- Telugu News Photo Gallery Summer skin care: Follow these home remedies to get rid of dryness on skin in summer in Telugu
Summer skin care: వేసవిలో ముఖం పొడిబారుతోందా? అయితే సహజ చిట్కాలు మీకోసమే..
Dry skin in summer: ఏ సీజన్ లోనైనా పొడి చర్మం చాలామందిని ఇబ్బంది పెడుతుంది. ముఖ్యంగా వేసవిలో పొడి చర్మంతో పాటు పలు సమస్యలు తలెత్తుతాయి. వీటికి ఉపశమనంగా బ్యూటీ ప్రొడక్ట్స్ వాడడం కంటే సహజ చిట్కాలు పాటించడం మంచిది
Updated on: Apr 10, 2022 | 8:36 AM

అలోవెరా జెల్: వేసవిలో చర్మం పొడిబారినట్లయితే రోజూ చర్మంపై కలబందను అప్లై చేయాలి. ఇది చర్మాన్ని లోపలి నుంచి తేమగా ఉంచడంతో పాటు బ్యా్క్టీరియాను కూడా నిర్మూలిస్తుంది. ఫలితంగా దురద సమస్యలు కూడా తగ్గిపోతాయి.

కొబ్బరినూనె: ఎండాకాలం, చలికాలం సీజన్ ఏదైనా చర్మ సంరక్షణలో కొబ్బరినూనె సమర్థంగా పనిచేస్తుంది. ముఖ్యంగా చర్మం పొడిబారడాన్ని బాగా తగ్గి్స్తుంది. పైగా ఇందులో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు చర్మాన్ని మృదువుగా ఉంచుతాయి. కొబ్బరినూనెలోకి కొంచెం బేబీ ఆయిల్ మిక్స్ చేసి ముఖానికి రాసుకుంటే మరిన్ని ప్రయోజనాలు చేకూరుతాయి.

చర్మం పొడిబారకుండా ఉండాలంటే కొన్ని సహజ చిట్కాలు పాటించాలి.

జోజోబా ఆయిల్: ఈ నూనె ప్రత్యేకత ఏమిటంటే ఇది చర్మాన్ని మృదువుగా ఉంచడంతో పాటు మెరుపును కూడా పెంచుతుంది. అందుకే దీన్ని బ్యూటీ ప్రొడక్ట్స్‌లో కూడా ఎక్కువగా వినియోగిస్తున్నారు.ఈ నూనెలో యాంటీ ఏజింగ్ గుణాలు కూడా అధికంగా ఉంటాయి.

ఆలివ్ ఆయిల్: చర్మ సంరక్షణ విషయంలో ఆలివ్ ఆయిల్ సమర్థంగా పనిచేస్తుంది. ముఖ్యంగా పొడి చర్మాన్ని నివారించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. దీన్ని లావెండర్ ఆయిల్‌తో మిక్స్ చేసి, రోజూ చర్మంపై మసాజ్ చేసుకుంటే మంచి ఫలితముంటుంది.

విటమిన్ ఇ: చర్మ సంరక్షణలో విటమిన్ ఇ ముఖ్య పాత్ర పోషిస్తుంది. అందుకే విటమిన్ ఇ క్యాప్సూల్స్ ను పలు సౌందర్య ఉత్పత్తుల్లో వినియోగిస్తారు. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని లోపలి నుండి తేమగా ఉంచుతాయి.




