కరోనా ఎఫెక్ట్.. ఆ మూగజీవుల్ని చంపేసేందుకు రెడీ అయిన సర్కార్..!
కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ వైరస్ బారినపడి ఇప్పటికే లక్షల మంది మరణించారు. దీని ప్రభావం ఇప్పుడు మూగజీవులపై కూడా పడింది.

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ వైరస్ బారినపడి ఇప్పటికే లక్షల మంది మరణించారు. దీని ప్రభావం ఇప్పుడు మూగజీవులపై కూడా పడింది. నెదర్లాండ్స్‌లో ఏకంగా పదివేల మూగజీవులను చంపేయాలని నిర్ణయం తీసుకుంది. ఇక్కడ మింక్ అనే జంతువులను వెంట్రుకల కోసం పెంచుతుంటారు. వీటి ద్వారా ప్రతి ఏటా కోట్ల రూపాయల్లో వ్యాపారం సాగుతుంటుంది. అయితే ఈ మూగజీవులకు కూడా కరోనా సోకుతుందని.. వీటి ద్వారా ఇతర జీవులకు కూడా సోకుతుందని.. అందులో మనుషులకు కూడా సోకుతుందని ప్రభుత్వం పేర్కొంది. దీంతో కరోనా వ్యాప్తికి చెక్ పెట్టాలంటే.. ఈ జంతువులను హతమార్చాల్సిందేనని ఇక్కడి సర్కార్ రెడీ అయ్యింది. ఇప్పటికే ఇక్కడ వీటి ద్వారా ఇద్దరు వ్యక్తులకు కరోనా సోకిందని ప్రభుత్వం పేర్కొంది. ఇక దేశంలో దాదాపు 140 మింక్ ఫామ్స్ ఉన్నాయని.. వీటి ద్వారా ప్రతి ఏటా 90 మిలియన్ యూరోల వ్యాపారం జరుగుతుందని ప్రభుత్వం వెల్లడించింది.