AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘కవరప్ కాదు.. మా తప్పేం లేదు’…కోవిడ్-19 పై చైనా శ్వేతపత్రం

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారిలా విజృంభించడానికి చైనాయే కారణమని, ఈ వైరస్ గురించి ప్రపంచ దేశాలకు సమాచారాన్ని తెలియజేయకుండా కావాలనే జాప్యం చేసిందని..

'కవరప్ కాదు.. మా తప్పేం లేదు'...కోవిడ్-19 పై చైనా శ్వేతపత్రం
Umakanth Rao
| Edited By: |

Updated on: Jun 07, 2020 | 6:27 PM

Share

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారిలా విజృంభించడానికి చైనాయే కారణమని, ఈ వైరస్ గురించి ప్రపంచ దేశాలకు సమాచారాన్ని తెలియజేయకుండా కావాలనే జాప్యం చేసిందని వస్తున్న ఆరోపణల ‘దాడి’ నుంచి తమను తాము రక్షించుకునేందుకు డ్రాగన్ కంట్రీ ఓ శ్వేత పత్రాన్ని విడుదల చేసింది. ‘ఎందుకు మా మీద అంతా బురద జల్లుతున్నారు ? కరోనా రాకాసికి సంబంధించిన అన్ని విషయాలనూ ఈ వైట్ పేపర్ ద్వారా విశదీకరిస్తున్నాం.. వాస్తవాలేమిటో తెలుసుకోండి’ అంటూ సుదీర్ఘమైన సంజాయిషీ ఇచ్చింది.

ఈ వైరస్ ని మొదటిసారిగా గత డిసెంబరు 27 న వూహాన్ లో కనుగొన్నామని, ఇది వైరల్ న్యుమోనియా అని భావించామని, కానీ ఇది మనుషుల నుంచి మనుషులకు సంక్రమించే వైరస్ అని జనవరి 19 న తెలుసుకున్నామని ఈ శ్వేత పత్రంలో ప్రభుత్వం పేర్కొంది. వెంటనే దీన్ని అదుపు చేసేందుకు చర్యలు ప్రారంభించామని వెల్లడించింది. డిసెంబరు 27 న వూహాన్ లోని ఓ ఆసుపత్రిలో దీన్ని ఐడెంటిఫై చేశాక.. స్థానిక ప్రభుత్వం నిపుణులను పిలిపించి రోగుల కండిషన్ ని విశ్లేషించడం ద్వారా ఆయా కేసులను పరిశీలించాలని కోరిందని ఈ పత్రం తెలిపింది. అలాగే క్లినికల్ ట్రయల్ ఫలితాలను, ప్రిలిమినరీ ల్యాబ్, టెస్టింగ్ రిజల్ట్స్ ను కూడా ఆ బృందం అధ్యయనం చేసిందని, చివరకి ఇది వైరల్ న్యుమోనియా అని నిర్ధారించిందని పేర్కొంది. అయితే నేషనల్ హెల్త్ కమిషన్ ఆధ్వర్యంలోని ఉన్నత స్థాయి నిపుణుల బృందం ఈ వైరస్ మానవుల నుంచి మానవులకు వ్యాపిస్తుందని తొలిసారిగా జనవరి 19 న కనుగొంది.. కానీ అంతకు ముందు ఇలా హ్యూమన్ టు హ్యూమన్ ట్రాన్స్ మిషన్ అవుతుందనడానికి   ఆధారాలు లభించలేదు..అని ప్రభుత్వం వివరించింది.

మా దేశంలో శ్వాస కోశ వ్యాధుల నిపుణుడైన వాంగ్  గ్వాంగ్ ఫా నేతృత్వంలోని నిపుణులు కొందరు వూహాన్ లో అడుగు పెట్టగానే అక్కడి కొంతమంది రోగుల లక్షణాలను పరిశీలించారు. ఆలాగే రోగుల సంఖ్య పెరగడాన్ని గుర్తించారు.. హ్యూనాన్ వెట్ మార్కెట్ తో కాంటాక్ట్ లేని రోగులను కూడా ఆ బృందం క్షుణ్ణంగా పరిశీలించి తమ స్టడీని మరికొంత ముందుకు తీసుకువెళ్లారు. ( తమ అధ్యయనాన్ని మెరుగు పరిచారు) అని ఈ శ్వేత పత్రం వివరించింది. గబ్బిలాలు, పాంగో లిన్ లు ఈ వైరస్ సంక్రమణానికి మూలమని అనుమానించామని, కానీ ఆ ఆధారాలు సరిపోలేదని వాంగ్ తెలిపారు. ఇది మానవుల నుంచి మానవులకు వ్యాపిస్తుందా అన్న విషయాన్ని మరింతగా నిర్ధారించాల్సింది సైన్సేనని ఆయన అన్నారు. సరైన నిర్ధారణకు రాకుండా ఒక అభిప్రాయానికి వస్తే అది విపరీత పరిణామాలకు దారి తీస్తుందన్నారు.

