AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆడ పిల్లల అకౌంట్లలోకి రూ.36,000…దరఖాస్తులకు గడువు పెంపు

లడ్లీ స్కీమ్ గడువును మరో రెండు నెలలపాటు పొడిగిస్తూ.. ఢిల్లీ సర్కార్ నిర్ణయించింది. ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్ ఈ మేరకు ఒక నోటికేషన్ జారీ చేసింది. దేశంలో విజృంభిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో..

ఆడ పిల్లల అకౌంట్లలోకి రూ.36,000...దరఖాస్తులకు గడువు పెంపు
Jyothi Gadda
|

Updated on: Jun 29, 2020 | 6:03 PM

Share

లడ్లీ స్కీమ్ గడువును మరో రెండు నెలలపాటు పొడిగిస్తూ.. ఢిల్లీ సర్కార్ నిర్ణయించింది. ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్ ఈ మేరకు ఒక నోటికేషన్ జారీ చేసింది. దేశంలో విజృంభిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అందువల్లే ప్రజలకు ఊరట కలిగేలా కేజ్రీవాల్ ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

కరోనా, లాక్‌డౌన్ కష్టకాలంలో ప్రజలు లడ్లీ స్కీమ్‌లో చేరేందుకు మరింత గడువు లభించింది. ఆగస్ట్ 31 వరకు ఈ పథకంలో చేరేందుకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. అంతేకాకుండా వితంతువుల ఆడ పిల్లలు, అనాధలైన ఆడ పిల్లలకు అందించే ఆర్థిక చేయూతకు అప్లై చేసుకోవడానికి కూడా అక్కడి ప్రభుత్వం ఆగస్ట్ 31న గడువు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. అయితే, ఆడపిల్లల శ్రేయస్సు కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన లడ్లీ స్కీమ్‌లో చేరేందుకు దరఖాస్తు చేసుకునే వారికి కుటుంబ వార్షిక ఆదాయం రూ.లక్ష దాటకుండా ఉండి, ఢిల్లీలో మూడేళ్లుగా నివాసం ఉండాలి. పాప ఢిల్లీలోనే జన్మించాలి. ఒక కుటుంబంలో గరిష్టంగా ఇద్దరు ఆడ పిల్లలకు ఈ స్కీమ్ వర్తిస్తుంది. తర్వాత పాప ఢిల్లీ ప్రభుత్వపు గుర్తింపు ఉన్న స్కూల్‌లో చదవాలి. ఇకపోతే అమ్మాయికి 18 ఏళ్లు నిండిన తర్వాతనే ఆ అమ్మాయి అకౌంట్‌లో జమైన డబ్బులు తీసుకునే వీలుంటుంది.

2008లో ఢిల్లీ గవర్నమెంట్ లడ్లీ స్కీమ్‌ను ప్రారంభించింది. అదే ఏడాది జనవరి 1 నుంచి పుట్టిన ఆడ పిల్లలకు ఈ స్కీమ్ వర్తిస్తుంది. ఈ స్కీమ్ కింద ఆడ పిల్లలకు రూ.35,000 నుంచి రూ.36,000 వరకు ఆర్థిక సాయం అందజేస్తోంది. అమ్మాయి పుట్టిన దగ్గరి నుంచి ఇంటర్ పూర్తి చేసేంత వరకు ఈ డబ్బులు వారి అకౌంట్లలో విడతల వారీగా ప్రభుత్వం జమచేస్తుంది. అమ్మాయి పుట్టిన వెంటనే రూ.11,000 అందజేస్తారు. ఆస్పత్రిలో పుడితే ఈ డబ్బులు వస్తాయి. అదే ఇంటి వద్దనే కాన్పు అయితే రూ.10,000 అందజేస్తారు. ఇక, చిన్నారి స్కూల్‌కి వెళ్లే సమయం అంటే, ఒకటో తరగతిలో చేరిన వెంటనే రూ.5,000 వస్తాయి. తర్వాత ఆరో తరగతిలో రూ.5,000 జమచేస్తారు. ఇక, 9వ తరగతిలో రూ.5,000, పదో తరగతిలో రూ.5,000, 12వ తరగతిలో రూ.5,000ల చొప్పున మొత్తంగా రూ.35 వేలు లేదా రూ.36 వేలు ప్రభుత్వం ఆర్థిక సాయం అందజేస్తుంది.