AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇవాళ జమ్మూ సెక్టార్ లో రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ టూర్

భారత్-చైనా సరిహద్దుల ఉద్రిక్తత అనంతరం తొలిసారిగా కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఇవాళ జమ్మూ సెక్టార్ లో పర్యటించనున్నారు. జమ్మూ సెక్టార్‌లో గురువారం రాజ్‌నాథ్‌ సింగ్‌ పర్యటిస్తారని రక్షణశాఖ అధికారులు తెలిపారు.

ఇవాళ జమ్మూ సెక్టార్ లో రక్షణమంత్రి  రాజ్‌నాథ్‌ టూర్
Balaraju Goud
|

Updated on: Jul 09, 2020 | 10:56 AM

Share

భారత్-చైనా సరిహద్దుల ఉద్రిక్తత అనంతరం తొలిసారిగా కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఇవాళ జమ్మూ సెక్టార్ లో పర్యటించనున్నారు. జమ్మూ సెక్టార్‌లో గురువారం రాజ్‌నాథ్‌ సింగ్‌ పర్యటిస్తారని రక్షణశాఖ అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా సరిహద్దు రహదారుల సంస్థ నిర్మించిన పలు అభివృద్ధి కార్యాక్రమాలను మంత్రి ప్రారంభిస్తారన్నారు. ఇందులో భాగంగా కొత్త నిర్మించిన ఆరు బ్రిడ్జిలను ఆయన ప్రారంభిస్తారని పేర్కొన్నారు. సుమారు రూ.43 కోట్ల వ్యయంతో ఆరు వంతెనలు నిర్మించినట్లు అధికారులు తెలిపారు. అఖ్నూర్ సెక్టార్‌లో నాలుగు వంతెనలు, జమ్మూ-రాజ్ పురా ప్రాంతంలో రెండు వంతెనలను రక్షణ మంత్రి ప్రారంభించనున్నారు. ముఖ్యంగా జమ్మూకశ్మీర్, ఉత్తరాఖండ్‌లో బీఆర్ఓ ద్వారా రహదారి పనులకు అదనంగా రూ.1,691 కోట్లు మంజూరు చేస్తూ గత నెలలో కేంద్రం ఆమోదం తెలిపింది. అనంతరం సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులపై ఆర్మీ ఆధికారులతో చర్చించే అవకాశముంది. సరిహద్దు ఉద్రిక్తతల అనంతరం రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తొలిసారిగా పర్యటిస్తున్నారు. గతవారం మోదీ ఆకస్మీక పర్యటనతో రాజ్‌నాథ్‌ సింగ్‌ టూర్ వాయిదా పడింది,

Follow Us
ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర సర్కార్ గ్రీన్ సిగ్నల్..!
ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర సర్కార్ గ్రీన్ సిగ్నల్..!
కనురెప్పలు ఎందుకుండవ్.. పూరీ జగన్నాథుడి కళ్ల వెనకున్న శక్తి..
కనురెప్పలు ఎందుకుండవ్.. పూరీ జగన్నాథుడి కళ్ల వెనకున్న శక్తి..
నీట్ పేపర్ లీక్‌పై పార్లమెంట్‌లో చర్చకు మేం రెడీ..
నీట్ పేపర్ లీక్‌పై పార్లమెంట్‌లో చర్చకు మేం రెడీ..
ఇలా ఉన్నారేంట్రా సామీ! కాటేసిన కోబ్రాను డబ్బాలో పెట్టి ఆస్పత్రికి
ఇలా ఉన్నారేంట్రా సామీ! కాటేసిన కోబ్రాను డబ్బాలో పెట్టి ఆస్పత్రికి
కొత్త ఫ్లాట్ కొనుగోలు చేసే ముందు ఈ వాస్తు విషయాలు తప్పక చూడండి..
కొత్త ఫ్లాట్ కొనుగోలు చేసే ముందు ఈ వాస్తు విషయాలు తప్పక చూడండి..
ఈపీఎఫ్ అకౌంట్ ఉందా..? నెలకు రూ.7,500 పెన్షన్ రానుందా..?
ఈపీఎఫ్ అకౌంట్ ఉందా..? నెలకు రూ.7,500 పెన్షన్ రానుందా..?
ఆర్టీసీకి చుక్కలు చూపించిన ప్రయాణికుడు.. రూ.15 వేల ఫైన్!
ఆర్టీసీకి చుక్కలు చూపించిన ప్రయాణికుడు.. రూ.15 వేల ఫైన్!
బలహీనంగా ఉన్న వారికి ఇది ఒక్క ముద్ద చాలు.. డబుల్ బెనిఫిట్స్
బలహీనంగా ఉన్న వారికి ఇది ఒక్క ముద్ద చాలు.. డబుల్ బెనిఫిట్స్
చిన్నప్పుడు భిక్షాటన చేసిన వ్యక్తి. ఇప్పుడు ఏపీలో పోలీస్ ఆఫీసర్
చిన్నప్పుడు భిక్షాటన చేసిన వ్యక్తి. ఇప్పుడు ఏపీలో పోలీస్ ఆఫీసర్
రాత్రి భోజనం చేసిన తర్వాత వాంతులు, హాస్పిటల్‌కు వెళ్లగా..
రాత్రి భోజనం చేసిన తర్వాత వాంతులు, హాస్పిటల్‌కు వెళ్లగా..