AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా ప్రభావం….జాతినుద్దేశించి నేడు ప్రధాని కీలక ప్రసంగం

ప్రపంచ దేశాల ఉమ్మడి శత్రువుగా మారిన కరోనావైరస్‌(కొవిడ్-19)ను ఎదుర్కొనేందుకు భారత్ సంసిద్ధమైంది. వ్యాధిని కట్టడి చేసేందుకు ఇప్పటికే ఎన్నో చర్యలను చేపట్టింది. ఈ క్రమంలో దేశంలో కరోనా వైరస్ తీవ్రతపై ప్రధాని నరేంద్ర మోదీ...

కరోనా ప్రభావం....జాతినుద్దేశించి నేడు ప్రధాని కీలక ప్రసంగం
Jyothi Gadda
|

Updated on: Mar 19, 2020 | 8:19 AM

Share

కంటికి కనిపించని శత్రువుతో ప్రపంచదేశాలు యుద్ధం చేస్తున్నాయి. వందల సంఖ్యలో దేశాలు ఆ శత్రువు బారి నుంచి తప్పించుకోలేక విలవిల్లాడుతున్నాయి. వేల సంఖ్యలో ప్రజలు దాని బారిన పడి ప్రాణాలు కొల్పోయారు. ఎంతోమంది నిపుణులు, శాస్త్రవేత్తలు పరిష్కారం దిశగా అహర్నిషలు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇప్పుడు ప్రపంచ దేశాల ఉమ్మడి శత్రువుగా మారిన కరోనావైరస్‌(కొవిడ్-19)ను ఎదుర్కొనేందుకు భారత్ సంసిద్ధమైంది. వ్యాధిని కట్టడి చేసేందుకు ఇప్పటికే ఎన్నో చర్యలను చేపట్టింది. ఈ క్రమంలో దేశంలో కరోనా వైరస్ తీవ్రతపై ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం అన్ని శాఖలవారితో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.

కరోనా నియంత్రణకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపై ప్రధాని నరేంద్రమోదీ చర్చించారు. వైద్య ఆరోగ్యశాఖతో పాటు హోం, విదేశాంగశాఖ, ఆర్మీ ఉన్నతాధికారులను అడిగి పరిస్థితిని తెలుసుకున్నారు. వ్యాధిని అరికట్టేందుకు ఇప్పటి వరకు చేపట్టిన చర్యలు, రానున్న రోజుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. కరోనా వైరస్ తర్వాతి దశపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులు, నిపుణులు వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు. కరోనా వైరస్‌ నియంత్రణ కోసం ముందు నిలబడి పోరాడుతున్న వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు, వైద్య నిపుణులు, పారామెడికల్ స్టాఫ్, ఆర్మీ, పారామిలటరీ బలగాలు, విమానయాన శాఖ, మున్సిపల్ సిబ్బందిని మోదీ కొనియాడారు. ఇక కరోనా వైరస్‌పై ఈ రోజు రాత్రి 8 గంటలకు జాతినుద్దేశించి కీలక ప్రసంగం చేయబోతున్నారు ప్రధాని. అంతకంతకూ విస్తరిస్తోన్న వైరస్ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించబోయే నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Follow Us
మంగళవారం నాడు పొరపాటున కూడా ఆ పనులు చేయకండి, క్ష్మీదేవికి ఆగ్రహం!
మంగళవారం నాడు పొరపాటున కూడా ఆ పనులు చేయకండి, క్ష్మీదేవికి ఆగ్రహం!
మీ పాత ఫోన్‌ను పైసా ఖర్చు లేకుండా సీసీటీవీగా మార్చేయండి..
మీ పాత ఫోన్‌ను పైసా ఖర్చు లేకుండా సీసీటీవీగా మార్చేయండి..
వంకాయ, ఎండు చేప, కోడి గుడ్లకూర.. ఊరించే పల్లెటూరి రుచి!
వంకాయ, ఎండు చేప, కోడి గుడ్లకూర.. ఊరించే పల్లెటూరి రుచి!
ఫ్రాన్స్‌లో ప్రధాని మోదీ, ట్రంప్ భేటీ
ఫ్రాన్స్‌లో ప్రధాని మోదీ, ట్రంప్ భేటీ
ఫ్రిజ్ పైన పొరపాటున కూడా ఈ వస్తువులను ఉంచకండి.. నెగటివ్ ఎనర్జీకి
ఫ్రిజ్ పైన పొరపాటున కూడా ఈ వస్తువులను ఉంచకండి.. నెగటివ్ ఎనర్జీకి
వడ్డే నవీన్ మొదటి భార్య ఆ టాలీవుడ్ స్టార్ హీరో సోదరి అని తెలుసా?
వడ్డే నవీన్ మొదటి భార్య ఆ టాలీవుడ్ స్టార్ హీరో సోదరి అని తెలుసా?
ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. సప్లిమెంటరీ రిజల్ట్ ఇలా చెక్..
ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. సప్లిమెంటరీ రిజల్ట్ ఇలా చెక్..
స్మృతి, షఫాలీ ఊచకోత.. టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా భారీ రికార్డ్
స్మృతి, షఫాలీ ఊచకోత.. టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా భారీ రికార్డ్
సైబర్ నేరగాళ్ల టార్గెట్‌గా డాక్టర్లు.. రూ.29.8 కోట్లు దోపిడీ!
సైబర్ నేరగాళ్ల టార్గెట్‌గా డాక్టర్లు.. రూ.29.8 కోట్లు దోపిడీ!
తిరుపతిలో eRZL హైడ్రేషన్ అవగాహన కార్యక్రమం
తిరుపతిలో eRZL హైడ్రేషన్ అవగాహన కార్యక్రమం