టీటీడీలో పెరుగుతున్న కరోనా కేసులు
తిరుమల తిరుపతి దేవస్థానంలో కరోనా కలవరానికి గురిచేస్తోంది. టీటీడీలో ఇప్పవరకూ మొత్తం 80 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు జిల్లా కలెక్టరు ఎన్.భరత్ గుప్తా తెలిపారు.
కరోనా మహమ్మారి వికృత రూపం దాల్చుతోంది. పట్టణాలకే పరిమితమైన కరోనా వైరస్ మెల్లమెల్లగా మారుమూల ప్రాంతాలకు విస్తరిస్తోంది. చాపకింద నీరులా వ్యాప్తి చెందుతున్న కరోనా ధాటికి జనం అందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆలయాలను సైతం కొవిడ్ వదలడం లేదు. తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానంలో కరోనా కలవరానికి గురిచేస్తోంది.
టీటీడీలో ఇప్పవరకూ మొత్తం 80 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు జిల్లా కలెక్టరు ఎన్.భరత్ గుప్తా తెలిపారు. తిరుపతిలో ఆయన ఈ విషయం వెల్లడించారు. నిత్యం 200 మంది టీటీడీ సిబ్బందికి పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. భక్తుల ద్వారా ఉద్యోగులకు వైరస్ సోకినట్లు ఆధారాల్లేవన్నారు. అయితే, భక్తులకు కూడా కొవిడ్ టెస్ట్ చేస్తున్నామన్న కలెక్టర్.. ఇప్పటిదాకా 800 మంది భక్తులకు పరీక్షలు చేయగా అందరికీ నెగెటివ్ వచ్చిందన్నారు. తాజాగా పాజిటివ్ కేసులు బయటపడుతుండడంతో భక్తుల్లో తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.