పోకిరీల భ‌ర‌తం ప‌డుతున్న పోలీస్ డ్రోన్స్‌…

హైదరాబాద్‌లోని ప్రముఖ కట్టడాలు, పర్యాటక ప్రదేశాలు, పార్కులు నిర్మానుష్యంగా మారిపోయాయి. కానీ, కొన్ని గ‌ల్లీలు, వీధుల్లో మాత్రం పోకిరీలు మాట విన‌టంలేదు.

పోకిరీల భ‌ర‌తం ప‌డుతున్న పోలీస్ డ్రోన్స్‌...
Follow us

|

Updated on: Apr 08, 2020 | 10:32 AM

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించారు. దీంతో హైదరాబాద్‌లోని ప్రముఖ కట్టడాలు, పర్యాటక ప్రదేశాలు, పార్కులు నిర్మానుష్యంగా మారిపోయాయి. కానీ, కొన్ని గ‌ల్లీలు, వీధుల్లో మాత్రం పోకిరీలు మాట విన‌టంలేదు. నిబంధ‌న‌లు ఉల్లంఘిస్తున్నారు. అటువంటి వారి ప‌నిప‌ట్టేందుకు న‌గ‌ర పోలీసులు స‌రికొత్త ప్లాన్ వేశారు. కాలనీలు, గల్లీలలో ఒక్కచోట చేరే వాళ్ల పనిపట్టేందుకు డ్రోన్ కెమెరాలను ప్రయోగిస్తున్నారు.

దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. ప్రజలంతా ఇంట్లోనే ఉండాలని బయటకు రావొద్దని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేశాయి. ఇందులో భాగంగా డ్రోన్ కెమెరాలను ప్రయోగిస్తున్నారు. ఈ కెమెరా ద్వారా లైవ్ మానిటరింగ్ చేసి ఎక్కడైతే ప్రజలు ఉన్నారో వాళ్ళని పోలీసులు అదుపులోకి తీసుకొనే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలోనే కొంత మందిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఇలా రోడ్ల మీద గుమిగూడి ఉంటున్న వారి పైన పోలీసులు కేసులు కూడా నమోదు చేస్తున్నారు.

హైదరాబాద్ బాలనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రయోగించిన డ్రోన్ కెమెరా సంబంధించిన విజువల్స్‌లో కొంత మంది గుమిగూడి ముచ్చటించుకుంటున్న యువకులు డ్రోన్ కెమెరా చూడగానే పరుగులు పెడుతున్నారు. దీనికి సంబంధించిన డ్రోన్ కెమెరా విజువల్స్‌ను పోలీసు అధికారులు మీడియాకు రిలీజ్ చేశారు. ఎక్కడైనా సరే పబ్లిక్ ఉన్నట్లు సమాచారం వస్తే వెంటనే తమకు సమాచారం అందించాలని పోలీసులు చెబుతున్నారు. పూర్తి ఆధారాలతో వారిని పట్టుకుని కేసు నమోదు చేస్తామని చెబుతున్నారు. ఇప్పటికి సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో మొత్తం 12 డ్రోన్ కెమెరాల ద్వారా జన సంచారాన్ని సమీక్షిస్తామని కమిషనర్ వీసీ సజ్జనార్ వెల్లడించారు.

Latest Articles
కొత్త ఓటర్లతో ముచ్చటించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
కొత్త ఓటర్లతో ముచ్చటించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
ఏంటీ.? నిజామా.! రజనీకాంత్‌ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా?
ఏంటీ.? నిజామా.! రజనీకాంత్‌ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా?
పోలింగ్‌ డే రోజున వరుణుడు కరుణిస్తాడా.? 5 రోజుల పాటు వర్షాలు
పోలింగ్‌ డే రోజున వరుణుడు కరుణిస్తాడా.? 5 రోజుల పాటు వర్షాలు
మీ నీడ మాయమైయ్యిందా.? నక్షత్రశాల ప్రతినిధులు వెల్లడి..
మీ నీడ మాయమైయ్యిందా.? నక్షత్రశాల ప్రతినిధులు వెల్లడి..
నట్టింట్లో నల్లత్రాచుకు ప్రత్యేక పూజలు.! వీడియో వైరల్..
నట్టింట్లో నల్లత్రాచుకు ప్రత్యేక పూజలు.! వీడియో వైరల్..
కొత్తకారు కొన్నాడు.. గుడిలో పూజలు కూడా చేయించాడు.. అంతలోనే షాక్.!
కొత్తకారు కొన్నాడు.. గుడిలో పూజలు కూడా చేయించాడు.. అంతలోనే షాక్.!
ఓటు వెయ్యాలంటే గుర్రమెక్కాల్సిందే.! గిరిజనుల వినూత్న నిరసన.
ఓటు వెయ్యాలంటే గుర్రమెక్కాల్సిందే.! గిరిజనుల వినూత్న నిరసన.
ఎర్ర అరటిపండ్లు ఎక్కడ కనపడ్డా వెంటనే కొనేయండి.. ఎందుకంటే.?
ఎర్ర అరటిపండ్లు ఎక్కడ కనపడ్డా వెంటనే కొనేయండి.. ఎందుకంటే.?
మొబైల్‌ వినియోగదారులకు అలర్ట్‌.. ఈ ఫోన్లలో ప్రమాదకర వైరస్‌.!
మొబైల్‌ వినియోగదారులకు అలర్ట్‌.. ఈ ఫోన్లలో ప్రమాదకర వైరస్‌.!
అబ్బా తమ్ముడు.! కారులోనే యాపారం మొదలెట్టేశావ్‌గా.. చెక్ చేయగా!
అబ్బా తమ్ముడు.! కారులోనే యాపారం మొదలెట్టేశావ్‌గా.. చెక్ చేయగా!