మనసున్న మారాజు ప్రకాశ్‌ రాజ్..

ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్‌ రాజ్ మరోసారి తన ఔదార్యాన్ని చాటుకున్నాడు. ఇప్పటికే ఓ మారుమూల గ్రామాన్ని దత్తత తీసుకొని.. తన సొంత డబ్బుల్ని ఖర్చుపెట్టి అభివృద్ది చేస్తున్న విషయం తెలిసిందే. అటు రాజకీయంగా కూడా తన అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఉంటాడు. ప్రస్తుతం కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్న సంగతి తెలిసిందే. మనదేశంలో కూడా చాపకింద నీరుల ఈ వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమై అనేక చర్యలు […]

మనసున్న మారాజు ప్రకాశ్‌ రాజ్..
Follow us

| Edited By:

Updated on: Mar 23, 2020 | 5:41 PM

ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్‌ రాజ్ మరోసారి తన ఔదార్యాన్ని చాటుకున్నాడు. ఇప్పటికే ఓ మారుమూల గ్రామాన్ని దత్తత తీసుకొని.. తన సొంత డబ్బుల్ని ఖర్చుపెట్టి అభివృద్ది చేస్తున్న విషయం తెలిసిందే. అటు రాజకీయంగా కూడా తన అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఉంటాడు. ప్రస్తుతం కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్న సంగతి తెలిసిందే. మనదేశంలో కూడా చాపకింద నీరుల ఈ వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమై అనేక చర్యలు తీసుకుంటున్నారు.

తాజాగా ఆదివారం రోజున కరోనా వ్యాప్తి నివారణ కోసం దేశ వ్యాప్తంగా జనతా కర్ఫ్యూతో పాటుగా… మరికొన్ని రాష్ట్రాలు లాక్‌ డౌన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రకాష్‌ రాజ్‌ కీలక నిర్ణయం తీసుకున్నాడు.  ప్రస్తుత పరిస్థితుల్లో ఇళ్లల్లో నగదు నిల్వా అవసరమని.. అటు లాక్ డౌన్ చేయడంతో.. సామాన్య ప్రజానికానికి డబ్బుల విషయంలో కాస్త ఇబ్బందులు తలెత్తుతాయన్నారు. ఈ నేపథ్యంలో తన ఇంట్లో, ఫార్మ్ హౌస్ లో, ఫిల్మ్ ప్రొడక్షన్, ఫౌండేషన్ లో ఉద్యోగం చేసేవారికీ,తన వ్యక్తిగత సిబ్బందికి మే నెల వరకూ జీతాలు ముందుగానే చెల్లించేశాడు. అంతేకాదు.. తాను నిర్మిస్తున్న మూడు మూవీలకు సంబంధించిన కార్మికులకు కూడా సగం వరకు డబ్బులు చెల్లించినట్లు పేర్కొన్నారు. ఇంతటితో తన పని పూర్తి కాదని.. తన శక్తిమేరకు చేస్తానని.. మీ అందరికీ ఓ విన్నపం చేస్తున్నానంటూ ఓ ట్వీట్ చేశారు. మీ చుట్టూ ఉన్న వారిని ఓ సారి చూడండని… వారికి అవసరమైన సహాయం చేయండంటూ.. ఒకరి జీవనాన్ని… జీవితాన్ని నిలిపే సమయం ఇదే అంటూ పేర్కొన్నారు.

#JanathaCurfew .. what I did today .. let’s give back to life .. let’s stand together.?? #justasking pic.twitter.com/iBVW2KBSfp

— Prakash Raj (@prakashraaj) March 22, 2020