కరోనా సోకిన వారిలో చనిపోయే ఛాన్స్ ఎక్కువగా పురుషులకే ఉందట..

రోజు రోజుకీ.. కరోనా విజృంభిస్తోంది. దీని ధాటికి ప్రజలు పిట్టాల్లా మరణిస్తున్నారు. ఇప్పటికే భారత్‌లో కరోనా వైరస్ సెకండ్ స్టేజ్‌లో ఉంది. ఒక వేళ ఈ స్టేజ్ క్రాస్ చేస్తే.. కరోనా మరణాల సంఖ్య ఎక్కువ అవక..

కరోనా సోకిన వారిలో చనిపోయే ఛాన్స్ ఎక్కువగా పురుషులకే ఉందట..
Follow us

| Edited By:

Updated on: Mar 22, 2020 | 2:56 PM

రోజు రోజుకీ.. కరోనా విజృంభిస్తోంది. దీని ధాటికి ప్రజలు పిట్టాల్లా మరణిస్తున్నారు. ఇప్పటికే భారత్‌లో కరోనా వైరస్ సెకండ్ స్టేజ్‌లో ఉంది. ఒక వేళ ఈ స్టేజ్ క్రాస్ చేస్తే.. కరోనా మరణాల సంఖ్య ఎక్కువ అవక తప్పదు. అందుకే దీన్ని నియంత్రణలో పెట్టేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ‘జనతా కర్ఫ్యూని’ తీసుకొచ్చారు. ఇప్పటికే ఈ దేశవ్యాప్తంగా ప్రజలు జనతా కర్ఫ్యూని పాటిస్తున్నారు. దీంతో రోడ్లన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి.

కాగా.. ఈ కరోనా వైరస్‌పై చైనీస్ సెంటర్ ఫర్ డిసీస్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ శాస్త్రవేత్తలు ఇటీవల ఓ డేటాను విడుదల చేశారు. అందులో కరోనా వైరస్‌కు సంబంధించి సంచలన విషయాలు తెలిపారు. కరోనా స్త్రీ, పురుషులకు సమానంగా సోకే అవకాశం ఉంటుందని, చైనాలో కరోనా బారిన పడిన 44,567 మందిని శాస్త్రవేత్తలు పరిశీలించగా వారిలో పురుషులు 51.4 శాతం, స్త్రీలు 48.6 శాతం మంది ఉన్నట్లు వారు నివేదికలో వెల్లడించారు. అలాగే 100 మందిలో 81 మందికి కరోనా సాధారణంగా ఉంటుందని అన్నారు. దాదాపు 14 మందికి మధ్యస్తంగా, కేవలం ఐదుగురికి మాత్రం తీవ్రంగా అనారోగ్యానికి గురవుతారని డేటాలోని గణాంకాలు వివరిస్తున్నాయి. ఇక 70 ఏళ్లు పైబడిన వారు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

గుండె సంబంధిత, డయాబెటీస్, క్రోనిక్ రెస్పిరేటరీ డిసీస్, క్యాన్సర్, హైబీపీ వంటి ఆరోగ్య సమస్యలున్నవారు ఈ వైరస్ బారినపడితే వారి ప్రాణాలకు ప్రమాదమని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా గుండె సంబంధిత సమస్యతో బాధపడేవారు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

Read more also: కరోనా సోకిన వారిలో చనిపోయే ఛాన్స్ ఎక్కువగా పురుషులకే ఉందట..