బ్రేకింగ్.. వికాస్ దూబే అరెస్ట్

కరడు గట్టిన  క్రిమినల్ వికాస్ దూబే అరెస్టయ్యాడు. మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినిలో పోలీసులు ఇతడిని అరెస్టు చేశారు. గతవారం కాన్పూర్ లోని..

బ్రేకింగ్.. వికాస్ దూబే అరెస్ట్
Follow us
Umakanth Rao

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 09, 2020 | 10:47 AM

కరడు గట్టిన  క్రిమినల్ వికాస్ దూబే అరెస్టయ్యాడు. మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినిలో పోలీసులు ఇతడిని అరెస్టు చేశారు. గతవారం కాన్పూర్ లోని ఓ గ్రామంలో ఎనిమిది మంది పోలీసులను  కాల్చి చంపిన ఇతని కోసం సుమారు రెండువందల పైగా పోలీసు బృందాలు గాలిస్తున్నాయి.

కోర్టు కాంప్లెక్సులతో బాటు నోయిడాలోని ఓ ఛానల్ కార్యాలయంలో పోలీసులు  మాటు వేశారని, ఇది తెలుసుకున్న వికాస్ దూబే.. బహుశా కోర్టులో గానీ టీవీ స్థూడియోలో గానీ సరెండర్ కావడానికి యత్నించవచ్చునని ఖాకీలు భావించినట్టు తెలుస్తోంది. మూడు రాష్టాలకు చెందిన పోలీసులు ఇతనికోసం గాలిస్తూ వచ్చిన విషయం తెలిసిందే. అయితే వారి కన్ను గప్పి దూబే.. ఉజ్జయినికి పరారయ్యాడు. అక్కడ తన ఉనికి గురించి పోలీసులకు తెలిసేలా వ్యవహరించాడట. మొత్తానికి మధ్యప్రదేశ్ పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ట్రాన్సిట్ రిమాండ్ కోసం కోర్టు అనుమతించిన పక్షంలో యూపీ పోలీసులకు అతడిని అప్పగించవచ్ఛు.

యూపీలో జరిగిన రెండు వేర్వేరు ఎన్ కౌంటర్లలో వికాస్ దూబే అనుచరులు ఇద్దరు   హతం కాగా.. నిన్న అమర్ దూబే అనే మరొకడు కూడా హమీర్ పూర్ లో హతమయ్యాడు. తనపై 60 క్రిమినల్ కేసులున్న వికాస్ దూబే పై రివార్డును పోలీసులు రెండున్నర లక్షల నుంచి ఐదు లక్షలకు పెంచారు. రాజకీయాల్లో తలదూర్చి ఎమ్మెల్యే కావాలనుకున్న దూబే జిల్లా పంచాయతీ పదవులు అనుభవించాడు. 2001 లో శివ్లీ పోలీసు స్టేషన్ లో బీజేపీ నేత సంతోష్ శుక్లాని వికాస్ దూబే కాల్చి చంపాడు. కానీ ఇతనికి మద్దతు పలుకుతున్న పోలీసుల కారణంగా ఇతనిపై హత్యాభియోగాలు నిరూపణ కాలేదు. కాన్పూర్ లో పోలీసుల మీద కాల్పుల అనంతరం వికాస్ ఇదే పోలీసు స్టేషన్ లో రెండు రోజులు దాక్కున్నాడట.. అంటే ఇతనికి పోలీసులు ఎంతగా దాసోహమన్నారో తెలుస్తోంది.