వుహాన్‌ ల్యాబ్‌ నుంచే కరోనా.. సాక్ష్యాధారాలు ఉన్నాయి: మైక్‌ పాంపియో

చైనాలోని వుహాన్ ల్యాబ్‌ నుంచే కరోనా విడుదలైందని అమెరికా మరోసారి ఆరోపించింది. అక్కడి నుంచి ఉద్దేశపూర్వకంగానే వైరస్‌ను విడుదల చేశారని..

వుహాన్‌ ల్యాబ్‌ నుంచే కరోనా.. సాక్ష్యాధారాలు ఉన్నాయి: మైక్‌ పాంపియో
Follow us

| Edited By:

Updated on: May 04, 2020 | 9:36 AM

చైనాలోని వుహాన్ ల్యాబ్‌ నుంచే కరోనా విడుదలైందని అమెరికా మరోసారి ఆరోపించింది. అక్కడి నుంచి ఉద్దేశపూర్వకంగానే వైరస్‌ను విడుదల చేశారని.. దీనికి సంబంధించిన సరైన సాక్ష్యాధారాలు తమ వద్ద ఉన్నాయని అమెరికా ప్రకటించింది. ఈ మేరకు అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా కరోనా విస్తరించడానికి చైనా ప్రభుత్వమే కారణమని విమర్శించారు. చైనా చేసిన కుట్రను త్వరలోనే ప్రపంచ దేశాల ముందుంచాతమని పాంపియో స్పష్టం చేశారు.

కాగా కరోనా వైరస్‌ను చైనానే సృష్టించిందని అమెరికా ముందునుంచే ఆరోపిస్తూ వస్తోంది. దీనిపై లోతుగా విచారణ జరుపుతామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇదివరకే ప్రకటించారు. తాజాగా జపాన్‌కు చెందిన ఓ శాస్త్రవేత్త సైతం కరోనా వుహాన్‌లో రూపొందించిందేనని చెప్పారు. దీంతో చైనాపై అమెరికా ఆరోపణలకు ఆజ్యం పోసినట్లైంది. ఇదిలా ఉంటే కరోనా వైరస్ కేసులు ప్రపంచవ్యాప్తంగా 35లక్షలను దాటేశాయి.

Read This Story Also: చిరు హిస్టారికల్ మూవీ విశేషాలు చెప్పబోతున్న నాని..!