‘లాక్‌డౌన్’ వేళ పుట్టిన ఈ బుడ్డోడి పేరు తెలుసా..!

ప్రస్తుతం ప్రపంచమంతా ఎక్కడ విన్నా ఒకటే మాట. కరోనా.. కరోనా.. కరోనా. చైనాలో పుట్టిన ఈ వైరస్‌.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలకు విస్తరించింది.

'లాక్‌డౌన్' వేళ పుట్టిన ఈ బుడ్డోడి పేరు తెలుసా..!
Follow us

| Edited By:

Updated on: Apr 19, 2020 | 4:42 PM

ప్రస్తుతం ప్రపంచమంతా ఎక్కడ విన్నా ఒకటే మాట. కరోనా.. కరోనా.. కరోనా. చైనాలో పుట్టిన ఈ వైరస్‌.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలకు విస్తరించింది. లక్షా అరవై వేలకు పైగా ప్రజలు ఈ మహమ్మారి బారిన పడి మృత్యువాతపడ్డారు. ఈ నేపథ్యంలో చాలా దేశాలు లాక్‌డౌన్‌ను ప్రకటించాయి. కాగా కరోనా కాలంలో పుడుతోన్న చాలామంది పిల్లలకు.. ఈ వ్యాధి గురించి తరచుగా వినిపించే పదాలే పేర్లుగా మారుతున్నాయి. మొన్నటికిమొన్న ఛత్తీస్‌గడ్‌లో ఓ దంపతులు తమకు పుట్టిన కవలలకు కరోనా, కోవిడ్ అనే పేర్లు పెట్టగా.. తాజాగా ఓ అబ్బాయికి లాక్‌డౌన్‌ అనే పేరు పెట్టబోతున్నారు.

రాజస్థాన్‌కు చెందిన సంజయ్‌బౌరి, మంజు బౌరిదంపతులు.. వృత్తి రీత్యా ప్లాస్టిక్‌ వస్తువులను విక్రయించేందుకు ఆ మధ్యన త్రిపురకు వెళ్లారు. అయితే లాక్‌డౌన్ నేపథ్యంలో వారు అక్కడే ఇరుక్కుపోయారు. ఈ క్రమంలో ఇటీవల మంజు ఓ పండంటి బిడ్డకు జన్మనివ్వగా.. ఆ బాబుకు లాక్‌డౌన్ అనే పేరు పెట్టాలని నిర్ణయించుకున్నట్లు సంజయ్‌ బౌరి తెలిపారు. తమకు ఆశ్రయం కల్పించడంతో పాటు తన భార్యను ఆసుపత్రికి తరలించడంలో సహాయం చేసిన రైల్వే పోలీసులు, త్రిపుర రాష్ట్ర ప్రభుత్వానికి కృతఙ్ఞతలు తెలిపారు. లాక్‌డౌన్‌ ముగిసిన తరువాత తమ రాష్ట్రానికి వెళ్తామని సంజయ్‌ వెల్లడించారు.

Read This Story Also: ప్రేయసి లైవ్ చాట్.. సల్మాన్ ఏం చేశాడో తెలుసా..!