ఢిల్లీ “జూ”లో టైగర్‌ డెత్.. కరోనా టెస్టుకు శాంపిల్స్..

దేశ రాజధాని ఢిల్లీలోని జూ పార్క్‌లో ఓ ఆడపులి మరణించింది. బుధవారం కిడ్నీ సమస్యతో పులి మరణించింది. అయినప్పటికీ ఈ పులికి సంబంధించిన నమూనాలను కరోనా పరీక్షలకు పంపించారు అధికారులు. 14 ఏళ్ల ఈ ఆడపులి పేరు కల్పన అని అధికారులు తెలిపారు. బుధవారం సాయంత్రం ప్రాణాలు కోల్పోగా.. గురువారం దహనం చేశారు. ఈ విషయాన్ని పర్యావరణ మంత్రి వెల్లడించారు. కాగా.. ఈ పులికి జరిపిన పోస్ట్‌మార్టం రిపోర్టులో ఇది బలహీనమైందని.. దీనిలో క్రియేటినైన్ స్థాయి పెరిగినట్లు […]

ఢిల్లీ జూలో టైగర్‌ డెత్.. కరోనా టెస్టుకు శాంపిల్స్..
Follow us

| Edited By:

Updated on: Apr 24, 2020 | 6:33 PM

దేశ రాజధాని ఢిల్లీలోని జూ పార్క్‌లో ఓ ఆడపులి మరణించింది. బుధవారం కిడ్నీ సమస్యతో పులి మరణించింది. అయినప్పటికీ ఈ పులికి సంబంధించిన నమూనాలను కరోనా పరీక్షలకు పంపించారు అధికారులు. 14 ఏళ్ల ఈ ఆడపులి పేరు కల్పన అని అధికారులు తెలిపారు. బుధవారం సాయంత్రం ప్రాణాలు కోల్పోగా.. గురువారం దహనం చేశారు. ఈ విషయాన్ని పర్యావరణ మంత్రి వెల్లడించారు. కాగా.. ఈ పులికి జరిపిన పోస్ట్‌మార్టం రిపోర్టులో ఇది బలహీనమైందని.. దీనిలో క్రియేటినైన్ స్థాయి పెరిగినట్లు తేలింది. కాగా.. కరోనా నేపథ్యంలో.. పులి కళేబరాన్ని కొద్ది మంది అధికారుల సమక్షంలో దహన కార్యక్రమం చేపట్టారు. ఇక శాంపిల్స్‌ను బరేలీలోని ఇండియన్‌ వెటర్నరీ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌కు పంపినట్లు అధికారులు తెలిపారు.

మరోవైపు అధికారుల నిర్లక్ష్యంతోనే పులి మరణించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఎండకాలం పట్టించుకోకపోవడంతో.. డీ హైడ్రేషన్ కారణంతో మరణించి ఉంటుందని పలువురు ఆరోపిస్తున్నారు.