AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా మందు పేరుతో మైసూర్ పాక్ సేల్స్.. షాప్ సీల్ చేసిన అధికారులు

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విస్తరిస్తోంది. ఇదే అదునుగా కొందరు కరోనా నివారణ మందు పేరుతో సొమ్ము చేసుకోవాలని చూస్తున్నారు. ఔషథ గుణాలు ఉన్న మైసూర్ పాక్ తింటే కరోనా తగ్గుతుందంటూ ప్రచారం చేసుకుంటున్న స్వీట్ షాపును అధికారులు సీజ్ చేశారు. ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది.

కరోనా మందు పేరుతో మైసూర్ పాక్ సేల్స్.. షాప్ సీల్ చేసిన అధికారులు
Balaraju Goud
|

Updated on: Jul 09, 2020 | 11:37 AM

Share

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విస్తరిస్తోంది. ఇదే అదునుగా కొందరు కరోనా నివారణ మందు పేరుతో సొమ్ము చేసుకోవాలని చూస్తున్నారు. ఔషథ గుణాలు ఉన్న మైసూర్ పాక్ తింటే కరోనా తగ్గుతుందంటూ ప్రచారం చేసుకుంటున్న స్వీట్ షాపును అధికారులు సీజ్ చేశారు. ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది.

కరోనా మందు పేరుతో క్యాష్ చేసుకుంటున్నవారి గుట్టురట్టు చేశారు అధికారులు. మైసూర్‌ పాక్‌ వల్ల కరోనా నయమవుతుందని ప్రకటించిన స్వీట్‌ దుకాణాన్ని అధికారులు మూసివేశారు. కోయంబత్తూరు జిల్లా తొట్టిపాళెయంలోని తిరునెల్వేలి లాలా స్వీట్‌ దుకాణ యజమాని తన దుకాణంలో ఔషధ గుణాలు ఉన్నాయని మైసూర్‌ పాక్‌ తింటే కరోనా ఒకే రోజులో నయమవుతుందని ప్రచారం చేసుకున్నాడు. ఇది నిజమేనని నమ్మిన అమాయకులు కొందరు మైసూర్ పాక్ కోసం ఎగబడ్డారు. ఇలా మూడు నెలలుగా విక్రయాలు చేస్తున్నట్లు ప్రకటనలు ఇచ్చాడు. తన తాత సిద్ధ వైద్యం నేర్పించాడని, దానికి అనుగుణంగా నియామాల ప్రకారం ఔషధ మైసూర్‌ పాక్‌ తయారు చేస్తున్నట్లు ప్రచారం చేసుకున్నాడు. ఇది తింటే వ్యాధి నిరోధక శక్తి పెరిగి కరోనా తగ్గుతుందన్నాడు. దీనికి సంబంధిన ప్రకటన సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దీంతో తమిళనాడు ఆహార, ఆరోగ్యశాఖ అధికారులు, వైద్యులు స్వీట్ షాపును తనిఖీ చేశారు. మైసూర్ పాక్ మందు గురించి స్వీట్‌ దుకాణ యజయాని వద్ద వివరాలు సేకరించారు. ప్రభుత్వం అనుమతి లేకుండా మందు పేరుతో విక్రయం చేయడంతో దుకాణాన్ని సీల్‌ చేశారు. మొత్తం 120 కిలోల మైసూర్‌ పాక్‌ను స్వాధీనం చేసుకున్న అధికారులు షాపు యాజమానిపై కేసు నమోదు చేశారు.

విద్యార్థిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన తోటి విద్యార్థులు..!
విద్యార్థిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన తోటి విద్యార్థులు..!
చలికాలంలో థైరాయిడ్‌ రోగులు ఈ ఆహారాలు తినడం విషంతో సమానం!
చలికాలంలో థైరాయిడ్‌ రోగులు ఈ ఆహారాలు తినడం విషంతో సమానం!
ఉదయాన్నే ఈ పానియం గ్లాసుడు తాగితే.. జుట్టు రాలడం ఆగిపోద్ది!
ఉదయాన్నే ఈ పానియం గ్లాసుడు తాగితే.. జుట్టు రాలడం ఆగిపోద్ది!
అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్‌ లేదా ఇండిపెండెంట్‌ హౌస్ ఏది బెటర్..
అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్‌ లేదా ఇండిపెండెంట్‌ హౌస్ ఏది బెటర్..
డీమార్ట్ బిల్లుపై సెక్యూరిటీ గార్డ్ స్టాంప్ వేయడం వెనుక రీజన్ ఇదే
డీమార్ట్ బిల్లుపై సెక్యూరిటీ గార్డ్ స్టాంప్ వేయడం వెనుక రీజన్ ఇదే
బౌలర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన ఆర్సీబీ స్టార్
బౌలర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన ఆర్సీబీ స్టార్
ఇరాన్‌ సంక్షోభం వేళ.. ట్రంప్‌ కీలక నిర్ణయం..!
ఇరాన్‌ సంక్షోభం వేళ.. ట్రంప్‌ కీలక నిర్ణయం..!
రియల్‌ ఎస్టేట్‌.. మార్చి 31 డెడ్‌లైన్‌.. రెరా వార్నింగ్‌!
రియల్‌ ఎస్టేట్‌.. మార్చి 31 డెడ్‌లైన్‌.. రెరా వార్నింగ్‌!
మానసిక ఒత్తిడిని చిత్తు చేసే ఆహారాలు ఇవే.. మీరు తింటున్నారా?
మానసిక ఒత్తిడిని చిత్తు చేసే ఆహారాలు ఇవే.. మీరు తింటున్నారా?
లైఫ్‌లో అసలు రోగాలే రాకూడదంటే.. వీటిని రోజూ తినండి!
లైఫ్‌లో అసలు రోగాలే రాకూడదంటే.. వీటిని రోజూ తినండి!