కరెన్సీ నోట్ల ద్వారా కరోనా..! రాకూడదంటే ఏం చేయాలి ?

హాంకాంగ్ యూనివర్శిటీ పరిశోధకుల నివేదిక‌ ప్రకారం కరెన్సీ నోట్లపై కరోనా వైరస్ 7 రోజులు బతికే ఉంటుందట.

కరెన్సీ నోట్ల ద్వారా కరోనా..! రాకూడదంటే ఏం చేయాలి ?
Follow us

|

Updated on: Apr 08, 2020 | 1:11 PM

పాలు, నీళ్లు, కూరగాయలు, మందులు వంటి నిత్యావసరాలు రోజు కొనక తప్పదు. సూపర్ మార్కెట్లలో ఫోన్ పే, గూగుల్ పే ఉంటుంది. కానీ వినియోగదారులు అందరి వద్ద అవి ఉండవు. అలాగే బయట వస్తువులు, కూరగాయలు అమ్మేవాళ్ల వ‌ద్ద‌ ఈ సదుపాయం ఉండదు. దీంతో నోట్ల వాడకం లేకుండా మార్కెట్లో కొనుగోళ్లు చేయలేం. మరి అలాంటపుడు నోట్ల ద్వారా కరోనా రాకుండా ఆపేదెలా? జనం ఇది తెలియక తలపట్టుకుంటున్నారు. ఇది అతిపెద్ద నిత్యావసర సమస్యగా మారింది.

అసలు నోట్లపై కరోనా వైరస్ ఎంత కాలం బతికి ఉంటుంది ? హాంకాంగ్ యూనివర్శిటీ పరిశోధకుల నివేదిక‌ ప్రకారం కరెన్సీ నోట్లపై కరోనా వైరస్ 7 రోజులు బతికే ఉంటుందట. వామ్మో 7 రోజులు అంటా చాలా కష్టం కదా? మినిమమ్ 3 రోజులు అయితే గ్యారంటీగా ఉంటుంది అని కూడా కొందరు పరిశోధకులు అంటున్నారు. ఓవరాల్ గా చూస్తే కనీసం 3 రోజులు అయితే ఉంటుందని అర్థమవుతోంది.

నోట్ల ద్వారా కరోనాను ఎలా అరికట్టాలి. మనకు నోట్ల వాడకం తప్పదు.. కాబట్టి నోటు వల్ల కరోనా కాటు పడకుండా ఏం చేయాలో తెలుసుకుంటే సరిపోతుంది. కొందరు నోట్లను కడుగుతున్నారు. అది కరెక్టు కాదు. ఇలా రెండు మూడు సార్లు నోట్లు నీటిలో పడితే అవి పాడైపోతాయి. ఈ నేపథ్యంలో ప్రతి ఇంట్లో ఉండే ఐరన్ బాక్స్ వాడుకోవడం అత్యుత్తమమైన మార్గం.

మీరు రూ. 5 వందల నోటు తీసుకొని మార్కెట్ కు వెళ్లారనుకుందాం. వ్యాపారి మీకు తిరిగి ఇచ్చిన చిల్లర మీ జేబులో, మీ పర్సులో పెట్టుకోవద్దు. మీతో పాటు ఒక చిన్న ప్లాస్టిక్ కవర్, లేదా సంచి తీసుకెళ్లి అతను తిరిగి ఇచ్చిన చిల్లరను అందులో పెట్టుకోండి. మీ కొనుగోళ్లు అయిపోయి ఇంటికి వచ్చాక సరుకులు జాగ్రత్తగా ఓ మూలన పెట్టి ఇంట్లో వారిని అడిగి బట్టలు ఆరేసే ఒక క్లిప్ తీసుకోండి. మీ వద్ద ఉన్న నోట్లు అన్ని ఆ క్లిప్ కు పెట్టండి. ప్లాస్టిక్ కవర్ మూత ఉన్న డస్ట్ బిన్ లో వేయండి.

ఇంట్లో వాళ్లను ఐరన్ బాక్స్ తీసుకురమ్మని చెప్పి… ఒక న్యూస్ పేపర్ మీద ఒక్కో నోటును పెట్టి ఐరన్ చేయండి. రెండు వైపులా చేయండి. ఐరన్ బాక్స్ మీరు ముట్టుకోవద్దు. మీ ఇంట్లో వారే ముట్టుకోవాలి. మీరు నోట్లను మాత్రమే ముట్టుకోండి. ఐరన్ చేశాక ఆ నోట్లను మీరు తాకొద్దు. ఐరన్ చేసిన కుటుంబ సభ్యుడిని ఆ నోట్లను ఒక ప్రత్యేక బాక్స్ లో వేయమనండి. కరోనా వైరస్ నేరుగా పడే 60 డిగ్రీల కంటే ఎక్కువ వేడిలో నశిస్తుంది. నశించడం అంటే నిర్జీవ వైరస్ కణం చుట్టూ ఉండే ప్రొటీన్ కరిగిపోవడం. ఆ నోట్లు ఇపుడు సేఫ్. అలా అన్ని నోట్లు ఐరన్ చేశాక… మీరు సబ్బుతో నురగ వచ్చే వరకు చేతులు కడుక్కోండి. మీరు వాడిన క్లిప్ ను కూడా కడగండి. ఆ బాక్సులో వేసిన నోట్లపై ఇపుడు వైరస్ లేకపోయిన అనవసరంగా తాకకండి. మళ్లీ మార్కెట్ కు వెళ్లేటపుడు అవే తీసుకెళ్లండి. ఇలా చేయడం వల్ల కరెన్సీతో వచ్చే కరోనాను అడ్డుకోవచ్చు.

SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..