క్యా… కరోనా..రోజుకో రీతిలో మార్పులు

క్యా... కరోనా..రోజుకో రీతిలో మార్పులు

తెలంగాణలో కొత్తగా 21 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ప్రకటించారు. ఆదివారం న‌మోదైన‌ 21 కేసులతో కలిపి మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,082కు చేరింది. 14 రోజుల అనంత‌రం సిరిసిల్లా జగిత్యాల జిల్లాలో ఒక కేసు నమోదైంది. దీంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య మ‌ళ్లీ పెరుగుతోంది.   తెలంగాణలో కరోనా మ‌హ‌మ్మారి రోజుకో రీతిలో మారుతోంది. ఒక రోజు తక్కువ సంఖ్యలో కేసులు నమోదవుతుండగా.. ఇంకోరోజు అధికంగా […]

Jyothi Gadda

|

May 04, 2020 | 9:45 AM

తెలంగాణలో కొత్తగా 21 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ప్రకటించారు. ఆదివారం న‌మోదైన‌ 21 కేసులతో కలిపి మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,082కు చేరింది. 14 రోజుల అనంత‌రం సిరిసిల్లా జగిత్యాల జిల్లాలో ఒక కేసు నమోదైంది. దీంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య మ‌ళ్లీ పెరుగుతోంది.

తెలంగాణలో కరోనా మ‌హ‌మ్మారి రోజుకో రీతిలో మారుతోంది. ఒక రోజు తక్కువ సంఖ్యలో కేసులు నమోదవుతుండగా.. ఇంకోరోజు అధికంగా కేసులు నమోదవుతున్నారు. వారం కిందటి వరకు సింగిల్ డిజిట్‌కు చేరిన కేసులు ఇప్పుడు రెండంకెలకు చేరింది. తాజాగా ఆదివారం కొత్తగా 21 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈ కేసుల్లో 20  జీహెచ్ఎంసీ పరిధిలో నమోదు కాగా జగిత్యాలలో ఒక కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. ప్ర‌స్తుతం రాష్ట్ర‌వ్యాప్తంగా మొత్తం 533 మంది వివిధ ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతు‌న్నారు.
కొత్తగా నమోదైన కేసులతో కలిపి తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1082కి చేరింది. కొత్తగా 46 మంది డిశ్చార్జ్ కావడంతో ఇప్పటివరకు 545 మంది క‌రోనా నుంచి కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జయ్యారు. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 508. కాగా, కరోనా కార‌ణంగా  29 మంది మృతి చెందారు. అయితే, తెలంగాణ‌లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలోనే పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. 14 రోజుల్లో రాష్ట్రంలోని 17 జిల్లాలో కొత్తగా కరోనా కేసులు నమోదు కాకపోగా, ఒక్క గ్రేట‌ర్ ప‌రిధిలోనే కోవిడ్ కేసులు బ‌య‌ట‌ప‌డుతున్నాయి.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu