విజయవాడలో హై అలర్ట్…యువకుడికి కరోనా పాజిటివ్

విజయవాడలో కరోనా కలకలం చెలరేగింది.  ఫారెన్ నుంచి వచ్చిన ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఇంతియాజ్​ అహ్మద్​ ప్రకటన చేశారు. ఈ నెల 17, 18న విజయవాడ వన్‌ టౌన్‌లో హోమ్​ ఐసోలేషన్​లో ఉన్న యువకుడికి.. జ్వరం రావడంతో గవర్నమెంట్ ఆస్పత్రికి తరలించినట్లు ​ తెలిపారు. అతడి నమూనాలను టెస్ట్‌లకు పంపగా..కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో సదరు యువకుడు నివశించిన ఇంటి పరిసర ప్రాంతాల్లో  500 ఇళ్లల్లో […]

విజయవాడలో హై అలర్ట్...యువకుడికి కరోనా పాజిటివ్
Follow us

|

Updated on: Mar 22, 2020 | 3:23 PM

విజయవాడలో కరోనా కలకలం చెలరేగింది.  ఫారెన్ నుంచి వచ్చిన ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఇంతియాజ్​ అహ్మద్​ ప్రకటన చేశారు. ఈ నెల 17, 18న విజయవాడ వన్‌ టౌన్‌లో హోమ్​ ఐసోలేషన్​లో ఉన్న యువకుడికి.. జ్వరం రావడంతో గవర్నమెంట్ ఆస్పత్రికి తరలించినట్లు ​ తెలిపారు. అతడి నమూనాలను టెస్ట్‌లకు పంపగా..కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో సదరు యువకుడు నివశించిన ఇంటి పరిసర ప్రాంతాల్లో  500 ఇళ్లల్లో సర్వే చేసినట్లు పేర్కొన్నారు. వైరస్ వ్యాప్తి చెందకుండా పకడ్బందీ జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెప్పారు.  గత మూడు రోజుల్లో ఆ యువకుడు పాటు అతని ఫ్యామిలీ మెంబర్స్ ఎవరెవరితో మాట్లాడారో ఆరా తీస్తున్నామని కలెక్టర్​ తెలిపారు. అతడు హైదరాబాద్ నుంచి విజయవాడకు వచ్చిన క్యాబ్ డిటేల్స్ కూడా సేకరిస్తున్నట్టు పేర్కొన్నారు. కరోనాను సంబంధించి ఏవైనా ఫిర్యాదుల చేయాలనుకుంటే కంట్రోల్​ రూం నెంబర్​ 79952 44260కు డయల్ చేయాలని సూచించారు.

ఇక కరోనా పాజిటివ్  కేసు నమోదైన నేపథ్యంలో ఏప్రిల్ 14 వరకు సిటీలో 144 సెక్షన్ అమలు చేయనున్నట్లు సీపీ ద్వారకా తిరుమలరావు వెల్లడించారు. జనతా కర్ఫ్యూ ఆదివారం ఒక్కరోజుకే పరిమితం కాకుండా..3 రోజులు పాటు ఇదే పద్దతిని ఫాలో కావాలని సూచించారు. ప్రజలు ఎవరికివారు స్వచ్చందంగా బంద్ పాటిస్తే తప్ప కరోనాను ఎదుర్కొలేమన్నారు.