జగన్ సర్కార్ సంచలనం.. బ్లడ్ డొనేషన్ క్యాంపులపై నిషేధం..

రాష్ట్రవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. లాక్ డౌన్ తరుణంలో జరిగే బ్లడ్ డొనేషన్ క్యాంపులపై పూర్తిగా రద్దు చేసింది.ఈ క్యాంపుల ద్వారా కోవిడ్ 19 వ్యాపించే అవకాశం ఉన్నందున వీటిపై నిషేధం విధించినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఎన్జీవోలు, ఛారిటీ సంస్థలు ఏర్పాటు చేసే రక్తదాన కార్యక్రమాల్లో చాలామంది పాల్గొంటారని.. ఇక ఇలాంటి సమూహాల వల్లే కరోనా వ్యాప్తి పెరిగే ఛాన్సులు ఉన్నాయంది. అందువల్ల లాక్ […]

జగన్ సర్కార్ సంచలనం.. బ్లడ్ డొనేషన్ క్యాంపులపై నిషేధం..
Follow us

|

Updated on: Apr 14, 2020 | 6:11 PM

రాష్ట్రవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. లాక్ డౌన్ తరుణంలో జరిగే బ్లడ్ డొనేషన్ క్యాంపులపై పూర్తిగా రద్దు చేసింది.ఈ క్యాంపుల ద్వారా కోవిడ్ 19 వ్యాపించే అవకాశం ఉన్నందున వీటిపై నిషేధం విధించినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఎన్జీవోలు, ఛారిటీ సంస్థలు ఏర్పాటు చేసే రక్తదాన కార్యక్రమాల్లో చాలామంది పాల్గొంటారని.. ఇక ఇలాంటి సమూహాల వల్లే కరోనా వ్యాప్తి పెరిగే ఛాన్సులు ఉన్నాయంది. అందువల్ల లాక్ డౌన్ సమయంలో జరిగే బ్లడ్ క్యాంపులపై నిషేధం విధించినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అధికారికంగా వెల్లడించింది. అయితే అత్యవసరమైన రోగులకు దాతలు నేరుగా ఆసుపత్రికి వెళ్లి రక్తదానం చేయొచ్చని.. అందుకు కావాల్సిన పాసులను పోలీసు అధికారులు జారీ చేస్తారంది. దీని ద్వారా వైరస్ వ్యాప్తి కొంతమేరకు కట్టడి చేయవచ్చని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. కాగా, ఏపీలో ఇప్పటివరకు 473 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

ఇవి చదవండి:

లాక్ డౌన్ అమలులో విజయవంతం.. ఏపీ అగ్రస్థానం.!

ఏపీ: రెడ్‌జోన్‌లో 41.. ఆరెంజ్‌ జోన్‌లో 45.. గ్రీన్ జోన్‌లో 590… షరతులు వర్తిస్తాయి.

సీఎం జగన్ సంచలన నిర్ణయం.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ డబ్బు సరాసరి అమ్మ ఖాతాలోకి..