ఏపీలో కొత్తగా 67 కేసులు…మొత్తం 1717కు చేరిన పాజిటివ్స్‌

ఏపీలో కొత్తగా 67 కేసులు...మొత్తం 1717కు చేరిన పాజిటివ్స్‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌పై కోవిడ్ పంజా విసురుతోంది. ఏపీలో కొత్తగా 67 కరోనా పాజటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,717కి చేరింది.

Jyothi Gadda

|

May 05, 2020 | 12:36 PM

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌పై కోవిడ్ పంజా విసురుతోంది. రాష్ట్రంలో కరోనా వైర‌స్ రోజురోజుకు ప్రమాదకరంగా మారుతూనే ఉంది. రోజుకు కనీసం 60-70 కేసులకు తగ్గకుండా కొత్త పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. తాజాగా మ‌రో 67 కొత్త కేసులు న‌మోదైన‌ట్లు ఏపీ వైద్య‌శాఖ అధికారులు వెల్ల‌డించారు.
ఏపీలో కొత్తగా 67 కరోనా పాజటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,717కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంగళవారం హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. గత 24 గంటల్లో 8,263 పరీక్షలు నిర్వహించగా.. 67 మందికి  కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు తెలిపింది. వైర‌స్ బారి నుండి కోలుకుని డిశ్చార్జ్ అయిన వారు కాకుండా యాక్టివ్ కేసులు 1094 ఉన్నాయి. కొత్తగా అనంతపురం జిల్లాలో 2, గుంటూరులో 13, వైఎస్సార్‌ జిల్లాలో 2, కృష్ణా జిల్లాలో 8, కర్నూలు జిల్లాలో 25, నెల్లూరు జిల్లాలో 1, విశాఖపట్నం జిల్లాలో 2 కరోనా కేసులు నమోదు అయినట్టు పేర్కొంది.
రాష్ట్రంలో అత్యధికంగా కర్నూలు జిల్లాలో 516 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తర్వాత గుంటూరు జిల్లాలో 351 కేసులు ఉన్నాయి.. ఇక కృష్ణా జిల్లా కూడా 286 కేసులు నమోదయ్యాయి. విజయనగరం జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 589మందికి నెగిటివ్ రావడంతో వారిని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా కరోనాతో 34మంది చనిపోయారు. అయితే ఇవాల్టి లెక్కల్లో కర్నూలు జిల్లాలోనే 25 కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu