Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Covid-19 Vaccine: 2-6 ఏళ్ల వయసు వారికి వచ్చే వారం నుంచి రెండో డోసు టీకా ట్రయల్స్.. రెడీ అవుతున్న కొవాగ్జిన్

కరోనా మహమ్మారి తరమికొట్టేందుకు టీకా ఒక్కటే ఉత్తమ మార్గమన్న నిపుణుల సూచనలతో కేంద్ర ప్రభుత్వం వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేసింది.

Covid-19 Vaccine: 2-6 ఏళ్ల వయసు వారికి వచ్చే వారం నుంచి రెండో డోసు టీకా ట్రయల్స్.. రెడీ అవుతున్న కొవాగ్జిన్
Covaxin Vaccine
Follow us
Balaraju Goud

|

Updated on: Jul 20, 2021 | 1:54 PM

Covaxin Second Dose For Children: కరోనా మహమ్మారి తరమికొట్టేందుకు టీకా ఒక్కటే ఉత్తమ మార్గమన్న నిపుణుల సూచనలతో కేంద్ర ప్రభుత్వం వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేసింది. ఇదే క్రమంలో చిన్నారులపై కొవాగ్జిన్‌ టీకా ఔషధ పరీక్షల్లో భాగంగా 2-6 ఏళ్ల వయసు వారికి వచ్చే వారం నుంచి రెండో డోసు టీకా ఇవ్వనున్నారు. కోవిడ్‌-19కు సంబంధించి భారత్‌ బయోటెక్‌ రూపొందించిన కొవాగ్జిన్‌ టీకాను 2 నుంచి 18 ఏళ్ల వారిపై పరీక్షిస్తున్న సంగతి తెలిసిందే.

6-12 ఏళ్ల వయసు వారికి ఇప్పటికే రెండో డోసు ఇచ్చినట్లు దిల్లీలోని ఎయిమ్స్‌ వర్గాలు తెలిపాయి. దేశంలో చిన్నారులపై కొవాగ్జిన్‌ టీకా ఔషధ పరీక్షలు నిర్వహిస్తున్న కేంద్రాల్లో దిల్లీ ఎయిమ్స్‌ ఒకటి. దేశంలో కరోనా మూడో దశ ఉద్ధృతి చోటుచేసుకోవచ్చన్న అంచనాల నేపథ్యంలో చిన్నారులపై కోవిడ్‌-19 టీకా ఔషధ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా ఇటీవల పేర్కొన్నారు. మరోవైపు, చిన్నారులకు కరోనా టీకా సెప్టెంబర్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశముంది.

ఔషధ పరీక్షల్లో భాగంగా చిన్నారులను వయసుల వారీగా బృందాలుగా విభజించారు. ఒక్కో బృందంలో 175 మంది చిన్నారులను ఉంచి వారికి టీకా ఇస్తున్నారు. ఇలా రెండు డోసుల టీకా పొందిన చిన్నారులను పరీక్షిస్తారు. అనంతరం ఆగస్టు చివరికల్లా ఔషధ పరీక్షల మధ్యంతర నివేదిక వచ్చే అవకాశముంది. మరోవైపు, కరోనా మహమ్మారి థర్డ్ వేవ్ విజృంభిస్తుందన్న హెచ్చరికలతో కేంద్ర ప్రభుత్వం.. అయా రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ఇందులో భాగంగా అన్ని వర్గాలకు టీకా పంపిణీలో వేగవంతం చేయాలని సూచించింది.

Read Also…  Andhra Pradesh Crime News: అధికారిక వాట్సప్‌ గ్రూప్‌లో ‘ఆమె’ ఫోన్ నెంబర్.. మరో పోలీసు కానిస్టేబుల్‌పై వేటు.. అసలేం జరిగిందంటే..