ఏపీ, తెలంగాణ‌లో క‌రోనా కేసుల సంఖ్య ఇలా..

భార‌త్‌లోకి ప్ర‌వేశించిన క‌రోనా వైర‌స్ పంజా విసురుతోంది. దీంతో కేంద్రం విధించిన లాక్‌డౌన్‌తో యావ‌త్ భార‌త‌వ‌ని గ‌డ‌ప‌దాట‌కుండా కోవిడ్ తో యుద్ధం చేస్తోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు క‌రోనా మ‌హ‌మ్మారిని ఎదుర్కొనేందుకు

ఏపీ, తెలంగాణ‌లో క‌రోనా కేసుల సంఖ్య ఇలా..
Follow us

|

Updated on: Apr 20, 2020 | 10:15 AM

కోవిడ్‌-19:
 అక్క‌డెక్క‌డో చైనా దేశంలో పుట్టింది. ప్ర‌పంచ దేశాల‌తై ఆదిప‌త్యం చెలాయిస్తూ ప్ర‌తాపం చూపుతోంది. క‌రోనా దెబ్బ‌కు ప్ర‌పంచ దేశాలు గ‌డ‌గ‌డ‌లాడిపోతున్నాయి. అన్ని దేశాల స్థితిగ‌తులు పూర్త‌గా త‌ల‌కిందులైపోయాయి. భార‌త్‌లోకి ప్ర‌వేశించిన క‌రోనా వైర‌స్ పంజా విసురుతోంది. దీంతో కేంద్రం విధించిన లాక్‌డౌన్‌తో యావ‌త్ భార‌త‌వ‌ని గ‌డ‌ప‌దాట‌కుండా కోవిడ్ తో యుద్ధం చేస్తోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు క‌రోనా మ‌హ‌మ్మారిని ఎదుర్కొనేందుకు ప‌టిష్ట చ‌ర్య‌లు చేప‌డుతున్నాయి. అయిన‌ప్ప‌టికీ ఇరు రాష్ట్రాల్లో కేసుల సంఖ్య త‌గ్గ‌డం లేదు.
తెలంగాణః రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య ఏమాత్రం ఆగట్లేదు. ఆదివారం మళ్లీ 49 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ముగ్గురు మ‌ర‌ణించారు. ఇప్ప‌టివరకు రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 858కి చేరుకోగా, మొత్తం 21 మంది చనిపోయారు. కాగా, కరోనా నుంచి ఇప్పటివరకు 186 మంది కోలుకొని ఆస్ప‌త్రి  నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. మరోవైపు ప్రస్తుతం 651 మంది చికిత్స పొందుతున్నారు. కాగా, నారాయణపేట జిల్లా మద్దూరు మండలంలోని రెనివట్లకు చెందిన రెండు నెలల మగశిశువు కరోనాతో చికిత్స పొందుతూ మృతి చెందినట్టు తహసీల్దార్‌ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. చిన్నారికి చికిత్స అందించిన నీలోఫ‌ర్ వైద్యుల‌ను క్వారంటైన్‌కు వెళ్లాల‌ని సూచిస్తూ అధికారులు ఆదేశించిన విష‌యం తెలిసిందే.
ఆంధ్ర‌ప్ర‌దేశ్ః ఏపీలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఆదివారం 647కి చేరింది. గత 24 గంటల్లో  కొత్తగా 44 కేసులు నమోదయ్యాయి. ఇందులో కర్నూలు జిల్లాలో 26, కృష్ణాలో 6, తూర్పు గోదావరిలో 5, అనంతపురంలో 3, గుంటూరులో 3, విశాఖపట్నంలో ఒక కేసు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ రాష్ట్ర నోడల్‌ అధికారి ఆదివారం విడుదల చేసిన బులెటిన్‌లో వెల్లడించారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 647కు చేరింది. కరోనాతో ఇప్పటి వరకు 17 మంది మృతి చెందగా, చికిత్స అనంతరం కోలుకుని మొత్తం 65 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. ప్రస్తుతం 565 మంది చికిత్స పొందుతున్నారు. 
ఇదిలా ఉంటే, కరోనా వైరస్ బారిన పడి నట్లుగా అనుమానాలు ఉన్న వ్యక్తులకు పరీక్షలు చేయడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం   పక్కా వ్యూహంతో సామర్ధ్యాన్ని పెంచు కుంటోంది.  ఇప్పటికే కరోనా టెస్టుల చేసే రాష్ట్రాల్లో ఏపీ రెండో స్థానంలో ఉండగా మరో మూడు నాలుగు రోజు ల్లోనే అగ్రస్థానానికి చేరుకునే అవకాశం ఉందని అధికారవర్గాలు చెబుతున్నాయి.
corona positive cases rises in AP and Telangana coronavirus cases increase telugu states

