ఆ ఐదు రాష్ట్రాల నుంచి వస్తే కరోనా టెస్ట్ చేయించుకోవాల్సిందే… ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఆదేశాలు

coronavirus test: దేశవ్యాప్తంగా కరోనా వైర‌స్ విజృంభ‌ణ కొన‌సాగుతూనే ఉంది. ఇటీవల తగ్గిన కేసులు కాస్త.. మళ్లీ పెరుగుతుండుంటంతో ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు అప్రమత్తమవుతున్నాయి. ఇప్పటికే మహారాష్ట్ర ప్రభుత్వం...

ఆ ఐదు రాష్ట్రాల నుంచి వస్తే కరోనా టెస్ట్ చేయించుకోవాల్సిందే... ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఆదేశాలు
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Feb 23, 2021 | 12:17 PM

coronavirus test: దేశవ్యాప్తంగా కరోనా వైర‌స్ విజృంభ‌ణ కొన‌సాగుతూనే ఉంది. ఇటీవల తగ్గిన కేసులు కాస్త.. మళ్లీ పెరుగుతుండుంటంతో ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు అప్రమత్తమవుతున్నాయి. ఇప్పటికే మహారాష్ట్ర ప్రభుత్వం కరోనా కట్టడికి కొన్ని ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ను విధించడంతోపాటు.. కఠినమైన ఆంక్షలను అమల్లోకి తీసుకొచ్చింది. పెరుగుతున్న కేసుల మధ్య ఉత్త‌రాఖండ్ ప్ర‌భుత్వం కూడా ప‌క‌డ్బంధీ చ‌ర్య‌లను అమల్లోకి తీసుకువచ్చింది. ముఖ్యంగా ఇత‌ర రాష్ట్రాల నుంచి త‌మ రాష్ట్రానికి వ‌చ్చే ప్ర‌యాణికులు, ప‌ర్యాట‌కుల‌పై ప్ర‌త్యేకంగా దృష్టి సారించింది.

ముఖ్యంగా మ‌హారాష్ర్ట‌, గుజ‌రాత్‌, కేర‌ళ‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, ఛ‌త్తీస్‌గఘఢ్ రాష్ట్రాల నుంచి ఉత్తరఖండ్‌కు వ‌చ్చే ప్ర‌యాణికులు, ప‌ర్యాట‌కుల‌ు త‌ప్ప‌నిస‌రిగా కరోనా పరీక్షలు చేయించుకోవాల‌ని ఆదేశాలు జారీ చేసింది. రాష్ర్ట స‌రిహ‌ద్దుల‌తో పాటు అన్ని రైల్వేస్టేష‌న్లు, డెహ్రాడూన్ ఎయిర్‌పోర్టులో క‌రోనా టెస్టు సెంట‌ర్ల‌ను ఏర్పాటు చేసిన‌ట్లు అధికారులు వెల్లడించారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారు తప్పనిసరిగా ఈ కోవిడ్ నిబంధనలను పాటించాలని సూచించారు. లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

Also Read:

కస్టమర్ల కోసం తన్నుకున్న పానీపూరి వ్యాపారులు.. ఇనుపరాడ్లతో కొట్లాట.. వైరల్ అవుతున్న వీడియో.!!