AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వరల్డ్ అప్డేట్: ప్రపంచవ్యాప్తంగా 23 లక్షల కేసులు.. 1.61 లక్షల మృతులు..

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. ఇప్పటికే ఈ మహమ్మారి 210 దేశాలకు పాకింది. గంట గంటకూ కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. శవాలను భద్రపరచడానికి మార్చురీలు కూడా సరిపోవడం లేదు. ఇక యూరోప్ లో అయితే కరోనా మరణ మృదంగం వాయిస్తోంది. ఇదిలా ఉంటే ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ బాధితుల సంఖ్య 2,359,346 చేరింది. అటు గడిచిన 24 గంటల్లో ఏకంగా 5,909 మంది చనిపోవడంతో ఈ వైరస్ తీవ్రత ఏ స్థాయిలో […]

వరల్డ్ అప్డేట్: ప్రపంచవ్యాప్తంగా 23 లక్షల కేసులు.. 1.61 లక్షల మృతులు..
Ravi Kiran
|

Updated on: Apr 19, 2020 | 10:09 PM

Share

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. ఇప్పటికే ఈ మహమ్మారి 210 దేశాలకు పాకింది. గంట గంటకూ కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. శవాలను భద్రపరచడానికి మార్చురీలు కూడా సరిపోవడం లేదు. ఇక యూరోప్ లో అయితే కరోనా మరణ మృదంగం వాయిస్తోంది.

ఇదిలా ఉంటే ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ బాధితుల సంఖ్య 2,359,346 చేరింది. అటు గడిచిన 24 గంటల్లో ఏకంగా 5,909 మంది చనిపోవడంతో ఈ వైరస్ తీవ్రత ఏ స్థాయిలో ఉందన్నది తెలుస్తోంది. ఇప్పటివరకు కరోనా బారిన పడి 161,951 మంది ప్రాణాలు కోల్పోగా.. 606,705 మంది కోలుకున్నారు.

అగ్రరాజ్యం అమెరికా, స్పెయిన్, ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్, చైనా, ఇరాన్, బ్రిటన్ దేశాల్లో ఈ వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంది. అత్యధిక కేసులు(740,151), మరణాలు(39,068) అమెరికాలో నమోదయ్యాయి. కాగా, ఇండియాలో ఇప్పటివరకు 16116 కేసులు నమోదు కాగా.. 519 మృతి చెందారు.

కరోనా తీవ్రత ఎక్కువ ఉన్న దేశాల లిస్ట్…

  • అమెరికా – 740,151 కేసులు, 39,068 మరణాలు
  • స్పెయిన్ – 195,944 కేసులు, 20,453 మరణాలు
  • ఇటలీ – 175,925 కేసులు, 23,227 మరణాలు
  • ఫ్రాన్స్ – 151,793 కేసులు, 19,323 మరణాలు
  • జర్మనీ – 144,348 కేసులు, 4,547 మరణాలు
  • బ్రిటన్ – 120,067 కేసులు, 16,060 మరణాలు
  • చైనా – 82,735 కేసులు, 4,632 మరణాలు
  • టర్కీ – 82,329 కేసులు, 1,890 మరణాలు
  • ఇరాన్ -82,211 కేసులు, 5,118 మరణాలు
  • రష్యా – 42,853 కేసులు, 361 మరణాలు
  • ఇండియా – 16116 కేసులు, 519 మరణాలు

Also Read:

లాక్‌డౌన్‌ బేఖాతర్… అంత్యక్రియలకు వేల సంఖ్యలో హాజరైన ముస్లింలు..

కరోనా వేళ.. నార్త్ కొరియా అధ్యక్షుడు అదృశ్యం.. అసలు ఏమైంది.?

చైనాలోని ల్యాబ్‌లో కరోనా వైరస్‌ను సృష్టించారు: నోబెల్ గ్రహీత

మూడు నెలలు అద్దె అడగకండి… సర్కార్ కీలక నిర్ణయం..

ఏపీలో ఐదు రోజుల్లోనే రేషన్ కార్డు.. అదంతా ఫేకేనట.. అసలు నిజమిదే..

వలస కార్మికులకు ఊరట.. కేంద్రం కీలక నిర్ణయం..

ఈ కామర్స్ సంస్థలకు షాక్.. ఆ నిర్ణయంపై వెనక్కి తగ్గిన కేంద్రం

‘దేశద్రోహుల పట్ల నేనింతే’.. అఫ్రిదీకి గంభీర్ స్ట్రాంగ్ కౌంటర్..

Breaking: మే 7 వరకు తెలంగాణలో స్విగ్గీ, జోమాట బ్యాన్…

Breaking: మే నెలలోనూ రేషన్ ఫ్రీ.. వలస కూలీలకు కూడా…