Crow: కాకి తలపై తన్నితే అపశకునమా.? కాకి వాళితే తలస్నానం ఎందుకు చేయాలి.? దీంట్లో ఉన్న శాస్త్రీయత ఏంటంటే..
Crow Hit On Head: భారత దేశం ఎన్నో సంప్రదాయాలకు మరెన్నో నమ్మకాలకు నెలవు. అయితే కొన్ని నమ్మకాలు ప్రజల్లో మూఢ నమ్మకంలా బలంగా నాటుకుపోయాయి. ఆరోగ్యానికి హాని చేసే..
Crow Hit On Head: భారత దేశం ఎన్నో సంప్రదాయాలకు మరెన్నో నమ్మకాలకు నెలవు. అయితే కొన్ని నమ్మకాలు ప్రజల్లో మూఢ నమ్మకంలా బలంగా నాటుకుపోయాయి. ఆరోగ్యానికి హాని చేసే వాటికి చెక్ పెట్టడానికి మన పెద్దలు సంప్రదాయం పేరుతో మనలో ఓ భయాన్ని కలిగించేలా కొన్ని నమ్మకాలను ఎక్కించారు. అలాంటి వాటిలో కాకి తన్నితే అపశకునం మనే ఓ నమ్మకం ప్రజల్లో ఉంది. కాకి తలపై తన్నితే మరణ వార్త వింటారని.. ఏడేళ్ల పాటు శని తాండవిస్తుందని నమ్ముతుంటారు. అయితే దీని వెనక కూడా శాస్త్రీయత ఉందని మీకు తెలుసా.? ఇంతకీ కాకి తలపై తన్నితే సైన్స్ ప్రకారం ఏమవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.. కాకి గోళ్లు చాలా పదునుగా ఉంటాయి. కాబట్టి వేగంగా ఎగురుతూ వచ్చి తలపై తన్నితే గోళ్లు గుచ్చుకునే ప్రమాదం ఉంటుంది. అయితే కాకులు సహజంగా ఆహార అన్వేషణలో భాగంగా ఎలుకలను, చనిపోయిన జంతువులను కాలి గోళ్లతో పీక్కుతింటాయి. దీనివల్ల కుళ్లి పోయిన జంతువుల వ్యర్థాలు కాకి కాలి గోళ్లలో ఉండిపోతాయి. ఈ క్రమంలో తలపై తన్నిన సమయంలో కుళ్లిపోయిన వ్యర్థాల్లో ఉండే క్రిములు మానవ శరీరంలోకి ప్రవేశించే ప్రమాదం ఉంటుంది. అయితే పూర్వం రోజుల్లో సరైన వైద్య సదుపాయాలు లేకపోవడంతో సూక్ష్మ క్రిములు శరీరంలోకి ప్రవేశించడంతతో మరణాలకు దారి తీసేది. దీంతో కాకి తన్నితే మరణం సంభవిస్తుందనే నమ్మకం బలంగా ఉండిపోయింది. అంతే కాకుండా కాకి తలపై తన్నితే తల స్నానం చేయాలని చెబుతుంటారు. దీనివల్ల తలపై ఏమైనా క్రిములు చేరితో తొలిగిపోతాయని చెబుతుంటారు. కాబట్టి కాకి తన్నితే అపశకునంలాగా భావించకుండా శాస్త్రీయంగా ఆలోచించి. ఏదైనా గాయమైతే చికిత్స తీసుకోవడం ఉత్తమం.
Also Read: మీకు ఈ అలవాట్లు ఉంటే ఆర్థిక సమస్యలు తప్పవు.. గరుడ పురాణంలో ఉన్న విషయాలు ఏంటంటే..
Blood Moon: 26న ఆకాశంలో అద్భుతం.. కనువిందు చేయనున్న ‘సూపర్ బ్లడ్ మూన్’