- Telugu News Photo Gallery Spiritual photos Do you know these 5 habits of human make angry to goddess lakshmi according to garuda puranam
మీకు ఈ అలవాట్లు ఉంటే ఆర్థిక సమస్యలు తప్పవు.. గరుడ పురాణంలో ఉన్న విషయాలు ఏంటంటే..
గరుడ పురాణాన్ని సనాతన ధర్మంలో మహా పురాణంగా భావిస్తారు. ఇది మనిషి మరణించిన తర్వాత మోక్షం గురించి పూర్తి వివరంగా చెబుతుంది. భక్తి, జ్ఞానం, ధర్మం, కర్మ, మరణ రహస్యాల గురించి పూర్తిగా గరుడ పురాణం వివరిస్తుంది. అయితే మనిషి తన జీవితంలో కోన్ని పనులు చేయడం వలన తీవ్ర ఆర్థిక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
Updated on: May 20, 2021 | 10:26 PM

లక్ష్మీ దేవి మురికి బట్టలు ధరించే వారిని వదిలేస్తుంది. డబ్బు, పేదరికం మన చేతుల్లో ఉండకపోవచ్చు. కానీ ప్రతి పరిస్థితిలోనూ మనం పరిశుభ్రతను కాపాడుకోవచ్చు. కాబట్టి ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉండాలి.. అలాగే శుభ్రమైన బట్టలు ధరించాలి.

మనస్సు ఎల్లప్పుడూ అన్ని సమయాలలో తినడంలో నిమగ్నమై ఉంటుంది, అధికంగా తింటారు అలాగే అన్ని సమయాలలో తినడం గురించి ఆలోచిస్తారు. అలాంటి వారికి లక్ష్మీ కటాక్షం ఉండదు. ఎందుకంటే ఈ జీవితం కర్మ చేయడం కోసమే. ఇందులో ఆహారం మీ జీవన సాధనంగా మాత్రమే తయారు చేయబడింది.

ఒకరినొకరు గౌరవించని ఇంట్లో ప్రతి విషయంపై తగాదాలు ఉన్న చోట. మాటల్లో కఠినత్వం ఉన్న చోట లక్ష్మి దేవి ఉండదు. కాబట్టి ఎల్లప్పుడూ మీ మధురంగా మాట్లాడాలి. అలాగే ఇళ్ళును ఎప్పుడూ ప్రశాంతంగా ఉంచాలి.

నోటిని శుభ్రం చేయని వారి దగ్గర లక్ష్మీ దేవి నివాసం ఉండలేదు. అలాగే సోమరితనం ఉన్నవారి దగ్గర కూడా లక్ష్మీ ఆశీర్వాదం లభించదు.

గరుడ పురాణంలో ఉదయం, సాయంత్రం సమయం భగవంతుడిని జ్ఞాపకం చేసుకోవాలని, వ్యాయామం చేయమని చెబుతారు. సూర్యోదయం, సూర్యాస్తమయం తర్వాత నిద్రపోయే వారికి లక్ష్మి దేవి కటాక్షం ఉండదు.

గరుడ పురాణం..





























