Donkey Milk for Corona: కరోనా నుంచి బయటపడటానికి గాడిద పాలు మేలట.. ఒక్క స్పూన్ ధర తెలిస్తే గుండాగిపోతుంది!

తెలివి తేటలు ఉంటే ఎడారిలో కూడా రగ్గులు అమ్మొచ్చు అంటారు. సమయానుకూలంగా వ్యాపారం చేయడం అనేది అందరికీ చేత కాదు. అందులోనూ మనుషుల బలహీనతలని క్యాష్ చేసుకోవడం అంటే ఎంత తెలివి ఉండాలి.

Donkey Milk for Corona: కరోనా నుంచి బయటపడటానికి గాడిద పాలు మేలట.. ఒక్క స్పూన్ ధర తెలిస్తే గుండాగిపోతుంది!
Donkey Milk For Corona
Follow us
KVD Varma

|

Updated on: Dec 10, 2021 | 3:46 PM

Donkey Milk for Corona: తెలివి తేటలు ఉంటే ఎడారిలో కూడా రగ్గులు అమ్మొచ్చు అంటారు. సమయానుకూలంగా వ్యాపారం చేయడం అనేది అందరికీ చేత కాదు. అందులోనూ మనుషుల బలహీనతలని క్యాష్ చేసుకోవడం అంటే ఎంత తెలివి ఉండాలి. ఇదిగో ఈ వ్యక్తులు ఆ పనే చేస్తున్నారు. కరోనా అంటే ప్రజల్లో ఉన్న భయాన్ని తెలివిగా క్యాష్ చేసుకుంటున్నారు. గాడిద పాలను అమృతం అని చెప్పి వేలాది రూపాయలకు అమ్మేస్తున్నారు. ఆ కథేంటో మీరూ తెలుసుకోండి..

మహారాష్ట్రలోని హింగోలి జిల్లాలో కరోనా ఇన్ఫెక్షన్ మూడో వేవ్ భయాల మధ్య గాడిద పాలను లీటరుకు రూ.10,000 చొప్పున విక్రయిస్తున్నారు. గాడిద పాలు తాగడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుందని, కరోనా వంటి అంటువ్యాధులను కూడా ఎదుర్కోవచ్చని పాల విక్రయదారులు పేర్కొంటున్నారు. గాడిద పాలు తీసుకోవడానికి పెద్ద సంఖ్యలో ప్రజలు ఎగబడుతున్నారు. అక్కడి మీడియా చెబుతున్న సమాచారం ప్రకారం, డిమాండ్ పెరగడంతో, సమీప జిల్లాల ప్రజలు కూడా హింగోలికి వచ్చి గాడిద పాలను విక్రయించడం ప్రారంభించారు. ఒక చెంచా పాలు తాగితే అన్ని రకాల రోగాలు దూరమవుతాయని పాలు అమ్మేవారు చెబుతున్నారు.ఇవి ఆకర్షణీయమైన పాలు.. వీటిని తాగడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి.

పాలు అమ్మేవారు ఏం చెబుతున్నారంటే..

గాడిద పాలు పిల్లలను న్యుమోనియా నుంచి రక్షిస్థాయి అని గాడిద పాలు విక్రయించే వారు ప్రచారం చేస్తున్నారు. ఇది కాకుండా, జ్వరం, దగ్గు, కఫం వంటి వ్యాధులతో బాధపడుతున్న కరోనా రోగిలో రోగనిరోధక శక్తిని పెంచడానికి గాడిద పాలు అద్భుతంగా పనిచేస్తాయని మైకు పట్టుకుని మరీ ప్రచారం చేస్తూ వస్తున్నారు.

ఒక చెంచా పాల ధర ఎంతంటే..

గాడిద పాలు విక్రయించే బాలాజీ మీసేవాద్ మాట్లాడుతూ తాజా పాలను తీసి విక్రయిస్తున్నట్లు తెలిపారు. ఇది అనేక వ్యాధులపై ప్రభావవంతంగా ఉంటుంది. ఒక చెంచా పాల ధర 100 రూపాయలు కాగా లీటర్ పాలను 10 వేల రూపాయలకు విక్రయిస్తున్నారు. గాడిద పాలలో చర్మం, శరీరం రెండింటికీ పోషకాలు పుష్కలంగా ఉన్నాయని విక్రేతలు చెబుతున్నారు.

గాడిద పాలే మేలు..

నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఈక్విన్ (NRCE) ప్రకారం.. గాడిద పాలు అద్భుత లక్షణాలు కలిగి ఉంటాయి. తల్లి పాలలో ఉండే పోషకాలు గాడిద పాలల్లో కూడా ఉన్నాయి. మేక, ఒంటె, గేదె పాల కంటే ఈ పాల నాణ్యత మెరుగ్గా ఉంటుంది. దాని పాలలో కొవ్వు ఉండదు. గాడిద పాలలో యాంటీ-ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి వృద్ధాప్యం ప్రతికూల ప్రభావాలను నివారిస్తాయి.

ఇది అనేక వ్యాధులతో పోరాడగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. పిల్లల జీర్ణశక్తిని పెంచడంలో ఈ పాలు చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. చర్మం మృదువుగా ఉంటుంది. అనేక రకాల చర్మ వ్యాధులను కూడా దీని నుంచి నివారించవచ్చు. గాడిద పాలతో వ్యాధి నిరోధకత కూడా పెరుగుతుంది. ఇందులో యాంటీ ఏజింగ్, యాంటీ ఆక్సిడెంట్, అనేక ఇతర ఔషధ పదార్థాలు ఉన్నాయి.

డబ్బు కోసం ప్రచారం చేస్తున్నారు: వైద్యుడు

స్థానిక వైద్యుడు విఎన్ రోడ్జ్ మాట్లాడుతూ గాడిద పాలు తాగడం వల్ల కరోనా వంటి మహమ్మారి నయం అవుతుందని ప్రచారం చేస్తున్నారు.. ఇది కచ్చితంగా తప్పు. డబ్బు కోసమే కొందరు ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తున్నారు. అటువంటి వ్యక్తులను నియంత్రించాలి. మనం కూడా గుడ్డిగా నమ్మకూడదు. మీరు అనారోగ్యంతో ఉంటే డాక్టర్ వద్దకు వెళ్లి కోవిడ్ ప్రోటోకాల్‌ను అనుసరించండి అని సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి: Bipin Rawat: జనరల్ బిపిన్ రావత్‌ పేరుకు ముందు ఉండే ‘PVSM, UYSM’ గురించి మీకు తెలుసా?.. వాటి అర్థం ఏంటో ఇప్పుడు తెలుసుకోండి..!

Judge – Magistrate: న్యాయమూర్తి, మేజిస్ట్రేట్.. లాయర్, అడ్వొకేట్.. తేడాలేంటో తెలుసా? అయితే, ఇప్పుడే తెలుసుకోండి..!