వైరస్ వణుకు.. కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం.. రెండు నెలల రేషన్ ఫ్రీ..

COVID 19: దేశంలో కరోనా వైరస్ చాప కింద నీరులా విస్తరిస్తోంది. ఇప్పటికే ఈ మహమ్మారి బారిన పడిన వారి సంఖ్య 336కు చేరుకోగా.. ఆరుగురు మృతి చెందారు. ఇదిలా ఉంటే ఇప్పటివరకు కర్ణాటకలో 20 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ నేపధ్యంలో ఆ రాష్ట్ర సీఎం యెడియూరప్ప కీలక నిర్ణయం తీసుకున్నారు. కోవిడ్ 19 వ్యాప్తిని కట్టడి చేసేందుకు సరిహద్దులను మూసివేస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా ప్రజలకు రెండు నెలల రేషన్‌ను ఫ్రీగా ఇవ్వనున్నట్లు స్పష్టం […]

వైరస్ వణుకు.. కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం.. రెండు నెలల రేషన్ ఫ్రీ..
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Mar 22, 2020 | 3:36 PM

COVID 19: దేశంలో కరోనా వైరస్ చాప కింద నీరులా విస్తరిస్తోంది. ఇప్పటికే ఈ మహమ్మారి బారిన పడిన వారి సంఖ్య 336కు చేరుకోగా.. ఆరుగురు మృతి చెందారు. ఇదిలా ఉంటే ఇప్పటివరకు కర్ణాటకలో 20 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ నేపధ్యంలో ఆ రాష్ట్ర సీఎం యెడియూరప్ప కీలక నిర్ణయం తీసుకున్నారు. కోవిడ్ 19 వ్యాప్తిని కట్టడి చేసేందుకు సరిహద్దులను మూసివేస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా ప్రజలకు రెండు నెలల రేషన్‌ను ఫ్రీగా ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు.

మరోవైపు ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న టెన్త్ క్లాసు పరీక్షలను కూడా వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. ఈ పరీక్షల నిర్వహణకు కొత్త తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని అన్నారు. అయితే సోమవారం నుంచి మొదలుకానున్న ప్రీ- యూనివర్సిటీ ఎగ్జామ్స్(ఇంటర్) మాత్రం యధాతధంగా కొనసాగుతాయన్నారు. అటు అన్ని విమానాశ్రయాల్లోనూ ప్రయాణీకులకు స్క్రీనింగ్ నిర్వహిస్తారని సీఎం  స్పష్టం చేశారు. అటు ప్రజలను.. తమ ప్రయాణాలను 15 రోజులు వాయిదా వేసుకోవాలని యెడియూరప్ప కోరారు.

ఆదివారం మీడియాతో మాట్లాడిన సీఎం.. బెంగళూరులోని విక్టోరియా ఆసుపత్రిలో 1700 పడకలను సిద్దం చేశామని.. కోవిడ్ 19 బాధితులకు అక్కడే చికిత్స అందిస్తామని అన్నారు. అంతేకాకుండా ఇండియన్ కౌన్సిల్ అఫ్ మెడికల్ రీసెర్చ్ అనుమతులు మేరకు ప్రైవేటు, గవర్నమెంట్ ఆసుపత్రులలో కూడా ల్యాబ్ టెస్టింగులు నిర్వహిస్తామన్నారు. కరోనా వైరస్ వల్ల ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని.. ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపడుతోందని హామీ ఇచ్చారు.

ఈ క్రమంలోనే మార్చి 31 వరకు కర్ణాటక రాష్ట్రం తాత్కాలికంగా షట్ డౌన్ కానుంది. అయితే అత్యవసర సేవలకు మినహాయింపు ఉందని కర్ణాటక సర్కార్ పేర్కొంది. ఇక ఇప్పటికే మాల్స్, పబ్స్, రెస్టారంట్స్, ధియేటర్లను మూసివేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ రోజు జరుగుతున్న జనతా కర్ఫ్యూలో ఎవరైనా రోడ్లపై కనబడితే కఠిన చర్యలు తీసుకుంటామని బెంగళూరు పోలీసులు తెలిపారు.

For More News:

ఏపీలో మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు..

కోవిడ్ లక్షణాలు ఉండి.. ఆసుపత్రిలో చేరేందుకు నిరాకరిస్తే చర్యలే..

కరోనా భయం.. జైలుకు నిప్పంటించిన ఖైదీలు…

కరోనా ఎఫెక్ట్.. ఆ రెండు రాష్ట్రాలూ లాక్‌డౌన్..

తెలంగాణలో జనతా కర్ఫ్యూ.. ఆ సేవలకు మాత్రమే మినహాయింపు..

కరోనా ఎఫెక్ట్.. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు సెలవులు..

భారత్‌లో ఐదుకు చేరిన కరోనా మరణాలు…

కరోనా కట్టడికి ఎబోలా మెడిసిన్ రెడీ.. ట్రయల్స్ షురూ..!

బచ్చలికూరతో మెరిసే అందం.. ఒక్కసారి ట్రై చెయ్యండి.
బచ్చలికూరతో మెరిసే అందం.. ఒక్కసారి ట్రై చెయ్యండి.
ఏపీలో పోలింగ్ వేళ హింసాత్మక ఘటనలు..టీడీపీ-వైసీపీ శ్రేణుల బాహాబాహి
ఏపీలో పోలింగ్ వేళ హింసాత్మక ఘటనలు..టీడీపీ-వైసీపీ శ్రేణుల బాహాబాహి
పాకిస్తానీ అమ్మాయి కోసం.. భారత రక్షణశాఖ రహస్యాలు చెప్పేశాడా.?
పాకిస్తానీ అమ్మాయి కోసం.. భారత రక్షణశాఖ రహస్యాలు చెప్పేశాడా.?
చేతులు లేవని ఇంట్లో కూర్చోలేదు.. ఓటు స్పూర్తిని గొప్పగా చాటాడు..
చేతులు లేవని ఇంట్లో కూర్చోలేదు.. ఓటు స్పూర్తిని గొప్పగా చాటాడు..
ఓటు హక్కును వినియోగించుకున్న సీఎం రేవంత్ రెడ్డి..
ఓటు హక్కును వినియోగించుకున్న సీఎం రేవంత్ రెడ్డి..
పద్మశ్రీ స్వీకరించిన 101 ఏళ్ల యోగా టీచర్‌.. వీడియో వైర‌ల్‌.!
పద్మశ్రీ స్వీకరించిన 101 ఏళ్ల యోగా టీచర్‌.. వీడియో వైర‌ల్‌.!
విమానంలో మహిళా ఇలా చేసిందేంటి.. ఒక్కసారిగా అంత షాక్.!
విమానంలో మహిళా ఇలా చేసిందేంటి.. ఒక్కసారిగా అంత షాక్.!
ప్రొటీన్ పౌడర్ అతిగా వాడారో.. అవి దెబ్బతింటాయి.!
ప్రొటీన్ పౌడర్ అతిగా వాడారో.. అవి దెబ్బతింటాయి.!
భారత క్రికెట్‌ జట్టుకు కొత్త కోచ్‌.? ద్రవిడ్‌ కూడా అప్లై చేసుకోవచ
భారత క్రికెట్‌ జట్టుకు కొత్త కోచ్‌.? ద్రవిడ్‌ కూడా అప్లై చేసుకోవచ
సామాన్యుడిలా కనిపించిన ప్రధాని.. సిక్కుల లంగర్ సేవలో మోదీ..
సామాన్యుడిలా కనిపించిన ప్రధాని.. సిక్కుల లంగర్ సేవలో మోదీ..