AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Covid Vaccine Booster: నేటి నుంచి కోవిడ్ వ్యాక్సిన్ బూస్టర్ డోసు.. రూ.225కే టీకా..

దేశంలో కరోనా థర్డ్ వేవ్ ఉధృతి తగ్గిందని ఊపిరి పీల్చుకుంటున్న వేళ.. మరోసారి కోవిడ్ వ్యాప్తి అంటూ ఎక్స్ వేరియంట్ రూపంలో కొత్త గుబులు రేపుతోంది.

Covid Vaccine Booster: నేటి నుంచి కోవిడ్ వ్యాక్సిన్ బూస్టర్ డోసు.. రూ.225కే టీకా..
Vaccine
Balaraju Goud
|

Updated on: Apr 10, 2022 | 8:40 AM

Share

Covid 19 Vaccine Booster: దేశంలో కరోనా వైరస్(Coronavirus) థర్డ్ వేవ్ ఉధృతి తగ్గిందని ఊపిరి పీల్చుకుంటున్న వేళ.. మరోసారి కోవిడ్ వ్యాప్తి అంటూ “XE” వేరియంట్(Covid XE Variant) రూపంలో కొత్త గుబులు రేపుతోంది. దేశంలో కరోనా వ్యాప్తిపై మరోమారు వస్తున్న సంకేతాలతో అప్రమత్తమైన కేంద్ర వైద్యారోగ్యశాఖ నివారణ చర్యలు మొదలుపెట్టింది. ఇప్పటికే దేశంలో పలు ప్రాంతాల్లో వెలుగు చూసిన కరోనా కొత్త వేరియంట్ “XE” నేపథ్యంలో..మహమ్మారి వ్యాప్తి కట్టడికి తగిన చర్యలు తీసుకోవాలంటూ కేంద్ర వైద్యారోగ్యశాఖ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేసింది. అందుకనుగుణంగా కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది.

జూన్ – జులై మధ్య దేశంలో కరోనా నాలుగో దశ గరిష్ట స్థాయికి చేరుకోవచ్చన్న వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వాలు ముందస్తు కట్టడి చర్యలు ప్రారంభించాయి. అందులో భాగంగా ఏప్రిల్ 10 నుంచి దేశ వ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సిన్ బూస్టర్ డోస్ పంపిణీ చేయాలనీ కేంద్రం నిర్ణయించింది. 18 ఏళ్లు పైబడిన వారందరికి ఆదివారం నుంచి బూస్టర్ డోస్ అందుబాటులో ఉంచాలని వైద్యారోగ్యశాఖ మార్గదర్శకాలు జారీచేసింది. వ్యాక్సిన్ ధరను గరిష్టంగా రూ.225లుగా ఉంచాలని కూడా కేంద్రం ఆదేశించింది. ప్రభుత్వ, ప్రైవేట్ వ్యాక్సిన్ కేంద్రాల్లో దీనిని అందుబాటులో ఉంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ నేపథ్యంలోనే కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌ కొవిడ్‌ టీకా ముందుజాగ్రత్తగా మూడో డోసు ధరను భారత్‌ బయోటెక్‌, సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (CII)లు తగ్గించాయి. ప్రైవేటు ఆసుపత్రుల్లో వేసుకునే ఈ టీకా ఒక్కో డోసు ధరను రూ. 225గా నిర్ణయిస్తూ శనివారం ప్రకటన చేశాయి. ప్రైవేటు వ్యాక్సినేషన్‌ కేంద్రాలు ఈ టీకా ధరతో పాటు, వినియోగదారుడి నుంచి ఒక్కో డోసుకు సర్వీసు ఛార్జి కింద గరిష్ఠంగా రూ. 150 వరకు వసూలు చేయవచ్చని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ తెలిపారు.

మొత్తంగా ఒక్క డోసు వ్యాక్సినేషన్ కొరకు ఎంత వసూలు చేయనున్నారు అనే విషయాన్ని వ్యాక్సిన్ కేంద్రాలు, ఆసుపత్రులు “CoWin” యాప్ లోనూ పొందుపరచాలని కేంద్రం సూచించింది. దేశ వ్యాప్తంగా 18 ఏళ్లు పైబడిన వారు..ఇప్పటికే రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకుని ఉంటే..వైద్యారోగ్యశాఖ మార్గదర్శకాల మేరకు వారు బూస్టర్ డోసు తీసుకోవచ్చు. గత రెండు డోసులు ఏదైతే టీకాను తీసుకున్నారో..అదే బ్రాండ్ టీకాను బూస్టర్ డోస్ గా తీసుకోవాల్సి ఉంటుంది.

Read Also…. Summer skin care: వేసవిలో ముఖం పొడిబారుతోందా? అయితే సహజ చిట్కాలు మీకోసమే..