ఏపీలో 420, తెలంగాణ 531.. మరణాల సంఖ్య..

తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తోంది. ఇప్పటికే రెండు రాష్ట్రాల్లో కలిసి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య.. వెయ్యికి చేరువలో ఉంది. గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 15 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 420 కి చేరింది. ఇక తెలంగాణలో కొత్తగా మరో 28 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య 531కి […]

ఏపీలో 420, తెలంగాణ 531.. మరణాల సంఖ్య..
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Apr 12, 2020 | 10:10 PM

తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తోంది. ఇప్పటికే రెండు రాష్ట్రాల్లో కలిసి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య.. వెయ్యికి చేరువలో ఉంది. గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 15 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 420 కి చేరింది.

ఇక తెలంగాణలో కొత్తగా మరో 28 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య 531కి చేరింది. ఆదివారం రోజు ఇద్దరు మృతి చెందడంతో.. మృతుల సంఖ్య 16కి చేరింది. ఇక ఆదివారం రోజు ఏడుగురు డిశ్చార్జ్‌ అయ్యారు. దీంతో మొత్తం డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 103కి చేరింది.