తెలంగాణలో పెరిగిన కేసులు.. ఒకరు మృతి..

తెలంగాణలో కరోనా మహమ్మారి కొద్ది రోజులుగా తగ్గుముఖం పడుతుందని అంతా ఊపిరి పీల్చుకుంటుండగా.. మళ్లీ సడన్‌గా కేసులు పెరుగుతున్నాయి. మొన్నటికి మొన్న వరుసగా మూడు నాలుగు రోజులు సింగిల్ డిజిట్‌ నమోదైన కేసులు.. అకస్మాత్తుగా మళ్లీ డబుల్ డిజిట్‌కు చేరుకుంటున్నాయి. శనివారం కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. అంతేకాదు.. కరోనా బారినపడి ఒకరు మృత్యువాత పడటం మళ్లీ అందర్నీ కలవరానికి గురిచేస్తోంది. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 29కి […]

తెలంగాణలో పెరిగిన కేసులు.. ఒకరు మృతి..
Follow us

| Edited By:

Updated on: May 02, 2020 | 10:08 PM

తెలంగాణలో కరోనా మహమ్మారి కొద్ది రోజులుగా తగ్గుముఖం పడుతుందని అంతా ఊపిరి పీల్చుకుంటుండగా.. మళ్లీ సడన్‌గా కేసులు పెరుగుతున్నాయి. మొన్నటికి మొన్న వరుసగా మూడు నాలుగు రోజులు సింగిల్ డిజిట్‌ నమోదైన కేసులు.. అకస్మాత్తుగా మళ్లీ డబుల్ డిజిట్‌కు చేరుకుంటున్నాయి. శనివారం కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. అంతేకాదు.. కరోనా బారినపడి ఒకరు మృత్యువాత పడటం మళ్లీ అందర్నీ కలవరానికి గురిచేస్తోంది. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 29కి చేరుకుంది.

తెలంగాణ వ్యాప్తంగా శనివారం నాడు కొత్తగా మరో 17 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1061కి చేరుకుంది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది. ఇక ఇవాళ 35 మంది కరోనా బారినుంచి బయటపడి ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 499 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారని.. 533 యాక్టివ్ కేసులు ఉన్నాయని పేర్కొంది.