Covid 19 4th Wave: పెరుగుతున్న కేసులతో ఆందోళన అవసరం లేదు.. ఆరోగ్య నిపుణుల కీలక కామెంట్స్..

Covid 19 4th Wave: దేశంలో కోవిడ్ మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. హమ్మయ్య అనుకునేలోపే విరుచుకుపడుతోంది. ముఖ్యంగా దేశ రాజధానిలో రోజు రోజుకు..

Covid 19 4th Wave: పెరుగుతున్న కేసులతో ఆందోళన అవసరం లేదు.. ఆరోగ్య నిపుణుల కీలక కామెంట్స్..
Covid
Follow us

|

Updated on: Apr 29, 2022 | 11:57 AM

Covid 19 4th Wave: దేశంలో కోవిడ్ మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. హమ్మయ్య అనుకునేలోపే విరుచుకుపడుతోంది. ముఖ్యంగా దేశ రాజధానిలో రోజు రోజుకు పాజిటీవ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఢిల్లీలో ఆరో రోజులుగా 1000 కి పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవడం అందరినీ కలవరానికి గురి చేస్తుంది. దాంతో అలర్ట్ అయిన ఢిల్లీ సర్కార్.. కరోనా కట్టడికి ఆంక్షలు విధించింది. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించని వ్యక్తులపై రూ.500 జరిమానా విధిస్తోంది. అలాగే, మార్కెట్ ప్రాంతాల్లోని వ్యాపారులు అంతా బూస్టర్ డోస్ తీసుకోవాలని కోరింది.

ఇదిలాఉంటే.. రాజధాని ఢిల్లీలో ఇప్పటి వరకు 18,78,458 మంది కరోనా బారిన పడగా.. మరణాల సంఖ్య 26,170 లకు చేరింది. ఇక తాజాగా పెరుగుతున్న పాజిటివ్ కేసుల సంఖ్యను పరిశీలిస్తే.. పాజిటీవ్ రేటు 4.50 శాతంగా ఉందని వైద్యాధికారులు చెబుతున్నారు. రోజూ వెయ్యికి పైగా కేసులు నమోదు అవుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

అయితే, కరోనా కేసులు పెరుగుతున్నప్పటకీ.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు నిపుణులు. ఇది 4వ వేవ్‌కు సంకేతం కాదని అభిప్రాయపడుతున్నారు. ‘‘సాధారణంగా కోవిడ్ ఉప్పెన మరియు నిర్దిష్ట వైరస్ ప్రభావ గరిష్ట స్థాయిని లెక్కించినప్పుడు సగటు కేసుల పాజిటివిటీ రేటు, మొత్తం మరణాల రేటును పరిశీలించడం జరుగుతుంది. ప్రస్తుతం పాజిటివిటీ రేటు సగటు 4-5 శాతం మార్కు వద్ద ఉంది. ఇదీ మరింత పెరుగుతుందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కరోనా బారిన పడిన వారిలో ఆస్పత్రిలో చేరిన వారి సంఖ్య 1 శాతం కంటే తక్కువగా ఉంది. ఈ కారణంగానే ఢిల్లీని రెడ్‌జోన్ గా ఇంకా ప్రకటించలేదు.’’ అని కోవిడ్ టాస్క్ ఫోర్స్ కమిటీ సభ్యుడు, ఎయిమ్స్ వైద్యుడు అజయ్ నంబియార్ పేర్కొన్నారు.

ఇక వారం రోజులుగా ఢిల్లీలో కరోనా పాజిటివ్ రేటు క్షీణిస్తోందని నంబియార్ చెప్పుకొచ్చారు. గత సోమవారం కరోనా పాజిటివ్ రేటు 6.42 శాతం ఉంటే.. బుధవారం నాటికి 4.50 శాతానికి వచ్చింది. ఈసారి కరోనా పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు అని అభిప్రాయపడ్డారు డాక్టర్ నంబియార్.

COVID-19 పాజిటివ్ కేసులను నిశితంగా పరిశీలిస్తున్న ప్రముఖ ఆరోగ్య నిపుణులు రిజో ఎమ్ జాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘నిజానికి ఢిల్లీలో కరోనా యాక్టీవ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. ప్రస్తుతం రాజధానిలో కరోనా అదుపులోనే ఉంది.’’ అని ఆయన చెప్పుకొచ్చారు.

