గతేడాది మార్చి బిల్లు కడితే చాలు.. టీఎస్ఈఆర్సీ ఆదేశాలు..

Coronavirus Lockdown: దేశవ్యాప్త లాక్ డౌన్ కొనసాగుతున్న నేపధ్యంలో తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి కీలక నిర్ణయం తీసుకుంది. గతేడాది మార్చిలో వచ్చిన కరెంట్ బిల్లును.. ఈ నెలలో మళ్లీ ఆన్లైన్ ద్వారా చెల్లిస్తే సరిపోతుందని వినియోగదారులకు తెలియజేసింది. అటు వాణిజ్య సముదాయాలు, పరిశ్రమలకైతే 2019 మార్చిలో వచ్చిన బిల్లులో సగం అమౌంట్ ఇప్పుడు కడితే సరిపోతుందని తెలిపింది. బిల్లు వివరాలన్నింటిని కూడా విద్యుత్ పంపిణీ సంస్థలు డైరెక్ట్ మీ ఫోన్లకే ఎస్ఎంఎస్‌ల ద్వారా పంపిస్తారు. […]

గతేడాది మార్చి బిల్లు కడితే చాలు.. టీఎస్ఈఆర్సీ ఆదేశాలు..
Follow us

|

Updated on: Apr 08, 2020 | 1:14 PM

Coronavirus Lockdown: దేశవ్యాప్త లాక్ డౌన్ కొనసాగుతున్న నేపధ్యంలో తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి కీలక నిర్ణయం తీసుకుంది. గతేడాది మార్చిలో వచ్చిన కరెంట్ బిల్లును.. ఈ నెలలో మళ్లీ ఆన్లైన్ ద్వారా చెల్లిస్తే సరిపోతుందని వినియోగదారులకు తెలియజేసింది. అటు వాణిజ్య సముదాయాలు, పరిశ్రమలకైతే 2019 మార్చిలో వచ్చిన బిల్లులో సగం అమౌంట్ ఇప్పుడు కడితే సరిపోతుందని తెలిపింది.

బిల్లు వివరాలన్నింటిని కూడా విద్యుత్ పంపిణీ సంస్థలు డైరెక్ట్ మీ ఫోన్లకే ఎస్ఎంఎస్‌ల ద్వారా పంపిస్తారు. దీని ప్రకారం ఆన్లైన్‌లో బిల్లు చెల్లిస్తే చాలు. లాక్ డౌన్ కారణంగా మీటర్ రీడింగ్ తీసుకునే అవకాశం లేనందున డిస్కంలకు ఈ వెసులుబాటు కల్పిస్తూ టీఎస్ఈఆర్సీ మంగళవారం ఆదేశాలు జారీ చేసింది.

ఇక లాక్ డౌన్ ముగిసిన తరువాత ఇంటింటికీ వెళ్లి మీటర్ రీడింగ్ తీసుకుని విద్యుత్ సిబ్బంది బిల్లు ఇవ్వనున్నారు. ఇప్పుడు మీరు ఆన్లైన్ ద్వారా కట్టిన సొమ్మును అందులో సర్దుబాటు చేస్తారు. అటు ఒకవేళ ఇప్పుడు తక్కువ కడితే అదనంగా చెల్లించాలని వచ్చే నెల బిల్లులో కలిపి ఇస్తారు.

అయితే లాక్ డౌన్ తర్వాత మీటర్ రీడింగ్ మార్చి 1 నుంచి మే 1 వరకు రెండు నెలలకు ఒకేసారి తీస్తారు కాబట్టి ఎక్కువ యూనిట్లు బిల్లు రావడమే కాకుండా రేట్ కూడా పెరిగిపోయే అవకాశం ఉందని కొంతమంది విద్యుత్ సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు. అయితే అలాంటి సమస్యలు తలెత్తకుండా రీడింగ్ ఎన్ని రోజుల తర్వాత తీసినా కేవలం 30 రోజులకు మాత్రమే బిల్లు వచ్చేలా సర్వర్‌లో మార్పులు చేస్తామని దక్షిణ డిస్కం సీఎండీ రఘురాంరెడ్డి తెలిపారు.

For More News:

ఏపీలో దశలవారీగా లాక్ డౌన్ ఎత్తివేత..!

కరోనా బాధితులకు ‘తలా’ భారీ విరాళం..

చికెన్ వ్యాపారికి కరోనా పాజిటివ్.. విశాఖలో టెన్షన్..

‘విక్రమ్‌వేద’ రీమేక్‌లో పవన్, రవితేజ.. ముహూర్తం ఫిక్స్..!

ఆ బొమ్మ ఇప్పటికీ నా దగ్గరే ఉంది – చిరంజీవి

దేశంలో 5 వేలు దాటిన కరోనా కేసులు.. మహారాష్ట్ర మొదటి స్థానం..

వారం పనిచేస్తే 14 రోజుల సెలవులు.. జగన్ సర్కార్ నిర్ణ‌యం.!

ఏపీలో టెన్త్ విద్యార్ధులకు గుడ్ న్యూస్..

లాక్ డౌన్ ఎఫెక్ట్.. వీధి కుక్కల్లో వింత ప్రవర్తన.. రసాయనాలు తట్టుకోలేక మృతి..