తిరుమల శ్రీవారి దర్శనాల గురించి టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తాజా ప్రకటన విడుదల చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు మరో రెండు వారాల పాటు భక్తులకు దర్శనాలు ఉండవని తెలిపారు. మే 17వ తేదీ తర్వాత అప్పటి పరిస్థితులకు అనుగుణంగా అప్పటి నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు. అంతేకాదు లాక్‌డౌన్ ముగిసిన తర్వాత.. శ్రీవారి దర్శన విధానం, క్యులైన్లలో సోషల్ డిస్టెన్స్ వంటి అంశాలపై కసరత్తు చేస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం.. తిరుపతిలోని బర్డ్ ఆసుపత్రిలో సోమవారం నుండి ఓపీ సేవలు ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇక తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేసే ఔట్ సోర్సింగ్ కార్మికులు ఎవ్వరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కొత్త టెండర్లు కేటాయించే వరకు.. మరో నెల రోజులపాటు కాంట్రాక్ట్ గడువు పొడిగిస్తున్నామని తెలిపారు.