ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ జిల్లాలో లాక్ డౌన్ మరింత కఠినతరం..

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 647 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. వాటిలో అత్యధికంగా, కర్నూలు(158), గుంటూరు(129) జిల్లాల్లో ఉన్నాయి. ఈ నేపధ్యంలో గుంటూరులో కరోనా కట్టడి చేసేందుకు ప్రభుత్వం కొత్త నిబంధనలను ఇవాళ్టి నుంచి అమలులోకి తీసుకొచ్చింది. లాక్ డౌన్ ముగిసేవరకు ఈ రూల్స్ పాటిస్తే.. కనీసం కొత్త కరోనా కేసులు నమోదయ్యే అవకాశాలు తగ్గుతాయని అధికారులు భావిస్తున్నారు. కొత్త నిబంధనలు ప్రకారం.. రోడ్లపైకి ప్రజలు రావాలంటే […]

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ జిల్లాలో లాక్ డౌన్ మరింత కఠినతరం..
Follow us

|

Updated on: Apr 20, 2020 | 7:26 AM

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 647 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. వాటిలో అత్యధికంగా, కర్నూలు(158), గుంటూరు(129) జిల్లాల్లో ఉన్నాయి. ఈ నేపధ్యంలో గుంటూరులో కరోనా కట్టడి చేసేందుకు ప్రభుత్వం కొత్త నిబంధనలను ఇవాళ్టి నుంచి అమలులోకి తీసుకొచ్చింది. లాక్ డౌన్ ముగిసేవరకు ఈ రూల్స్ పాటిస్తే.. కనీసం కొత్త కరోనా కేసులు నమోదయ్యే అవకాశాలు తగ్గుతాయని అధికారులు భావిస్తున్నారు.

కొత్త నిబంధనలు ప్రకారం.. రోడ్లపైకి ప్రజలు రావాలంటే కేవలం మూడు గంటలు మాత్రమే అనుమతి ఉంది. అది కూడా ఉదయం 6 నుంచి 9 గంటల వరకూ మాత్రమే. అటు కిరాణా షాపులు, పండ్ల మార్కెట్, రైతు బజార్లు, జనరల్ మార్కెట్లు ఉదయం 9 వరకూ మాత్రమే ఉంటాయి. ఇక పాలు, పాల ఉత్పత్తులు ఉదయం 4 గంటల నుంచి 8 గంటల వరకు అందుబాటులో ఉంటాయి. మరోవైపు ఉదయం 7 నుంచి సాయంత్రం 7 వరకు టేక్ ఎవే హోటల్స్‌కి అనుమతి ఉంది.

ప్రభుత్వ, పోలీస్, ఫైర్, ఎలక్ట్రిసిటీ, రెవెన్యూ, వీఎంసీ, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్‌మెంట్ వెహికిల్స్ మాత్రం యధావిధిగా వెళ్ళవచ్చు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా వాహనాలు, ఆయిల్ అండ్ గ్యాస్ ఫిల్లింగ్ వాహనాలు, మొబైల్ కమ్యూనికేషన్ వాహనాలకు ప్రత్యేక అనుమతులు ఉన్నాయి. ఇక ఒకే చోట పది మంది గుమిగూడరాదు. ఈ నిబంధనలను ప్రజలు ఖచ్చితంగా పాటించాలని.. ఒకవేళ రూల్స్ అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని గుంటూరు జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ హెచ్చరించారు.

Also Read:

లాక్‌డౌన్‌ బేఖాతర్… అంత్యక్రియలకు వేల సంఖ్యలో హాజరైన ముస్లింలు..

కరోనా వేళ.. నార్త్ కొరియా అధ్యక్షుడు అదృశ్యం.. అసలు ఏమైంది.?

చైనాలోని ల్యాబ్‌లో కరోనా వైరస్‌ను సృష్టించారు: నోబెల్ గ్రహీత

మూడు నెలలు అద్దె అడగకండి… సర్కార్ కీలక నిర్ణయం..

లాక్ డౌన్ సడలింపులు.. నేటి నుంచి వీటికి అనుమతి…