తాజాగా ఢిల్లీలో కరోనా బారిన పడిన వారిలో 1.58 శాతం మంది మాత్రమే ఆస్పత్రుల్లో చేరుతున్నారు. మిగతా వారంతా స్వల్ప లక్షణాలతో హోమ్ ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. వివిధ ఆస్పత్రుల్లో అందుబాటులో ఉన్న 9,390 బెడ్స్‌లో కేవలం 148 మంది మాత్రే చికిత్స పొందుతున్నట్లు డేటా చెబుతోంది.

‘రెడ్’ అలర్ట్ ప్రకటించాల్సిన అవసరం లేదు.. సర్వోదయ హాస్పిటల్ & రీసెర్చ్ సెంటర్ సీనియర్ కన్సల్టెంట్, ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్ & జనరల్ ఫిజిషియన్ డాక్టర్ సుమిత్ అగర్వాల్ మాట్లాడుతూ.. కేసులు రోజురోజుకు పెరుగుతున్నప్పటికీ, ప్రభుత్వం ఇంకా రెడ్ అలర్ట్ ప్రకటించడానికి బలమైన కారణం లేదని అన్నారు. ‘‘సగటు CPR రేటును పరిశీలిస్తే.. అన్ని బార్‌లు, రెస్టారెంట్‌లను మూసివేయడం, కర్ఫ్యూ విధించడం వంటి GRAP మార్గదర్శకాలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని నేను అనుకోను. అయితే ప్రతి వ్యక్తి అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.’’

వ్యాక్సినేషన్‌లో వేగం పెంచాలి.. గత కొన్ని రోజులుగా దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ మందగించింది. ‘‘కరోనా నాలువ వేవ్‌ను నియంత్రించడానికి ప్రతీ ఒక్కరూ కోవిడ్ వ్యా్క్సీన్ వేయించుకోవాలి. వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలి. ఇక ఇప్పుడు పెద్దలందరూ బూస్టర్ షాట్‌లకు అర్హులు కాబట్టి.. వారికి టీకాలు వేయాలి.’’ అని ఆరోగ్య నిపుణులు పేర్కొన్నారు.

న్యూఢిల్లీలోని ఇంద్రప్రస్థ అపోలో హాస్పిటల్‌లోని పల్మోనాలజిస్ట్ డాక్టర్ వినీ కంత్రూ మాట్లాడుతూ.. ‘‘కేసుల పెరుగుదల చాలా సాధారణంగా ఉంది. ప్రస్తుతం అన్నీ ఓపెన్ ఉన్నాయి. పిల్లలు పాఠశాలలకు వెళ్తున్నారు. దీని ప్రభావంతో కూడా కేసు పెరిగే అవకాశం ఉంది. అయితే, కేసుల సంఖ్య ఆధారంగా మాత్రమే విధాన నిర్ణయాలను తీసుకునే ముందు ఈ కేసుల ఆకస్మిక పెరుగుదలను చాలా నిశితంగా పరిశీలించాలి. అన్నికంటే ముఖ్యంగా ఆరోగ్య మంత్రిత్వ శాఖ జారీ చేసిన కోవిడ్ 19 ప్రోటోకాల్‌ను అందరూ పాటించాలి. హ్యాండ్ శానిటైజేషన్, మాస్క్ వినియోగం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి. టీకాలు తీసుకోవడం ద్వారా ప్రజల్లో వైరస్‌తో పోరాడే సామర్థ్యం పెరుగుతుంది.’’ అని చెప్పుకొచ్చారు. కాగా, రెస్టారెంట్లు, థియేటరల్లో సినిమా షో లను పరిమితం చేయడం ద్వారా ప్రజా సమూహాన్ని నియంత్రించవచ్చునని, ఇది కరోనా కట్టడికి సహకరిస్తుందని ఆమె చెప్పుకొచ్చారు. అయితే, కర్ఫూ, ఇతర ఆంక్షలపై ఆదేశాలు ఇచ్చే ముందు.. కేసులు పెరుగుతున్న విధానాన్ని నిశితంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చారామె.

ఇప్పటికే అమల్లో ఉన్న కోవిడ్ ఆంక్షలు.. పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో.. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌లు ధరించని వ్యక్తులపై రూ. 500 జరిమానా విధించాలని అధికారులను ఆదేశిస్తూ ఢిల్లీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంతకు కొన్ని రోజుల ముందే అంటే ఏప్రిల్ 12వ తేదీన.. రోజువారీ కేసులు తగ్గుముఖం పట్టినందున ప్రభుత్వం మాస్కులు ధరించడం తప్పనిసరి అనే నిబంధనను ఎత్తివేసింది. ఆ నిసేధం ఎత్తివేసిన కొద్దిరోజులకే కరోనా కేసులు పెరుగుతుండటంతో.. మాస్కులు ధరించడం తప్పనిసరి అంటూ మరోసారి ఉత్తర్వులు జారీ చేసింది.

టీకాలో వేగవంతం.. ఏప్రిల్ 21 నుండి ఢిల్లీ ప్రభుత్వ టీకా కేంద్రాలలో 18-59 సంవత్సరాల వయస్సు గల లబ్ధిదారులకు కోవిడ్-19 వ్యాక్సిన్‌లను ఉచితంగా అందించడం ప్రారంభించినట్లు ఢిల్లీ ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక ఏప్రిల్ 27న, ఢిల్లీ అంతటా వ్యాపారుల సంఘాలు రెగ్యులర్ శానిటైజేషన్‌ను పునఃప్రారంభించాయి. కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో ఏం చేయాలి? ఏం చేయకూడదు అనే అంశాలను పేర్కొంటూ పోస్టర్లను ఢిల్లీ వ్యాప్తంగా అంటిస్తున్నారు. రద్దీ ప్రదేశాల్లో కోవిడ్ ఆంక్షలను పక్కాగా అమలు చేస్తున్నారు. పెద్దలందరికీ కోవిడ్ 19 బూస్టర్ డోస్‌లు అందుబాటులోకి వచ్చినందున.. వ్యాపారులు, వ్యాపార సంఘాలు, దుకాణా యజమానులు టీకా శిబిరాలను ఏర్పాటు చేసేందుకు కూడా ప్లాన్ చేస్తున్నారు.

Also read:

EV fire: ఎలక్ట్రిక్‌ టూవీలర్స్‌ ప్రమాదాలపై కేంద్రం ఫోకస్.. కొత్త మోడల్స్ లాంచింగ్‌పై నిషేధం

Woman Health: ప్రతి మహిళకి 5 వైద్య పరీక్షలు తప్పనిసరి.. లేదంటే ఈ అనారోగ్య సమస్యలు..!

పంజాబ్‌లో చైనా డ్రోన్లు ప్రత్యక్షం.! రెండు చైనా డ్రోన్ల‌ స్వాధీనం
పంజాబ్‌లో చైనా డ్రోన్లు ప్రత్యక్షం.! రెండు చైనా డ్రోన్ల‌ స్వాధీనం
సినిమా లెవల్లో కారును వెంబడించి మరీ ఆపారు.. కట్ చేస్తే
సినిమా లెవల్లో కారును వెంబడించి మరీ ఆపారు.. కట్ చేస్తే
గూడ్సు రైలు కింద ఇరుక్కొని 100 కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు.!
గూడ్సు రైలు కింద ఇరుక్కొని 100 కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు.!
ప్రతిభ గొప్పదా.. అందం గొప్పదా.? ప్రాచీ ఏం నిరూపించింది.?
ప్రతిభ గొప్పదా.. అందం గొప్పదా.? ప్రాచీ ఏం నిరూపించింది.?
మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్
చిక్కుల్లో విజయ్‌ దళపతి.. స్టార్ హీరోపై సామాన్యుడి కేస్.!
చిక్కుల్లో విజయ్‌ దళపతి.. స్టార్ హీరోపై సామాన్యుడి కేస్.!
పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.! మీర్జాపూర్’ నటుడి ఇంట విషాదం.!
పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.! మీర్జాపూర్’ నటుడి ఇంట విషాదం.!