బ్రేకింగ్‌.. కరోనాకు పతంజలి చెక్… నాలుగైదు రోజుల్లో నిరూపిస్తానన్న సీఈఓ..

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారికి విరుగుడు మందు ఆయుర్వేదమేనంటూ పతంజలి సీఈఓ ఆచార్య బాలకృష్ణ స్పష్టం చేశారు.

  • Tv9 Telugu
  • Publish Date - 5:24 pm, Sat, 13 June 20
బ్రేకింగ్‌.. కరోనాకు పతంజలి చెక్... నాలుగైదు రోజుల్లో నిరూపిస్తానన్న సీఈఓ..

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారికి విరుగుడు మందు ఆయుర్వేదమేనంటూ పతంజలి సీఈఓ ఆచార్య బాలకృష్ణ స్పష్టం చేశారు. తాము కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు ఓ ప్ర్తత్యేక శాస్త్రవేత్తల బృంధాన్ని నియమించామని.. వారు నిరంతరం కష్టపడి పనిచేస్తున్నారని తెలిపారు. తాము కొంత మంది కరోనా సోకిన పేషేంట్లపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించామని.. ఈ ట్రయల్స్‌లో వందకు వంద శాతం సత్ఫలితాలనిచ్చాయని.. తాము ఇచ్చిన మెడిసిన్ తీసుకున్న అనంతరం.. కరోనా రోగులు 5-14 రోజుల వ్యవధిలోనే కోలుకున్నారని తెలిపారు. ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ కరోనా మహమ్మారికి ఆయుర్వేదం ద్వారా ఖచ్చితంగా చెక్ పెట్టవచ్చని తాము ఆధారాలతో సహా ముందు ఉంచుతామని తెలిపారు. మరో నాలుగైదు రోజుల్లో.. దీనికి సంబంధించి పూర్తి ఆధారాలను, దీనికి సంబంధించిన సమాచారాన్ని విడుదల చేస్తామని పతంజలి సీఈవో ఆచార్య బాలకృష్ణ తెలిపారు.