవిడ్ టీకాలు తీసుకున్నప్పటికీ ఆరోగ్యం విషయంలో అలక్ష్యం వహింకూడదు. ఏ మాత్రం అనుమానమొచ్చినా ముఖ్యంగా గుండె, ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడేవారు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి. అంతేకానీ పరిస్థితి విషమించేవరకు ఎదురుచూడకూడదు. ఇక కొవిడ్ మృతుల్లో దీర్ఘకాలిక రోగులే ఎక్కువగా ఉన్నారు. ముఖ్యంగా గుండె జబ్బులకు సంబంధించిన వారే కరోనాతో ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ విషయంపై మనం పూర్తిగా దృష్టి సారించాల్సి ఉంది. స్టెంట్‌లతో లేదా బైపాస్ సర్జరీలు చేయించుకున్న వారు రెగ్యులర్‌ చెకప్‌లు చేయించుకోవాలి. మెరుగైన జీవనశైలిని ఎంచుకోవాలి. అప్పుడే కరోనా లాంటి వైరస్‌ల నుంచి రక్షణ పొందగలుగుతాం.’ అని నరేష్ ట్రెహాన్ చెప్పుకొచ్చారు.

Also Read: AP Crime: ప్రేమించిన యువతి ఫోన్ ఎత్తట్లేదని.. ప్రియుడు ఏం చేశాడో తెలిస్తే షాక్ అవుతారు

Viral: వామ్మో! ఈ కి’లేడి’ మహా ముదురు.. ఏకంగా ప్రైవేట్ పార్టులోనే దాచిపెట్టేసిందిగా.. అది చూసి పోలీసుల అవాక్!

Viral: వామ్మో! ఈ కి’లేడి’ మహా ముదురు.. ఏకంగా ప్రైవేట్ పార్టులోనే దాచిపెట్టేసిందిగా.. అది చూసి పోలీసుల అవాక్!

రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట
ఇస్లాం మతంలోకి మారాలని అభిమాని సలహా.. బిగ్ బాస్ బ్యూటీ ఏమందంటే?
ఇస్లాం మతంలోకి మారాలని అభిమాని సలహా.. బిగ్ బాస్ బ్యూటీ ఏమందంటే?
అనిల్‌ అంబానీ లగ్జరీ ఇల్లు గురించి మీకు తెలుసా? దాని విలువ ఎంతంటే
అనిల్‌ అంబానీ లగ్జరీ ఇల్లు గురించి మీకు తెలుసా? దాని విలువ ఎంతంటే
మద్యం సేవించినా ఏమీ కాకూడదంటే పచ్చి మిర్చి తింటే చాలు..
మద్యం సేవించినా ఏమీ కాకూడదంటే పచ్చి మిర్చి తింటే చాలు..