- Telugu News Photo Gallery Spiritual photos Do you know why only silver jewelry is worn on feet instead of gold know religious and scientific reasons here full details
పాదాలకు బంగారు ఆభరణాలు ఎందుకు ధరించకూడదో మీకు తెలుసా.. శాస్త్రం ఏం చెబుతుందంటే..
మహిళలకు ఆభరణాలంటే మహా ఇష్టం. ప్రతి చిన్న వేడుకలైన మహిళలు ఎక్కువగా ముస్తాబవుతుంటారు. ఇక మహిళలకు అన్నింటికంటే ఎక్కువ ఇష్టం బంగారం. పసిడి ఆభరణాలు ధరించడానికి ఎక్కువగా ఇష్టం చూపిస్తారు. అయితే బంగారాన్ని పాదాలపై ధరించకూడదు అని పెద్దలు చెబుతుంటారు.
Updated on: May 19, 2021 | 10:51 PM

వాస్తవానికి ఆయుర్వేదంలో పాదాలు వెచ్చగా.. కడుపు మృదువుగా.. తల చల్లగా ఉండాలి అని ఓ సామెత ఉంటుంది. ఇవి ఆరోగ్యంగా ఉండే సహజ లక్షణాలు. అయితే నిజానికి బంగారం ఎక్కువగా వేడిని కలుగజేస్తుంది. అలాగే వెండి చల్లదనాన్ని ఇస్తుంది.

మన శరీరంలో బలం అనేది కింది నుంచి పైకి ప్రవహిస్తుంది. కాబట్టి చల్లటి స్వభావం గల వెండిని పాదాలపై ధరించినప్పుడు .. చల్లదనాన్ని శరీరానికి అందచేస్తుంది అని నమ్మకం.

దీని వలన తలలో చల్లదనం ఉంటుంది. అలాగే మహిళలు అనేక ఆనారోగ్య సమస్యల నుంచి రక్షించబడతారు. అయితే మహిళలు ఎక్కువగా బంగారం ధరిస్తే శరీరం మొత్తం వేడిగా ఉంటుంది. దీంతో అనేక అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి.

వెండి పట్టిలు ధరించినప్పుడు మహిళలు ఎక్కువగా నడిచినప్పుడు అవి రాపిడికి గురవుతాయి. దీంతో వీరి ఎముకలు బలంగా అవుతాయి. పూర్వం పురుషులు, మహిళలు ఆభరణాలు ధరించేవారు. కానీ ప్రస్తుతం మహిళలు మాత్రమే ధరిస్తున్నారు.

అయితే శాస్త్రం ప్రకారం.. నారాయణుడికి పసుపు రంగు అంటే చాలా ఇష్టం. బంగారాన్ని విష్ణువుకు ఇష్టమైన వస్తువుగా భావిస్తారు. అలాగే దీనిని లక్ష్మీ దేవిగా భావిస్తారు.

బంగారాన్ని పాదాలకరు ధరిస్తే.. లక్ష్మీ, నారాయణుడిని అవమానించినట్లు అవుతుంది. హిందూ గ్రంధాలలో పాదాలకు బంగారం ధరించవద్దని ఉంటుంది. ఇలా చేస్తే లక్ష్మీ దేవి కోపం వస్తుందని.. ఫలితంగా ఆర్థిక సమస్యలు ఎదుర్కోవలసి వస్తుందని చెబుతుంటారు.





























