‘దేశద్రోహుల పట్ల నేనింతే’.. అఫ్రిదీకి గంభీర్ స్ట్రాంగ్ కౌంటర్..

భారత మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్, పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిదీల గొడవ ముదురుతూనే ఉంది. అఫ్రిదీ తన ఆత్మకధ ‘ది గేమ్ ఛేంజర్’లో గంభీర్ ఎప్పుడూ గొడవలు పడుతుంటాడని ప్రస్తావించాడు. అంతేకాకుండా అతని కెరీర్‌లో చెప్పుకోదగిన రికార్డులు ఏమి లేవని.. యాటిట్యూడ్ మాత్రం బాగా ఉందని ఆరోపణలు గుప్పించాడు. వీటికి అప్పట్లోనే గంభీర్ అఫ్రిదీకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. ఇక ఇప్పుడు మరోసారి అఫ్రిదీ గంభీర్‌పై నోరు పారేసుకున్నాడు. ‘గంభీర్ ప్రవర్తన వ్యక్తిత్వం లేనిదని […]

'దేశద్రోహుల పట్ల నేనింతే'.. అఫ్రిదీకి గంభీర్ స్ట్రాంగ్ కౌంటర్..
Follow us

|

Updated on: Apr 19, 2020 | 8:08 PM

భారత మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్, పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిదీల గొడవ ముదురుతూనే ఉంది. అఫ్రిదీ తన ఆత్మకధ ‘ది గేమ్ ఛేంజర్’లో గంభీర్ ఎప్పుడూ గొడవలు పడుతుంటాడని ప్రస్తావించాడు. అంతేకాకుండా అతని కెరీర్‌లో చెప్పుకోదగిన రికార్డులు ఏమి లేవని.. యాటిట్యూడ్ మాత్రం బాగా ఉందని ఆరోపణలు గుప్పించాడు. వీటికి అప్పట్లోనే గంభీర్ అఫ్రిదీకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు.

ఇక ఇప్పుడు మరోసారి అఫ్రిదీ గంభీర్‌పై నోరు పారేసుకున్నాడు. ‘గంభీర్ ప్రవర్తన వ్యక్తిత్వం లేనిదని ఐసీసీ టోర్నీలలో రికార్డులు లేవు కానీ యాటిట్యూడ్ మాత్రం ఎక్కువగా ఉండేదని’ కామెంట్ చేశాడు. దీనిపై ఆగ్రహించిన గంభీర్ తనదైన శైలిలో రిప్లై ఇచ్చాడు. ‘నీ ఏజ్‌ను కూడా సరిగ్గా గుర్తించుకోలేని వ్యక్తివి.. నీకు నా రికార్డులు ఎలా గుర్తుంటాయి. సరే నీకు ఓ విషయాన్ని గుర్తు చేస్తా.. 2007 టీ20 ప్రపంచకప్ ఫైనల్. భారత్-పాకిస్థాన్ మ్యాచ్ లో నేను 54 బంతుల్లో 75పరుగులు చేశాను. నువ్వు మొదటి బంతికే డకౌట్ అయ్యావు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. మేం కప్పు గెలిచాం. అంతేగాక అబద్ధాలు చెప్పవారు, దేశద్రోహులు, అవకాశవాదుల పట్ల నా ప్రవర్తన ఎప్పుడూ దురుసుగానే ఉంటుంది’ అని గంభీర్ స్ట్రాంగ్ ట్వీట్ చేశాడు. ఏది ఏమైనా గంభీర్ చేసిన ట్వీట్‌ కొద్ది క్షణాల్లోనే వైరల్ అయింది.

Also Read:

లాక్‌డౌన్‌ బేఖాతర్… అంత్యక్రియలకు వేల సంఖ్యలో హాజరైన ముస్లింలు..

కరోనా వేళ.. నార్త్ కొరియా అధ్యక్షుడు అదృశ్యం.. అసలు ఏమైంది.?

చైనాలోని ల్యాబ్‌లో కరోనా వైరస్‌ను సృష్టించారు: నోబెల్ గ్రహీత

మూడు నెలలు అద్దె అడగకండి… సర్కార్ కీలక నిర్ణయం..

ఏపీలో ఐదు రోజుల్లోనే రేషన్ కార్డు.. అదంతా ఫేకేనట.. అసలు నిజమిదే..

వలస కార్మికులకు ఊరట.. కేంద్రం కీలక నిర్ణయం..

ఈ కామర్స్ సంస్థలకు షాక్.. ఆ నిర్ణయంపై వెనక్కి తగ్గిన కేంద్రం

Latest Articles