రైతులకు సీఎం కేసీఆర్ ఫోన్ కాల్.. సాగునీటిపై ఆరా

ప్రజల కోసం తీసుకువచ్చిన పథకాలు ఎంతవరకు చేరుతున్నాయని స్వయంగా తెలుసుకుంటారు ముఖ్యమంత్రి కేసీఆర్. ప్రజా సంక్షేమ పథకాలు ఎంతమేర సత్ఫలితాలు ఇస్తున్నాయో తానే పర్యవేక్షిస్తుంటారు. ఇదే ప్రజల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇమేజ్ పెంచేలా చేస్తోంది. తాజాగా రైతులకు నేరుగా ఫోన్ చేశారు సీఎం కేసీఆర్.

రైతులకు సీఎం కేసీఆర్ ఫోన్ కాల్.. సాగునీటిపై ఆరా
Follow us
Balaraju Goud

|

Updated on: Jul 09, 2020 | 10:40 AM

ఊహించని రీతీలో వ్యవహరించటంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు పరిపాటు. ఆయన తీసుకునే నిర్ణయాలు ప్రజలకు నేరు అందుతున్నాయా లేదా అని చెక్ చేసుకుంటూ ఉంటారు. ప్రజల కోసం తీసుకువచ్చిన పథకాలు ఎంతవరకు చేరుతున్నాయని స్వయంగా తెలుసుకుంటారు. ప్రజా సంక్షేమ పథకాలు ఎంతమేర సత్ఫలితాలు ఇస్తున్నాయో తానే పర్యవేక్షిస్తుంటారు. ఇదే ప్రజల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇమేజ్ పెంచేలా చేస్తోంది. తాజాగా రైతులకు నేరుగా ఫోన్ చేశారు సీఎం కేసీఆర్.

ముఖ్యమంత్రి నుంచి ఫోన్ కాల్ రావటంతో ఆ రైతు సంతోషం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి లైన్ లోకి రావటంతోనే.. రాజన్నసిరిసిల్ల జిల్లా రైతులు అశ్చర్యానికి గురయ్యారు. బోయినిపల్లి మాజీ జెడ్పీటీసీ లచ్చిరెడ్డి, వెంకట్రావుపేట మాజీ సర్పంచ్‌ కాటిపెల్లి శ్రీపాల్‌రెడ్డికి సీఎం కేసీఆర్ ఫోన్‌చేసి మధ్యమానేరు ప్రాజెక్టు పనితీరును ప్రస్తావించారు. అలాగే, వరదకాలువ ద్వారా జగిత్యాల జిల్లా కథలాపూర్‌, మేడిపల్లి మండలాల్లో పొలాలకు సాగునీరందించేందుకు తీసుకోవాల్సిన చర్యలను స్వయంగా అక్కడి రైతులను అడిగి తెలుసుకున్నారు. సీఎం స్వయంగా ఫోన్‌చేసి ఆరా తీయడంతో అన్నదాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

‘మీ గ్రామాల పొలాలకు నీళ్లిద్దాం.. ఎలా చేస్తే లాభమో చెప్పండి’ అంటూ స్వయంగా రైతులకు ఫోన్‌చేసిన ముఖ్యమంత్రిని ఎప్పుడైనా చూశారా? ఇంజినీర్లతో కూర్చుని నీళ్లను ఎలా తరలిద్దామో చర్చించుకుందాం.. హైదరాబాద్‌కు రండి అంటూ నేరుగా ఆహ్వానించారు ముఖ్యమంత్రి కేసీఆర్‌.

శ్రీరాంసాగర్‌ పునర్జీవ పథకం కింద ఇప్పటికే వేలమంది రైతులకు లబ్ధిచేకూరుతోంది. 122 కిలోమీటర్ల పొడవున్న వరద కాలువను ఇప్పటికే నాలుగు రిజర్వాయర్లుగా ద్వారా 34 తూములతో చెరువులను నింపుతున్నారు. తద్వారా పరీవాహక ప్రాంతంలో భూగర్భజలాలు పెరిగిపోయాయి. అయితే.. వరద కాలువ దిగువ భూములకు తూముల ద్వారా నీళ్లందుతుండగా.. ఎగువ గ్రామాలకు కూడా నీళ్లివ్వాలనే విజ్ఞప్తులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌.. సమస్యల పరిష్కారానికి దృష్టి సారించారు. బుధవారం జగిత్యాల జిల్లా కథలాపూర్‌ మాజీ జెడ్పీటీసీ నాగం భూమయ్య, మేడిపల్లి మండల రైతు సమన్వయ సమితి జిల్లా కార్యవర్గసభ్యుడు, వెంకట్రావుపేట మాజీ సర్పంచ్‌ కాటిపెల్లి శ్రీపాల్‌రెడ్డికి నేరుగా ఫోన్‌చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు ముఖ్యమంత్రి.

వరదకాలువ ద్వారా రైతులకు నీళ్లందుతున్నతీరు, పరీవాహక ప్రాంతాల రైతుల అవసరాలపై వారితో మాట్లాడారు సీఎం. ఈ సందర్భంగా రైతులు వరద కాలువ ప్రయోజనాలను సీఎంకు వివరించారు. పునర్జీవ పథకంతో మండలంలోని తక్కల్లపల్లి, సిరికొండ, బొమ్మెన, కథలాపూర్‌ గ్రామాల ముఖచిత్రం పూర్తిగా మారిపోయిందని, రైతులు ఎంతో సంతోషంగా ఉన్నారని తెలిపారు. అయితే, వరదకాలువకు ఎగువనున్న మరో 12 గ్రామాలకు లిప్టుద్వారా నీళ్లిస్తే.. ఆ గ్రామాల రైతుల కష్టాలు తీరుతాయని విజ్ఞప్తి చేశారు. వెంటనే స్పందించిన సీఎం కేసీఆర్‌.. పూర్తి వివరాలు మాట్లాడేందుకు రెండు మూడురోజుల్లో హైదరాబాద్‌ రమ్మని ఆహ్వానించారని మాజీ జెడ్పీటీసీ భూమయ్య తెలిపారు.

మేడిపల్లికి మండలం వెంకట్రావుపేట మాజీ సర్పంచ్‌ శ్రీపాల్‌రెడ్డితోనూ ముఖ్యమంత్రి మాట్లాడారు. వరదకాలువ నీళ్లతో కొండాపూర్‌, రంగాపూర్‌, దమ్మన్నపేట, కల్వకోట గ్రామాల రైతులకు మేలు చేకూరిందని శ్రీపాల్‌రెడ్డి తెలిపారు. కానీ, ఎగువభాగంలోఉన్న 13 గ్రామాలకు నీళ్లందడం లేదని ముఖ్యమంత్రికి వివరించారు. లిప్టులు ద్వారా వేల ఎకరాలు సాగులోకి వస్తాయని ముఖ్యమంత్రికి వివరించారు. దీంతో పూర్తి వివరాలపై మాట్లాడేందుకు హైదరాబాద్‌ రమ్మని శ్రీపాల్‌రెడ్డికి సీఎం సూచించారు. అలాగే ఆ ప్రాంతంపై అవగాహన ఉన్న ఇంజినీరింగ్‌ అధికారులను తీసుకురావాలని సీఎం చెప్పరని శ్రీపాల్‌రెడ్డి వివరించారు.