మందుబాబులకు “లిక్కర్ దానం”.. యువకుడి అరెస్ట్…

మందుబాబులకు లిక్కర్ దానం.. యువకుడి అరెస్ట్...

దేశవ్యాప్త లాక్ డౌన్ కారణంగా మందుబాబులకు కంటి మీద కునుకు పడటం లేదు.. చుక్క పడితేనే గానీ రోజు గడవని వాళ్లకు లిక్కర్ షాపులు బంద్ కావడంతో నానా అవస్థలు పడుతున్నారు. కొన్ని చోట్ల అయితే మద్యానికి బానిసైన వీళ్లు వింతగా ప్రవర్తించడమే కాకుండా.. ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారు. ఇక తెలంగాణలో అయితే మందుబాబులకు పిచ్చి పడుతుండగా.. దీనితో ఎర్రగడ్డ పిచ్చాసుపత్రిలో కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వింత ప్రవర్తిస్తున్న వారిని వెంటనే […]

Ravi Kiran

|

Apr 14, 2020 | 10:14 PM

దేశవ్యాప్త లాక్ డౌన్ కారణంగా మందుబాబులకు కంటి మీద కునుకు పడటం లేదు.. చుక్క పడితేనే గానీ రోజు గడవని వాళ్లకు లిక్కర్ షాపులు బంద్ కావడంతో నానా అవస్థలు పడుతున్నారు. కొన్ని చోట్ల అయితే మద్యానికి బానిసైన వీళ్లు వింతగా ప్రవర్తించడమే కాకుండా.. ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారు. ఇక తెలంగాణలో అయితే మందుబాబులకు పిచ్చి పడుతుండగా.. దీనితో ఎర్రగడ్డ పిచ్చాసుపత్రిలో కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వింత ప్రవర్తిస్తున్న వారిని వెంటనే డీ ఎడిక్షన్ సెంటర్‌లో చికిత్స అందించాలని ఆదేశాలు జారీ చేసినా పరిస్థితి ఓ కొలిక్కి రావట్లేదు. ఇలాంటి తరుణంలో రెండో దశ లాక్ డౌన్‌ను కేంద్రం మే 3 వరకు పొడిగించడంతో హైదరాబాద్‌లో ఓ విచిత్రమైన సన్నివేశం చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే ఆదివారం హైదరాబాద్‌లోని పాతబస్తీకి చెందిన కుమార్ అనే యువకుడు మందుబాబులకు లిక్కర్ దానం చేయడం షురూ చేశాడు. స్థానిక బ్రాహ్మణవాడీ ప్రాంతంలో ఉన్నవారికి మద్యం ప్లాస్టిక్ గ్లాసుల్లో పోసి ఉచితంగా పంపిణీ చేశాడు. ఈ విధంగా సుమారు 10 బాటిళ్ల మద్యాన్ని దానం చేశాడు. ఇక ఈ తతంగాన్ని అతడి ఫ్రెండ్ వీడియో తీసి టిక్‌టాక్‌లో పోస్ట్ చేయగా.. అది కాస్తా నెట్టింట్లో వైరల్ అయింది. కాగా, ఆ వీడియో పోలీసుల దృష్టికి చేవెళ్లడంతో.. లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించినందుకు గానూ సరూర్‌నగర్ ఎక్సైజ్ అధికారులు కుమార్‌పై సెక్షన్ 34(a) ఆఫ్ తెలంగాణ ఎక్సైజ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. సాయం చేసినట్లు మందుబాబులకు ‘లిక్కర్ దానం’ చేశాడు.. పోలీసులు వచ్చి అత్తారింటికి తీసుకెళ్ళారు..

ఇవి చదవండి:

లాక్ డౌన్ అమలులో విజయవంతం.. ఏపీ అగ్రస్థానం.!

అక్తర్‌కు అఫ్రిదీ వత్తాసు.. మోదీ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు..

ఏపీ: రెడ్‌జోన్‌లో 41.. ఆరెంజ్‌ జోన్‌లో 45.. గ్రీన్ జోన్‌లో 590… షరతులు వర్తిస్తాయి.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu