తెలంగాణ ప్రజలకు కరోనా ఊరట..! సర్కార్ సీరియస్ యాక్షన్?

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. రోజుకు వెయ్యి నుంచి రెండు వేలకు చేరువలో పాజిటివ్ కేసులు నమోదు అవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇటువంటి తరుణంలో తెలంగాణ సర్కార్ మరింత అప్రమత్తమైంది.

తెలంగాణ ప్రజలకు కరోనా ఊరట..! సర్కార్ సీరియస్ యాక్షన్?
Follow us

|

Updated on: Jul 09, 2020 | 11:44 AM

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. రోజుకు వెయ్యి నుంచి రెండు వేలకు చేరువలో పాజిటివ్ కేసులు నమోదు అవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. మరణాల సంఖ్య కూడా రోజురోజుకూ భారీగా నమోదు అవుతోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే కాకుండా ఇప్పుడు జిల్లాలకు విస్తరించిన వైరస్ మహమ్మారి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఇటువంటి తరుణంలో తెలంగాణ సర్కార్ మరింత అప్రమత్తమైంది. రాష్ట్రంలో ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులు నిర్వహించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తెలంగాణ సర్కార్…ఆ సంఖ్యను మరింత విస్తరించనుంది.

తెలంగాణ రాష్ట్రంలో కరోనా టెస్టుల సంఖ్యను మరింతగా పెంచేందుకు ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటోంది. ఇందుకోసం 2 లక్షల ర్యాపిడ్ టెస్టు కిట్లను సమకూర్చుకుంటోంది. ఐసీఎంఆర్ మార్గదర్శకాల ప్రకారం ఆరోగ్య శాఖ అధికారులు ర్యాపిడ్ కిట్లను ఉపయోగించనున్నారు. కంటైన్మెంట్ జోన్లలో ర్యాపిడ్ కిట్లను ఉపయోగించాలని ఐసీఎంఆర్ రాష్ట్రాలకు సూచించింది. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, గవర్నమెంట్ ఆస్పత్రులు.. గుర్తింపు పొందిన ప్రైవేటు ఆస్పత్రుల్లో ర్యాపిడ్ కిట్ల ద్వారా కరోనా టెస్టులు నిర్వహించనున్నారు.

జలుబు, దగ్గు లాంటి లక్షణాలున్న వారు, కరోనా సోకిన వారితో కాంటాక్ట్ అయిన వారు, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్న వారు ఈ టెస్టులను చేయించుకోవచ్చు. కరోనా లక్షణాలు లేకున్నా.. ఇతర వ్యాధుల కారణంగా ఆస్పత్రుల్లో చేరిన వారికి యాంటిజెన్ టెస్టులు చేయనున్నట్లు సమాచారం. యాంటీజెన్ టెస్టులను చేయడానికి ప్రత్యేకంగా మెషీన్లు అవసరం లేదు. అర గంటలోనే ఫలితం తెలుసుకునే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.

Latest Articles