కరోనా వైరస్ పుట్టుకపై దర్యాప్తు జరగాలంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించిందని, దీనికి తాము కూడా మద్దతు తెలిపామని ప్రభుత్వం ఈశ్వేతపత్రంలో తెలిపింది. ఈ వైరస్ ని కట్టడి చేయడానికి వూహాన్ లోని ల్యాబ్ తో బాటు హ్యూబే ప్రావిన్స్ అధికారులు కూడా చర్యలు తీసుకోవాలని జనవరి 14  న  ఈ సంస్థ కోరిందని వెల్లడించింది. ఇది మనుషుల నుంచి మనుషులకు వ్యాపిస్తుందని జాంగ్ అనే నిపుణుడు కూడా జనవరి 20 న మళ్ళీ నిర్ధారించగా ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థకు తెలియజేశామని.. దీనిపై ఇన్వెస్టిగేషన్ జరగాలని ఆ సంస్థ కూడా భావించిందని ఈ శ్వేత పత్రం పేర్కొంది. అప్పుడే అమెరికాకు కూడా ఈ సమాచారాన్ని తెలియజేసినట్టు వెల్లడించింది. పైగా కరోనా వైరస్ జీనోమ్ సీక్వెన్స్ ని కూడా విడుదల చేసినట్టు చైనా ప్రభుత్వం తెలిపింది.

Follow Us
పైలట్లుగా ఉన్న తండ్రీ కూతురి.. సరదా సంభాషణ... నెట్టింట వైరల్!
పైలట్లుగా ఉన్న తండ్రీ కూతురి.. సరదా సంభాషణ... నెట్టింట వైరల్!
2 కోట్లతో బడ్జెట్.. 122 కోట్ల కలెక్షన్స్.. 21 ఏళ్ల అమ్మాయి సంచలనం
2 కోట్లతో బడ్జెట్.. 122 కోట్ల కలెక్షన్స్.. 21 ఏళ్ల అమ్మాయి సంచలనం
నిమ్మకాయ,లవంగాలతో దోమలను ఇంట్లోంచి ఈజీగా తరిమేయండి..ఖర్చులేని పని
నిమ్మకాయ,లవంగాలతో దోమలను ఇంట్లోంచి ఈజీగా తరిమేయండి..ఖర్చులేని పని
పాలు, గుడ్లు కన్నా పవర్ఫుల్.. రోజూ గిన్నెడు తింటే చాలు
పాలు, గుడ్లు కన్నా పవర్ఫుల్.. రోజూ గిన్నెడు తింటే చాలు
కొలెస్ట్రాల్, బీపీ టెన్షన్ పోవాలంటే.. రోజూ తిన్న తర్వాత ఈ చిన్న..
కొలెస్ట్రాల్, బీపీ టెన్షన్ పోవాలంటే.. రోజూ తిన్న తర్వాత ఈ చిన్న..
NEET PGలో కీలక మార్పు.. ప్లీజ్ చెక్!
NEET PGలో కీలక మార్పు.. ప్లీజ్ చెక్!
స్పీకర్ గడ్డం ప్రసాద్ కంటతడి.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
స్పీకర్ గడ్డం ప్రసాద్ కంటతడి.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
మూడు శుభ గ్రహాలు అనుకూలం.. వీరికి ఇక సమస్యలు లేని జీవితం
మూడు శుభ గ్రహాలు అనుకూలం.. వీరికి ఇక సమస్యలు లేని జీవితం
కొత్త ఇల్లు నిర్మించేటప్పుడు పునాది లెవల్‌ వరకు ఎంత ఖర్చు ?
కొత్త ఇల్లు నిర్మించేటప్పుడు పునాది లెవల్‌ వరకు ఎంత ఖర్చు ?
మంచి జీవితం చూపిస్తానని చెప్పి.. తీసుకెెళ్లి వ్యభిచార కూపంలోకి..
మంచి జీవితం చూపిస్తానని చెప్పి.. తీసుకెెళ్లి వ్యభిచార కూపంలోకి..