ఒక వ్యక్తి నిజం చెప్తున్నాడా ? అబద్ధం చెప్తున్నాడా ? అని ఈ సంకేతాలతో తెలుసుకోవచ్చట.. గరుడ పురాణంలో ఉన్న విశేషాలెన్నో..
Garuda Puranam: నారాయణుడు.. ఆ స్వామి వాహనం అయిన గరుడ పక్షి మధ్యం ఒకసారి సంభాషణ జరిగిందట. ప్రజలకు భక్తి, ఆసక్తి, త్యాగం, తపస్సు, దాతృత్వం, ధర్మం గురించి ఎలా తెలుస్తుంది అని. ఇందుకు సంబంధించిన విషయాలు గరుడ పురాణంలో ఉన్నాయి. ఒక వ్యక్తి నిజం చెప్తున్నాడా లేదా అబద్ధం చెప్తున్నాడా అనే విషయాన్ని ఎలా గుర్తించాలనే విషయం అందులో స్పష్టంగా ఉంది.

గరుడ పురాణం..
- ముఖం.. ఒక వ్యక్తి నిజాన్ని లేదా అబద్ధాలను తెలుపుతుంది. మాట్లాడే వ్యక్తి ముఖ కవలికలను బట్టి తాను నిజం చెప్తున్నాడా ? లేదా అబద్ధం చెప్తున్నాడా ? అనే విషయాన్ని తెలుసుకోవచ్చు.
- కళ్లు.. మీతో మాట్లాడుతున్న వ్యక్తి కళ్ళను జాగ్రత్తగా చూస్తే.. అతను మాట్లాడే మాటలు నిజమా.. కాదా అనే సందేహం కచ్చితంగా వస్తుంది. అతను మాట్లాడే సమయంలో కళ్లు స్థిరంగా ఉండకుండా.. దిక్కులు చూస్తాడు.
- మాట.. అబద్ధం చెప్తున్న సమయంలో ఆ వ్యక్తి మాటలలో తడబాటు ఉంటుంది. మాట్లాడానికి వెనకడతారు.. అలాగే తొందరగా మాట్లాడతారు.
- సంజ్ఞ.. మీతో మాట్లాడుతున్న వ్యక్తి అబద్ధం చెప్తున్నప్పుడు.. తన హావభావాలు.. చర్యలు బిన్నంగా ఉంటాయి.
- వేగం.. అబద్ధం చెప్తున్న సమయంలో ఆ వ్యక్తి వేగంగా మాట్లాడతాడు. ఆ సమయంలో తన శరీరం మాత్రం అలసత్వంగా ఉంటుంది.
- సంకేతం.. అబద్ధం మాట్లాడుతున్న వ్యక్తి ఆ సమయంలో చేతులు, కాళ్లు వణుకుతుంటాయి.
- గరుడ పురాణం..











