Corona tragedy: కృష్ణా జిల్లా పెడనలో విషాదం.. కరోనా సోకిందనే మనస్తాపంతో దంపతుల ఆత్మహత్య
కరోనా తీసుకొచ్చిన విషాదాలు అన్నీ, ఇన్నీ కావు. దేశవ్యాప్తంగా ఈ మహమ్మారి ప్రజలను అతలాకుతలం చేస్తుంది. ఎంతోమందిని ఇప్పటికే కోల్పోయాం. చాలామంది ప్రస్తుతం...
కరోనా తీసుకొచ్చిన విషాదాలు అన్నీ, ఇన్నీ కావు. దేశవ్యాప్తంగా ఈ మహమ్మారి ప్రజలను అతలాకుతలం చేస్తుంది. ఎంతోమందిని ఇప్పటికే కోల్పోయాం. చాలామంది ప్రస్తుతం వ్యాధితో పోరాడుతున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న పరిణామాల నేపథ్యంలో వ్యాధి సోకినప్పుడు మనోనిబ్బరం అవసరం. భయం వల్ల బీపీ పెరగడం, హార్డ్ అటాక్ వంటి కారణాల వల్ల చాలామంది చనిపోతున్నారు. మరికొందరు కరోనా సోకితే.. మనస్తాపంతో బలవన్మరణానికి పాల్పడుతున్నారు. తాజాగా కృష్ణా జిల్లా పెడనలో విషాదం చోటుచేసుకుంది. కరోనా సోకిందనే మనస్తాపంతో దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇంట్లో ఉరేసుకుని లీలాప్రసాద్(40), భారతి(38) ఆత్మహత్యకు పాల్పడ్డారు. వారం రోజులుగా వీరు కరోనాతో పోరాడుతున్నారు. ఇంకో వారం రోజులు అయితే వారం ఈ వైరస్ బారి నుంచి బయటపడేవారు. ఇంతలోనే వారు ఈ పని చేయడం బాధాకరం.
వైట్ ఫంగస్ వచ్చేస్తుంది బీ అలర్ట్…
దేశంలో కరోనా రెండో వేవ్ తీవ్ర డ్యామేజ్ చేస్తున్న వేళ.. ఫంగల్ ఇన్‌ఫెక్షన్ల ముప్పు వణుకుపుట్టిస్తుంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో బ్లాక్ ఫంగస్ కేసులు, మరణాలు అలజడిరేపుతున్నాయి. తాజాగా వైట్ ఫంగస్ వెలుగులోకి రావడం భయాన్ని కలిగిస్తుంది. బ్లాక్ ఫంగస్ కంటే ఇది మరింత డేంజర్ అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. తాజాగా పట్నా మెడికల్ కాలేజీలో నలుగురిలో వైట్ ఫంగస్ గుర్తించారు.
దీనిపై పట్నా మెడికల్ కాలేజీ మైక్రోబయాలజీ విభాగం చీఫ్ డాక్టర్ ఎస్‌ఎన్ సింగ్ మాట్లాడుతూ.. నాలుగు వైట్ ఫంగస్ కేసులు గుర్తించినట్టు వెల్లడించారు. ఈ నలుగురు రోగుల్లో కరోనా సింటమ్స్ కనిపించినప్పటికీ పరీక్షల్లో నెగెటివ్‌గా వచ్చిందన్నారు. దీనిపై సమగ్ర దర్యాప్తు కొనసాగుతోందని ఆయన తెలిపారు. వైట్ ఫంగస్ కేవలం ఊపిరితిత్తులపైనే కాకుండా చర్మం, గోళ్లు, పొట్ట, కిడ్నీలు, మెదడు, మర్మాంగాలు, నోరు భాగాలపై కూడా ప్రభావం చూపుతుందని చెబుతున్నారు.
కరోనాకు సంబంధించిన వివరాలు దిగువ వీడియోలో చూడండి…
Also Read: తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం.. ‘పెళ్లి సందడి’ సినిమాటోగ్రాఫర్ వి. జయరాం కన్నుమూత