కాకి చెప్పిన పాఠాలు.. ట్విట్టర్‌లో వైరల్‌గా మారిన వీడియో
శుభ్రతపై కాకి చెప్పే పాఠాలు అన్ని ఇన్ని కావు. మనం చాలా సార్లు చూస్తుంటాం. మనుషులు చేయాల్సిన చాలా పనులను వన్యప్రాణులు చేయడం. పరిశుభ్రత పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న మనుషులకు కాకి వీడియో బాధ్యతను గుర్తుకు చేస్తుంటాయి. తాజాగా అలాంటి వీడియోను ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ సుశాంత్ నంద ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ఈ కాకి చేసిన పనిని మనుషులు చేయలేరా? అనే శీర్షికతో సుశాంత నంద ట్యాగ్ చేశాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్‌మీడియాలో తెగ […]
శుభ్రతపై కాకి చెప్పే పాఠాలు అన్ని ఇన్ని కావు. మనం చాలా సార్లు చూస్తుంటాం. మనుషులు చేయాల్సిన చాలా పనులను వన్యప్రాణులు చేయడం. పరిశుభ్రత పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న మనుషులకు కాకి వీడియో బాధ్యతను గుర్తుకు చేస్తుంటాయి. తాజాగా అలాంటి వీడియోను ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ సుశాంత్ నంద ట్విటర్‌లో పోస్ట్ చేశారు.
ఈ కాకి చేసిన పనిని మనుషులు చేయలేరా? అనే శీర్షికతో సుశాంత నంద ట్యాగ్ చేశాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్‌మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో పాతదే అయినప్పటికీ ఇప్పుడున్న పరిస్థితుల్లో సరిగ్గా సరిపోతుందంటున్నారు సుశాంత్ నంద. కరోనాకు తోడు దేశ వ్యాప్తంగా జోరుగా వర్షాలు కురుస్తుండటంతో వివిధ రకాల అంటువ్యాదులు సోకే అవకాశం ఉంది. అయితే.. ఓ గార్డెన్ పార్కులో పడేసిన కూల్ డ్రింక్ బాటిల్‌ను ఒక కాకి నోటితో పట్టుకొని పసుపు రంగు గల డస్ట్‌బిన్‌లో వేసి ఎగిరిపోయింది. కాకి చేసిన మంచి పనిపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.
When the crow can, The human crowd can? pic.twitter.com/JAMujNaUSG
— Susanta Nanda (@susantananda3) June 14, 2020