Latest Articles
రాణించిన స్టొయినిస్.. మళ్లీ ఓడిన ముంబై..ప్లే ఆఫ్ అవకాశాలు గల్లంతు
రాణించిన స్టొయినిస్.. మళ్లీ ఓడిన ముంబై..ప్లే ఆఫ్ అవకాశాలు గల్లంతు
బరాబర్ అలాంటి సినిమాలే చేస్తా'..అన్న పూరణి వివాదంపై నయన తార
బరాబర్ అలాంటి సినిమాలే చేస్తా'..అన్న పూరణి వివాదంపై నయన తార
బన్నీ పాటకు రణ్ వీర్ డ్యాన్స్..ఊ అంటావా మావా అంటూ మాస్ స్టెప్పులు
బన్నీ పాటకు రణ్ వీర్ డ్యాన్స్..ఊ అంటావా మావా అంటూ మాస్ స్టెప్పులు
మీ వాట్సాప్‌ గ్రీన్‌ కలర్‌లోకి మారిందా.? దీనికి అసలు కారణం ఏంటంటే
మీ వాట్సాప్‌ గ్రీన్‌ కలర్‌లోకి మారిందా.? దీనికి అసలు కారణం ఏంటంటే
బెస్ట్‌ డీల్‌.. ఈ స్మార్ట్ ఫోన్‌పై రూ. 7 వేల వరకు డిస్కౌంట్‌..
బెస్ట్‌ డీల్‌.. ఈ స్మార్ట్ ఫోన్‌పై రూ. 7 వేల వరకు డిస్కౌంట్‌..
ముంబై మళ్లీ తడ 'బ్యాటు'.. లక్నో టార్గెట్ ఎంతంటే?
ముంబై మళ్లీ తడ 'బ్యాటు'.. లక్నో టార్గెట్ ఎంతంటే?
అశ్లీల వీడియోల రచ్చ.. ఎంపీ ప్ర‌జ్వ‌ల్ రేవ‌ణ్ణ‌పై జేడీఎస్ వేటు
అశ్లీల వీడియోల రచ్చ.. ఎంపీ ప్ర‌జ్వ‌ల్ రేవ‌ణ్ణ‌పై జేడీఎస్ వేటు
కాల్పులతో దద్దరిల్లిన దండకారణ్యం.. 10 మంది మావోయిస్టులు మృతి..
కాల్పులతో దద్దరిల్లిన దండకారణ్యం.. 10 మంది మావోయిస్టులు మృతి..
ఐపీఎల్ నుంచి 9 మంది ఇంగ్లండ్ స్టార్ ఆటగాళ్లు ఔట్.. కారణమిదే
ఐపీఎల్ నుంచి 9 మంది ఇంగ్లండ్ స్టార్ ఆటగాళ్లు ఔట్.. కారణమిదే
భారీ యాక్షన్ ఓరియంటెడ్ గా ప్రభాస్ స్పిరిట్ సినిమా.
భారీ యాక్షన్ ఓరియంటెడ్ గా ప్రభాస్ స్పిరిట్ సినిమా.