దేశ రాజధానిలో పెరుగుతున్న పాజిటివ్ కేసులు
దేశ రాజధానిలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య అమాంతం పెరుగుతున్నాయి. మొన్నటి వరకు కరోనా మహమ్మారి అదుపులోకి వస్తుందనుకుంటున్న..
దేశ రాజధానిలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య అమాంతం పెరుగుతున్నాయి. మొన్నటి వరకు కరోనా మహమ్మారి అదుపులోకి వస్తుందనుకుంటున్న వేళ.. గత కొద్ది రోజులుగా నిత్యం వెయ్యికి పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 1,215 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు ఢిల్లీ వ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,57,354కి చేరింది. వీటిలో ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకుని 1,41,826 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఢిల్లీ వ్యాప్తంగా 11,271 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ విషయాన్ని ఢిల్లీ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇక ఇప్పటి వరకు కరోనా బారినపడి ఢిల్లీ వ్యాప్తంగా 4,257 మంది మరణించారు.
కాగా, గురువారం నాడు ఢిల్లీలో దాదాపు 17 వేల కరోనా పరీక్షలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. 6,010 ఆర్టీపీసీఆర్ విధానం ద్వారా చేయగా.. 10,994 రాపిడ్ యాంటిజెన్ విధానం ద్వారా నిర్వహించారు. ఇప్పటి వరకు ఢిల్లీ వ్యాప్తంగా 13.75 లక్షల కరోనా పరీక్షలు నిర్వహించినట్లు ఢిల్లీ ప్రభుత్వం వెల్లడించింది.
6,010 RTPCR/CBNAAT/TrueNat tests and 10,994 Rapid antigen tests conducted today. So far, 13,75,193 tests have been conducted so far & Tests Per Million (TPM) stands at 72378: Health Department, Government of Delhi https://t.co/48TtYpaApa pic.twitter.com/MEbBea2b6b
— ANI (@ANI) August 20, 2020
Read More :